కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • మోషే చేయాల్సిన మూడు అద్భుతాలు (1-9)

      • మోషే తనకు సామర్థ్యం లేదని అనుకుంటాడు (10-17)

      • మోషే ఐగుప్తుకు తిరిగెళ్తాడు (18-26)

      • మోషే, అహరోనును తిరిగి కలుసుకుంటాడు (27-31)

నిర్గమకాండం 4:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:13, 14

నిర్గమకాండం 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:9

నిర్గమకాండం 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 20:37
  • +నిర్గ 3:16; 4:31

నిర్గమకాండం 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 12:10

నిర్గమకాండం 4:8

అధస్సూచీలు

  • *

    లేదా “సూచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:36

నిర్గమకాండం 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:30

నిర్గమకాండం 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:12; సం 12:3; యిర్మీ 1:6; అపొ 7:22

నిర్గమకాండం 4:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 24

    5/1/1999, పేజీ 28

నిర్గమకాండం 4:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ నోటికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 50:4; మార్కు 13:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2020, పేజీలు 7-8

నిర్గమకాండం 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1996, పేజీలు 24-25

నిర్గమకాండం 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:59
  • +నిర్గ 4:27

నిర్గమకాండం 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:28
  • +యిర్మీ 1:9

నిర్గమకాండం 4:16

అధస్సూచీలు

  • *

    లేదా “దేవుని ప్రతినిధిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీలు 24-25

నిర్గమకాండం 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 8:5; 17:5, 6; సం 20:11

నిర్గమకాండం 4:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:18, 21; 18:1; సం 10:29

నిర్గమకాండం 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:15

నిర్గమకాండం 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:9
  • +నిర్గ 7:3; 8:15; 9:12; 11:10; రోమా 9:17, 18
  • +నిర్గ 7:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2020, పేజీ 3

నిర్గమకాండం 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:6; 14:2; హోషే 11:1; రోమా 9:4

నిర్గమకాండం 4:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:29

నిర్గమకాండం 4:24

అధస్సూచీలు

  • *

    బహుశా, మోషే కుమారుణ్ణి సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:22; 1ది 21:16
  • +ఆది 17:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 28

    9/15/1995, పేజీలు 21-22

నిర్గమకాండం 4:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:16, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 28

నిర్గమకాండం 4:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 28

నిర్గమకాండం 4:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:14
  • +నిర్గ 3:1; 20:18; 24:16

నిర్గమకాండం 4:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:15
  • +నిర్గ 4:8

నిర్గమకాండం 4:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:16; 24:1

నిర్గమకాండం 4:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:3, 6, 9

నిర్గమకాండం 4:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:18
  • +ఆది 50:25
  • +నిర్గ 1:14; 3:7; ద్వితీ 26:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 4:1నిర్గ 2:13, 14
నిర్గ. 4:3నిర్గ 7:9
నిర్గ. 4:5లూకా 20:37
నిర్గ. 4:5నిర్గ 3:16; 4:31
నిర్గ. 4:6సం 12:10
నిర్గ. 4:8అపొ 7:36
నిర్గ. 4:9నిర్గ 4:30
నిర్గ. 4:10నిర్గ 6:12; సం 12:3; యిర్మీ 1:6; అపొ 7:22
నిర్గ. 4:12యెష 50:4; మార్కు 13:11
నిర్గ. 4:14సం 26:59
నిర్గ. 4:14నిర్గ 4:27
నిర్గ. 4:15నిర్గ 4:28
నిర్గ. 4:15యిర్మీ 1:9
నిర్గ. 4:16నిర్గ 7:1, 2
నిర్గ. 4:17నిర్గ 8:5; 17:5, 6; సం 20:11
నిర్గ. 4:18నిర్గ 2:18, 21; 18:1; సం 10:29
నిర్గ. 4:19నిర్గ 2:15
నిర్గ. 4:21నిర్గ 7:9
నిర్గ. 4:21నిర్గ 7:3; 8:15; 9:12; 11:10; రోమా 9:17, 18
నిర్గ. 4:21నిర్గ 7:22
నిర్గ. 4:22ద్వితీ 7:6; 14:2; హోషే 11:1; రోమా 9:4
నిర్గ. 4:23నిర్గ 12:29
నిర్గ. 4:24సం 22:22; 1ది 21:16
నిర్గ. 4:24ఆది 17:14
నిర్గ. 4:25నిర్గ 2:16, 21
నిర్గ. 4:27నిర్గ 4:14
నిర్గ. 4:27నిర్గ 3:1; 20:18; 24:16
నిర్గ. 4:28నిర్గ 4:15
నిర్గ. 4:28నిర్గ 4:8
నిర్గ. 4:29నిర్గ 3:16; 24:1
నిర్గ. 4:30నిర్గ 4:3, 6, 9
నిర్గ. 4:31ఆది 50:25
నిర్గ. 4:31నిర్గ 1:14; 3:7; ద్వితీ 26:6
నిర్గ. 4:31నిర్గ 3:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 4:1-31

నిర్గమకాండం

4 అయితే మోషే ఇలా అన్నాడు: “ఒకవేళ వాళ్లు నన్ను నమ్మకపోతే, నా మాట వినకపోతే, నేనేం చేయాలి?+ ఎందుకంటే వాళ్లు ‘యెహోవా నీకు కనిపించలేదు’ అంటారు.” 2 అందుకు యెహోవా, “నీ చేతిలో ఉన్నదేంటి?” అని అడిగాడు. దానికి మోషే, “కర్ర” అన్నాడు. 3 అప్పుడు దేవుడు, “దాన్ని నేలమీద పడేయి” అన్నాడు. మోషే దాన్ని నేలమీద పడేశాడు, అప్పుడది పాము అయింది;+ అతను దాని దగ్గర నుండి పారిపోయాడు. 4 తర్వాత యెహోవా మోషేతో, “నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో” అన్నాడు. అతను తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు, అది అతని చేతిలో కర్ర అయింది. 5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నువ్వు ఇలా చేస్తే, వాళ్ల పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు+ అయిన యెహోవా నీకు కనిపించాడని వాళ్లు నమ్ముతారు.”+

6 యెహోవా ఇంకోసారి అతనితో, “దయచేసి, నీ చెయ్యి నీ వస్త్రం పైమడతలో పెట్టు” అన్నాడు. అతను తన చేతిని తన వస్త్రం మడతలో పెట్టాడు. తర్వాత అతను తన చేతిని బయటికి తీసి చూసినప్పుడు, ఇదిగో! అది కుష్ఠుతో నిండిపోయి మంచు అంత తెల్లగా ఉంది.+ 7 అప్పుడు దేవుడు, “నీ చెయ్యి మళ్లీ నీ వస్త్రం పైమడతలో పెట్టు” అన్నాడు. అతను తన చేతిని మళ్లీ తన వస్త్రంలో పెట్టాడు. అతను తన చేతిని బయటికి తీసి చూసేసరికి, అది మళ్లీ మిగతా శరీరంలా మారిపోయింది! 8 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “ఒకవేళ వాళ్లు నిన్ను నమ్మకుండా, మొదటి అద్భుతం* చూసిన తర్వాత కూడా నీ మాట వినకుండా ఉంటే, రెండో అద్భుతం చూశాక వాళ్లు తప్పకుండా నీ మాట వింటారు.+ 9 ఒకవేళ వాళ్లు ఈ రెండు అద్భుతాలు చూశాక కూడా ఇంకా నిన్ను నమ్మకుండా, నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నైలు నదిలో నుండి కొన్ని నీళ్లు తీసుకొని పొడినేల మీద పోయాలి; అప్పుడు నైలు నది నుండి నువ్వు తీసిన నీళ్లు పొడినేల మీద రక్తంగా మారతాయి.”+

10 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “యెహోవా, నన్ను మన్నించు, ఇంతకుముందు గానీ నువ్వు నీ సేవకుడితో మాట్లాడినప్పటి నుండి గానీ నేను అనర్గళంగా మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా నోరు మందం, నా నాలుక మందం.”+ 11 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “మనిషికి నోరు ఇచ్చింది ఎవరు? వాళ్లను మూగవాళ్లుగా గానీ చెవిటివాళ్లుగా గానీ చక్కగా చూడగలిగేవాళ్లుగా గానీ గుడ్డివాళ్లుగా గానీ చేసేది ఎవరు? యెహోవానైన నేను కాదా? 12 కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్లు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు* తోడుగా ఉంటాను, నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను.”+ 13 కానీ మోషే, “యెహోవా, నన్ను మన్నించు, దయచేసి నన్ను కాకుండా ఇంకెవరినైనా ఎంచుకొని పంపించు” అన్నాడు. 14 అప్పుడు యెహోవాకు మోషే మీద చాలా కోపమొచ్చి ఇలా అన్నాడు: “లేవీయుడైన నీ అన్న అహరోను+ ఉన్నాడు కదా? అతను చాలా బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇప్పుడతను నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తున్నాడు. అతను నిన్ను చూసినప్పుడు హృదయంలో చాలా సంతోషిస్తాడు.+ 15 నువ్వు అతనితో మాట్లాడి, నా మాటలు అతనికి చెప్పాలి.+ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు, అతనికి తోడుగా ఉంటాను,+ మీరు ఏం చేయాలో నేను మీకు నేర్పిస్తాను. 16 నీ తరఫున అతను ప్రజలతో మాట్లాడతాడు, అతను నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడిగా* ఉంటావు.+ 17 నువ్వు నీ చేతిలో ఈ కర్రను తీసుకెళ్లి దానితో అద్భుతాలు చేస్తావు.”+

18 కాబట్టి మోషే తన మామ యిత్రో+ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “నేను ఐగుప్తులో ఉన్న నా సహోదరుల దగ్గరికి తిరిగెళ్లి, వాళ్లు ఎలా ఉన్నారో చూడాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను వెళ్లనివ్వు.” అప్పుడు యిత్రో మోషేతో, “క్షేమంగా వెళ్లు” అన్నాడు. 19 తర్వాత మిద్యానులో యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తుకు తిరిగెళ్లు, ఎందుకంటే నిన్ను చంపాలని చూసిన వాళ్లంతా చనిపోయారు.”+

20 అప్పుడు మోషే తన భార్యను, తన కుమారుల్ని గాడిద మీదికి ఎక్కించి ఐగుప్తు దేశానికి ప్రయాణమయ్యాడు; అంతేకాదు, చేతిలో సత్యదేవుని కర్రను కూడా తీసుకెళ్లాడు. 21 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తుకు తిరిగెళ్లాక, ఏ అద్భుతాలు చేయడానికి నేను నీకు శక్తిని ఇచ్చానో అవన్నీ నువ్వు తప్పకుండా ఫరో ముందు చేయాలి.+ అయితే నేను అతని హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను,+ అతను ప్రజల్ని అక్కడి నుండి పంపించడు.+ 22 నువ్వు ఫరోతో ఇలా చెప్పాలి: ‘యెహోవా చెప్పేదేమిటంటే, “ఇశ్రాయేలు నా కుమారుడు, నా మొదటి సంతానం.+ 23 నేను నీకు చెప్తున్నాను, నా కుమారుడు నన్ను సేవించేలా అతన్ని పంపించేయి. కానీ నువ్వు అతన్ని పంపించడానికి ఒప్పుకోకపోతే, నేను నీ కుమారుణ్ణి, అంటే నీ మొదటి సంతానాన్ని చంపుతాను.” ’ ”+

24 వాళ్లు బస చేసే చోట దారిలో యెహోవా+ అతన్ని కలుసుకొని, అతన్ని* చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.+ 25 చివరికి సిప్పోరా+ ఒక పదునైన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, అతని ముందోలు ఆయన పాదాల్ని తాకేలా చేసి, “నువ్వు నాకు రక్తసంబంధివైన పెళ్లికుమారుడివి కాబట్టి ఇలా చేశాను” అంది. 26 దాంతో ఆయన అతన్ని వదిలేశాడు. అప్పుడామె, ఆ సున్నతి కారణంగా, “రక్తసంబంధియైన పెళ్లికుమారుడు” అని అంది.

27 తర్వాత యెహోవా అహరోనుతో, “నువ్వు మోషేను కలవడానికి ఎడారిలోకి వెళ్లు”+ అని చెప్పాడు. కాబట్టి అతను వెళ్లి సత్యదేవుని పర్వతం+ దగ్గర అతన్ని కలుసుకొని, అతనికి ముద్దుపెట్టి పలకరించాడు. 28 అప్పుడు మోషే తనను పంపిన యెహోవా చెప్పిన మాటలన్నీ అహరోనుకు తెలియజేశాడు.+ అలాగే ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుతాలన్నిటి+ గురించి కూడా అతనికి చెప్పాడు. 29 తర్వాత మోషే, అహరోను వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందర్నీ సమావేశపర్చారు.+ 30 యెహోవా మోషేతో మాట్లాడిన మాటలన్నీ అహరోను వాళ్లకు చెప్పాడు, మోషే ఆ అద్భుతాలన్నీ ప్రజల ముందు చేసి చూపించాడు.+ 31 అప్పుడు ప్రజలు నమ్మారు.+ యెహోవా ఇశ్రాయేలీయుల్ని గుర్తుచేసుకున్నాడని,+ వాళ్ల కష్టాన్ని చూశాడని+ విన్నప్పుడు వాళ్లు వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి