కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • మోషే, మండుతున్న ముళ్లపొద (1-12)

      • యెహోవా తన పేరును వివరిస్తాడు (13-15)

      • యెహోవా మోషేకు నిర్దేశాలిస్తాడు (16-22)

నిర్గమకాండం 3:1

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:16; 18:1
  • +నిర్గ 24:12, 13; 1రా 19:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 24

నిర్గమకాండం 3:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:30-34

నిర్గమకాండం 3:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2009, పేజీ 32

నిర్గమకాండం 3:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 7
  • +ఆది 26:24
  • +ఆది 28:13; 32:9; మత్త 22:32; అపొ 7:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    కావలికోట,

    5/1/2005, పేజీ 13

నిర్గమకాండం 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:11; యెష 63:9; అపొ 7:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    కావలికోట (అధ్యయన),

    3/2019, పేజీ 15

    కావలికోట,

    7/1/2009, పేజీ 32

    7/1/2003, పేజీ 19

నిర్గమకాండం 3:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:51
  • +సం 13:26, 27; ద్వితీ 27:3
  • +ఆది 10:15-17; నిర్గ 33:1, 2; ద్వితీ 7:1; యెహో 3:10; నెహె 9:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    కావలికోట (అధ్యయన),

    3/2019, పేజీ 15

నిర్గమకాండం 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

నిర్గమకాండం 3:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

నిర్గమకాండం 3:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2005, పేజీలు 13-14

నిర్గమకాండం 3:12

అధస్సూచీలు

  • *

    లేదా “సేవిస్తారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:23; యెష 41:10; రోమా 8:31; ఫిలి 4:13
  • +నిర్గ 19:2; ద్వితీ 4:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2005, పేజీ 14

నిర్గమకాండం 3:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 135:13; హోషే 12:5; యోహా 17:26; రోమా 10:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 7-9

    కావలికోట,

    3/15/2013, పేజీ 25

నిర్గమకాండం 3:14

అధస్సూచీలు

  • *

    లేదా “ఎంచుకుంటే.”

  • *

    అనుబంధం A4 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 23:13; యెష 14:27; యోహా 12:28
  • +నిర్గ 6:3, 7; రోమా 9:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

    సన్నిహితమవండి, పేజీలు 9-10

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2020, పేజీ 6

    కావలికోట,

    7/15/2014, పేజీ 27

    3/15/2013, పేజీలు 25-27

    1/1/2011, పేజీ 16

    3/15/2004, పేజీ 25

    1/15/2002, పేజీ 5

    3/1/1995, పేజీ 10

    8/1/1994, పేజీలు 10-11

    బైబిలు బోధిస్తోంది, పేజీ 197

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 43

    కొత్త లోక అనువాదం, పేజీ 1863

నిర్గమకాండం 3:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 7
  • +ఆది 26:24
  • +ఆది 28:13; మత్త 22:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 4

    కావలికోట,

    3/15/2013, పేజీలు 25-27

నిర్గమకాండం 3:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 50:24; నిర్గ 13:19

నిర్గమకాండం 3:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:13, 14; లేవీ 26:13
  • +ఆది 15:16
  • +సం 13:27; ద్వితీ 8:7-9

నిర్గమకాండం 3:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:31
  • +నిర్గ 5:3; 10:25, 26

నిర్గమకాండం 3:19

అధస్సూచీలు

  • *

    లేదా “బలమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 5:2; 14:8; రోమా 9:17

నిర్గమకాండం 3:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:3; 12:33; ద్వితీ 6:22

నిర్గమకాండం 3:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 11:2; 12:35, 36

నిర్గమకాండం 3:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:13, 14; నిర్గ 12:36

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 3:1నిర్గ 2:16; 18:1
నిర్గ. 3:1నిర్గ 24:12, 13; 1రా 19:8, 9
నిర్గ. 3:2అపొ 7:30-34
నిర్గ. 3:6ఆది 17:1, 7
నిర్గ. 3:6ఆది 26:24
నిర్గ. 3:6ఆది 28:13; 32:9; మత్త 22:32; అపొ 7:32
నిర్గ. 3:7నిర్గ 1:11; యెష 63:9; అపొ 7:34
నిర్గ. 3:8నిర్గ 12:51
నిర్గ. 3:8సం 13:26, 27; ద్వితీ 27:3
నిర్గ. 3:8ఆది 10:15-17; నిర్గ 33:1, 2; ద్వితీ 7:1; యెహో 3:10; నెహె 9:7, 8
నిర్గ. 3:9నిర్గ 1:11
నిర్గ. 3:10అపొ 7:34
నిర్గ. 3:12ద్వితీ 31:23; యెష 41:10; రోమా 8:31; ఫిలి 4:13
నిర్గ. 3:12నిర్గ 19:2; ద్వితీ 4:11, 12
నిర్గ. 3:13కీర్త 135:13; హోషే 12:5; యోహా 17:26; రోమా 10:13
నిర్గ. 3:14యోబు 23:13; యెష 14:27; యోహా 12:28
నిర్గ. 3:14నిర్గ 6:3, 7; రోమా 9:17
నిర్గ. 3:15ఆది 17:1, 7
నిర్గ. 3:15ఆది 26:24
నిర్గ. 3:15ఆది 28:13; మత్త 22:32
నిర్గ. 3:16ఆది 50:24; నిర్గ 13:19
నిర్గ. 3:17ఆది 15:13, 14; లేవీ 26:13
నిర్గ. 3:17ఆది 15:16
నిర్గ. 3:17సం 13:27; ద్వితీ 8:7-9
నిర్గ. 3:18నిర్గ 4:31
నిర్గ. 3:18నిర్గ 5:3; 10:25, 26
నిర్గ. 3:19నిర్గ 5:2; 14:8; రోమా 9:17
నిర్గ. 3:20నిర్గ 7:3; 12:33; ద్వితీ 6:22
నిర్గ. 3:21నిర్గ 11:2; 12:35, 36
నిర్గ. 3:22ఆది 15:13, 14; నిర్గ 12:36
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 3:1-22

నిర్గమకాండం

3 మోషే మిద్యాను పూజారైన తన మామ యిత్రో+ మందను కాస్తూ గొర్రెల కాపరి అయ్యాడు. అతను ఎడారికి* పడమటి వైపుగా మందను నడిపిస్తూ, చివరికి సత్యదేవుని పర్వతమైన హోరేబు+ దగ్గరికి వచ్చాడు. 2 అప్పుడు యెహోవా దూత ఒక ముళ్లపొద మధ్య అగ్నిజ్వాలలో అతనికి కనిపించాడు.+ మోషే అలాగే చూస్తూ ఉన్నాడు, ఆ ముళ్లపొద మండుతోంది కానీ కాలిపోవట్లేదు. 3 కాబట్టి మోషే, “నేను వెళ్లి ఈ అసాధారణ దృశ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ముళ్లపొద ఎందుకు కాలిపోవట్లేదో తెలుసుకుంటాను” అనుకున్నాడు. 4 మోషే దాన్ని చూడడానికి వెళ్లడం యెహోవా గమనించినప్పుడు, దేవుడు ఆ ముళ్లపొదలో నుండి “మోషే! మోషే!” అని పిలిచాడు. దానికి మోషే, “చెప్పు ప్రభువా” అన్నాడు. 5 తర్వాత ఆయన ఇలా అన్నాడు: “ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయకు. నీ కాళ్లకున్న చెప్పులు తీసేయి. ఎందుకంటే నువ్వు నిలబడిన స్థలం పవిత్రమైనది.”

6 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను నీ తండ్రికి దేవుణ్ణి, అబ్రాహాముకు దేవుణ్ణి,+ ఇస్సాకుకు దేవుణ్ణి,+ యాకోబుకు దేవుణ్ణి.”+ అప్పుడు మోషే సత్యదేవుని వైపు చూడడానికి భయపడి తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. 7 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తులో ఉన్న నా ప్రజల కష్టాన్ని నేను నిజంగా చూశాను, వాళ్లతో బలవంతంగా పని చేయిస్తున్నవాళ్ల కారణంగా నా ప్రజలు పెడుతున్న మొరను నేను విన్నాను; వాళ్లు పడుతున్న వేదన నాకు బాగా తెలుసు.+ 8 నేను దిగివెళ్లి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడి,+ విశాలమైన మంచి దేశంలోకి వాళ్లను తీసుకొస్తాను. అది పాలుతేనెలు ప్రవహించే దేశం;+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు+ నివసిస్తున్న ప్రాంతం. 9 ఇదిగో! ఇశ్రాయేలు ప్రజల మొర నా దగ్గరికి చేరింది. ఐగుప్తీయులు వాళ్లను ఎంత కఠినంగా అణచివేస్తున్నారో కూడా నేను చూశాను.+ 10 కాబట్టి రా, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తావు.”+

11 అయితే మోషే సత్యదేవునితో ఇలా అన్నాడు: “ఫరో దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి నేను ఎంతటివాణ్ణి?” 12 దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను తప్పకుండా నీకు తోడుగా ఉంటాను.+ నిన్ను పంపించింది నేనే అనడానికి గుర్తు ఇదే: నువ్వు ఆ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాక, మీరంతా ఈ పర్వతం మీద సత్యదేవుణ్ణి ఆరాధిస్తారు.”*+

13 అయితే మోషే సత్యదేవుణ్ణి ఇలా అడిగాడు: “ఒకవేళ నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్లి, ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు’ అని చెప్పినప్పుడు వాళ్లు, ‘ఆయన పేరేంటి?’+ అని నన్ను అడిగితే నేను వాళ్లకు ఏం చెప్పాలి?” 14 అందుకు దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను ఎలా అవ్వాలని అనుకుంటే* అలా అవుతాను.”*+ దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ “నేను అవుతాను” అనే వ్యక్తి నన్ను మీ దగ్గరికి పంపించాడు.’ ”+ 15 తర్వాత దేవుడు ఇంకొకసారి మోషేతో ఇలా అన్నాడు:

“నువ్వు ఇశ్రాయేలీయులతో, ‘మీ పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాముకు దేవుడు,+ ఇస్సాకుకు దేవుడు,+ యాకోబుకు దేవుడు+ అయిన యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడు’ అని చెప్పాలి. ఎప్పటికీ నా పేరు ఇదే. తరతరాలు ప్రజలు నన్ను ఇలాగే గుర్తుచేసుకోవాలి. 16 ఇప్పుడు నువ్వు వెళ్లి, ఇశ్రాయేలు పెద్దల్ని సమావేశపర్చి వాళ్లతో ఇలా అను: ‘మీ పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా నాకు కనిపించి ఇలా అన్నాడు: “నేను మీ పరిస్థితిని నిజంగా చూశాను,+ ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా గమనించాను. 17 అందుకే నేను చెప్తున్నాను, ఐగుప్తీయుల చేతుల్లో మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విడిపించి+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,+ పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను.” ’+

18 “వాళ్లు తప్పకుండా నీ మాట వింటారు.+ నువ్వూ, ఇశ్రాయేలు పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు మీరు అతనితో ఇలా చెప్పాలి: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాతో మాట్లాడాడు. కాబట్టి, మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి దయచేసి మాకు అనుమతి ఇవ్వు.’+ 19 అయితే శక్తివంతమైన* చెయ్యి బలవంతం చేస్తే తప్ప ఐగుప్తు రాజు మీకు అనుమతి ఇవ్వడని నాకు బాగా తెలుసు.+ 20 కాబట్టి నేను నా చెయ్యి చాపి, ఐగుప్తులో నేను చేయబోయే అసాధారణమైన పనులన్నిటితో ఆ దేశాన్ని కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను మిమ్మల్ని పంపించేస్తాడు.+ 21 అంతేకాదు, ఐగుప్తీయుల దృష్టిలో ఈ ప్రజలు అనుగ్రహం పొందేలా చేస్తాను. మీరు వెళ్లిపోయేటప్పుడు, ఏమాత్రం వట్టి చేతులతో వెళ్లరు.+ 22 ప్రతీ స్త్రీ తన పొరుగింట్లో ఉన్న స్త్రీని, తన ఇంట్లో ఉంటున్న స్త్రీని వెండి-బంగారు వస్తువులు, అలాగే బట్టలు అడిగి తీసుకోవాలి. వాటిని మీ కుమారులకు, కూతుళ్లకు తొడగాలి. మీరు ఐగుప్తీయుల్ని కొల్లగొడతారు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి