కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • విడుదల గురించిన వాగ్దానాన్ని మళ్లీ చెప్పడం (1-13)

        • యెహోవా పేరు పూర్తిగా తెలియకపోవడం (2, 3)

      • మోషే, అహరోనుల వంశావళి (14-27)

      • మోషే మళ్లీ ఫరో ముందుకు వెళ్లాలి (28-30)

నిర్గమకాండం 6:1

అధస్సూచీలు

  • *

    లేదా “బలమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:13
  • +నిర్గ 9:3; 11:1; 12:29, 31

నిర్గమకాండం 6:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1; 35:10, 11
  • +కీర్త 83:18; లూకా 11:2; యోహా 12:28; అపొ 15:14; ప్రక 15:3
  • +ఆది 12:8; 28:16; యిర్మీ 32:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2020, పేజీ 2

    కావలికోట,

    3/15/2004, పేజీ 25

నిర్గమకాండం 6:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18; 28:4

నిర్గమకాండం 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 7; నిర్గ 2:24

నిర్గమకాండం 6:6

అధస్సూచీలు

  • *

    లేదా “శక్తివంతమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:20
  • +ద్వితీ 26:8; 1ది 17:21; అపొ 13:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2012, పేజీలు 24-25

నిర్గమకాండం 6:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:45; ద్వితీ 7:6; 2స 7:24; కీర్త 33:12

నిర్గమకాండం 6:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా చెయ్యి ఎత్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18; 26:3; 35:12; నిర్గ 32:13
  • +నిర్గ 20:2; యెష 42:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2012, పేజీలు 24-25

నిర్గమకాండం 6:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 5:21

నిర్గమకాండం 6:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “సున్నతిలేని పెదవులు గల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 5:21; 6:9
  • +నిర్గ 4:10; అపొ 7:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 15

నిర్గమకాండం 6:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:3
  • +ఆది 46:9

నిర్గమకాండం 6:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 4:24

నిర్గమకాండం 6:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:34
  • +ఆది 46:11; సం 26:57

నిర్గమకాండం 6:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:18

నిర్గమకాండం 6:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:19

నిర్గమకాండం 6:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:20

నిర్గమకాండం 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:1; సం 26:59
  • +1ది 23:13

నిర్గమకాండం 6:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 16:1, 32; 26:10

నిర్గమకాండం 6:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 10:4; సం 3:30

నిర్గమకాండం 6:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 4:19-21; మత్త 1:4
  • +సం 3:2

నిర్గమకాండం 6:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:10, 11
  • +సం 26:58; 1ది 9:19

నిర్గమకాండం 6:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:32
  • +సం 25:7; 31:6; యెహో 22:31; న్యా 20:28
  • +నిర్గ 6:19

నిర్గమకాండం 6:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:2, 4; 12:41; అపొ 7:35

నిర్గమకాండం 6:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 77:20

నిర్గమకాండం 6:30

అధస్సూచీలు

  • *

    అక్ష., “సున్నతిలేని పెదవులు గల.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 6:1నిర్గ 14:13
నిర్గ. 6:1నిర్గ 9:3; 11:1; 12:29, 31
నిర్గ. 6:3ఆది 17:1; 35:10, 11
నిర్గ. 6:3కీర్త 83:18; లూకా 11:2; యోహా 12:28; అపొ 15:14; ప్రక 15:3
నిర్గ. 6:3ఆది 12:8; 28:16; యిర్మీ 32:20
నిర్గ. 6:4ఆది 15:18; 28:4
నిర్గ. 6:5ఆది 17:1, 7; నిర్గ 2:24
నిర్గ. 6:6ద్వితీ 4:20
నిర్గ. 6:6ద్వితీ 26:8; 1ది 17:21; అపొ 13:17
నిర్గ. 6:7నిర్గ 29:45; ద్వితీ 7:6; 2స 7:24; కీర్త 33:12
నిర్గ. 6:8ఆది 15:18; 26:3; 35:12; నిర్గ 32:13
నిర్గ. 6:8నిర్గ 20:2; యెష 42:8
నిర్గ. 6:9నిర్గ 5:21
నిర్గ. 6:12నిర్గ 5:21; 6:9
నిర్గ. 6:12నిర్గ 4:10; అపొ 7:22
నిర్గ. 6:14ఆది 49:3
నిర్గ. 6:14ఆది 46:9
నిర్గ. 6:151ది 4:24
నిర్గ. 6:16ఆది 29:34
నిర్గ. 6:16ఆది 46:11; సం 26:57
నిర్గ. 6:17సం 3:18
నిర్గ. 6:18సం 3:19
నిర్గ. 6:19సం 3:20
నిర్గ. 6:20నిర్గ 2:1; సం 26:59
నిర్గ. 6:201ది 23:13
నిర్గ. 6:21సం 16:1, 32; 26:10
నిర్గ. 6:22లేవీ 10:4; సం 3:30
నిర్గ. 6:23రూతు 4:19-21; మత్త 1:4
నిర్గ. 6:23సం 3:2
నిర్గ. 6:24సం 26:10, 11
నిర్గ. 6:24సం 26:58; 1ది 9:19
నిర్గ. 6:25సం 3:32
నిర్గ. 6:25సం 25:7; 31:6; యెహో 22:31; న్యా 20:28
నిర్గ. 6:25నిర్గ 6:19
నిర్గ. 6:26నిర్గ 7:2, 4; 12:41; అపొ 7:35
నిర్గ. 6:27కీర్త 77:20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 6:1-30

నిర్గమకాండం

6 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నువ్వు చూస్తావు.+ నా ప్రజల్ని పంపించేలా శక్తివంతమైన* చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది, వాళ్లను తన దేశంలో నుండి వెళ్లగొట్టేలా శక్తివంతమైన చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది.”+

2 తర్వాత దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను యెహోవాను. 3 నేను సర్వశక్తిగల దేవుడిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యేవాణ్ణి.+ కానీ యెహోవా అనే నా పేరు+ విషయానికొస్తే, నన్ను నేను వాళ్లకు బయల్పర్చుకోలేదు.+ 4 అంతేకాదు, వాళ్లు ఏ దేశంలోనైతే పరదేశులుగా జీవించారో ఆ కనాను దేశాన్ని వాళ్లకు ఇస్తానని అంటూ వాళ్లతో నా ఒప్పందాన్ని స్థిరపర్చాను.+ 5 ఐగుప్తీయులు బానిసలుగా చేసుకుంటున్న ఇశ్రాయేలీయుల మూల్గుల్ని నేను స్వయంగా విన్నాను, నా ఒప్పందం నాకు గుర్తుంది.+

6 “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఐగుప్తీయులు మీ మీద పెట్టిన భారాల నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, వాళ్ల బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను;+ ఐగుప్తు మీద నా తీర్పులు అమలు చేసి, చాచిన* బాహువుతో మిమ్మల్ని కాపాడతాను.+ 7 నేను మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తాను, నేను మీకు దేవుడిగా ఉంటాను.+ ఐగుప్తు భారాల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్న మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. 8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను ఒట్టేసి* ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొస్తాను; దాన్ని మీకు ఆస్తిగా ఇస్తాను.+ నేను యెహోవాను.’ ”+

9 తర్వాత మోషే ఆ సందేశాన్ని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ నిరుత్సాహం వల్ల, కఠినమైన బానిసత్వం వల్ల వాళ్లు మోషే చెప్పింది వినలేదు.+

10 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “మీరు వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో, ఇశ్రాయేలీయుల్ని తన దేశంలో నుండి పంపించేయాలని చెప్పండి.” 12 అయితే మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు;+ అలాంటిది, సరిగ్గా మాట్లాడలేని* నాలాంటివాడి మాటలు ఫరో ఎప్పటికైనా ఎలా వింటాడు?”+ 13 అయితే యెహోవా, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలీయులకు, ఐగుప్తు రాజైన ఫరోకు ఏ ఆజ్ఞలు ఇవ్వాలో మోషే, అహరోనులకు మళ్లీ చెప్పాడు.

14 ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు వీళ్లు: ఇశ్రాయేలు పెద్ద కుమారుడైన రూబేను+ కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+ ఇవి రూబేను కుటుంబాలు.

15 షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు. ఈ షావూలు ఒక కనానీయురాలి కుమారుడు.+ ఇవి షిమ్యోను కుటుంబాలు.

16 వాళ్లవాళ్ల వంశాల ప్రకారం లేవి+ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.+ లేవి మొత్తం 137 ఏళ్లు బ్రతికాడు.

17 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.+

18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.+ కహాతు మొత్తం 133 ఏళ్లు బ్రతికాడు.

19 మెరారి కుమారులు: మహలి, మూషి.

ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం లేవీయుల కుటుంబాలు.+

20 అమ్రాము తన తండ్రి సహోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు.+ ఆమె అతనికి అహరోనును, మోషేను కన్నది.+ అమ్రాము మొత్తం 137 ఏళ్లు బ్రతికాడు.

21 ఇస్హారు కుమారులు: కోరహు,+ నెపెగు, జిఖ్రీ.

22 ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎలీషాపాను,+ సిత్రీ.

23 అహరోను అమ్మీనాదాబు కూతురూ, నయస్సోను+ సహోదరీ అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును+ కన్నది.

24 కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.+ ఇవి కోరహీయుల+ కుటుంబాలు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు+ పూతీయేలు కూతుళ్లలో ఒకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి ఫీనెహాసును+ కన్నది.

వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు వీళ్లు.+

26 ఇది అహరోను, మోషేల వంశావళి. “వాళ్లవాళ్ల సేనల ప్రకారం ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే.+ 27 ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడింది ఈ మోషే, అహరోనులే.+

28 యెహోవా ఐగుప్తు దేశంలో మోషేతో మాట్లాడిన రోజున, 29 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను యెహోవాను. నేను నీతో మాట్లాడుతున్న ప్రతీ మాటను నువ్వు ఐగుప్తు రాజైన ఫరోతో చెప్పు.” 30 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “సరిగ్గా మాట్లాడలేని* నాలాంటివాడి మాటలు ఫరో ఎప్పటికైనా ఎలా వింటాడు?”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి