కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 28
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • ఏన్దోరులో, చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీ దగ్గరికి సౌలు వెళ్లడం (1-25)

1 సమూయేలు 28:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 27:12

1 సమూయేలు 28:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 29:2

1 సమూయేలు 28:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:1
  • +నిర్గ 22:18; లేవీ 19:31; 20:6, 27; ద్వితీ 18:10, 11; ప్రక 21:8

1 సమూయేలు 28:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:17, 18; 2రా 4:8
  • +1స 31:1; 2స 1:21; 21:12

1 సమూయేలు 28:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:20

1 సమూయేలు 28:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:37
  • +నిర్గ 28:30; సం 27:21

1 సమూయేలు 28:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:18; లేవీ 19:31; 20:6; 1స 15:23; 28:3
  • +యెహో 17:11

1 సమూయేలు 28:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10, 11; 1ది 10:13

1 సమూయేలు 28:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:3
  • +నిర్గ 22:18; లేవీ 20:27

1 సమూయేలు 28:12

అధస్సూచీలు

  • *

    లేదా “సమూయేలులా కనిపించినదాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:3

1 సమూయేలు 28:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:27

1 సమూయేలు 28:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:6
  • +లేవీ 19:31

1 సమూయేలు 28:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:23; 16:14

1 సమూయేలు 28:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 13:14; 15:28; 16:13; 24:20

1 సమూయేలు 28:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:9; 1ది 10:13

1 సమూయేలు 28:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:1; 31:1
  • +1స 31:5
  • +1స 31:2; 2స 2:8
  • +1స 31:7

1 సమూయేలు 28:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:27

1 సమూయేలు 28:24

అధస్సూచీలు

  • *

    లేదా “బలి అర్పించింది.”

1 సమూయేలు 28:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 28:11స 27:12
1 సమూ. 28:21స 29:2
1 సమూ. 28:31స 25:1
1 సమూ. 28:3నిర్గ 22:18; లేవీ 19:31; 20:6, 27; ద్వితీ 18:10, 11; ప్రక 21:8
1 సమూ. 28:4యెహో 19:17, 18; 2రా 4:8
1 సమూ. 28:41స 31:1; 2స 1:21; 21:12
1 సమూ. 28:51స 28:20
1 సమూ. 28:61స 14:37
1 సమూ. 28:6నిర్గ 28:30; సం 27:21
1 సమూ. 28:7నిర్గ 22:18; లేవీ 19:31; 20:6; 1స 15:23; 28:3
1 సమూ. 28:7యెహో 17:11
1 సమూ. 28:8ద్వితీ 18:10, 11; 1ది 10:13
1 సమూ. 28:91స 28:3
1 సమూ. 28:9నిర్గ 22:18; లేవీ 20:27
1 సమూ. 28:121స 28:3
1 సమూ. 28:141స 15:27
1 సమూ. 28:151స 28:6
1 సమూ. 28:15లేవీ 19:31
1 సమూ. 28:161స 15:23; 16:14
1 సమూ. 28:171స 13:14; 15:28; 16:13; 24:20
1 సమూ. 28:181స 15:9; 1ది 10:13
1 సమూ. 28:191స 28:1; 31:1
1 సమూ. 28:191స 31:5
1 సమూ. 28:191స 31:2; 2స 2:8
1 సమూ. 28:191స 31:7
1 సమూ. 28:21లేవీ 20:27
1 సమూ. 28:251స 28:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 28:1-25

సమూయేలు మొదటి గ్రంథం

28 ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి తమ సైన్యాల్ని సమకూర్చుకున్నారు. అప్పుడు ఆకీషు దావీదుతో, “నువ్వూ, నీ మనుషులూ నాతోపాటు యుద్ధానికి రావాలని నీకు తెలుసు కదా?” అన్నాడు.+ 2 దానికి దావీదు ఆకీషుతో, “నీ సేవకుడు ఏమి చేస్తాడో నీకు బాగా తెలుసు” అన్నాడు. ఆకీషు దావీదుతో, “అందుకే నేను నిన్ను నా శాశ్వత అంగరక్షకునిగా నియమిస్తాను” అన్నాడు.+

3 అప్పటికి సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులందరూ అతని గురించి ఏడ్చారు, అతన్ని తన సొంత నగరమైన రామాలో+ పాతిపెట్టారు. చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, సోదె చెప్పేవాళ్లను సౌలు దేశం నుండి వెళ్లగొట్టాడు.+

4 ఫిలిష్తీయులు సమకూడి, షూనేముకు+ వెళ్లి అక్కడ మకాం వేశారు. దాంతో సౌలు ఇశ్రాయేలీయులందర్నీ పోగుచేశాడు. వాళ్లు గిల్బోవలో+ మకాం వేశారు. 5 ఫిలిష్తీయుల దండును చూసినప్పుడు సౌలు భయపడ్డాడు, అతని గుండె దడదడ కొట్టుకుంది.+ 6 సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడు+ కానీ యెహోవా అతనికి కలల ద్వారా గానీ, ఊరీము+ ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ అస్సలు జవాబివ్వలేదు. 7 చివరికి సౌలు తన సేవకులతో, “చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీని+ నా కోసం వెదకండి. నేను ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను అడుగుతాను” అన్నాడు. దానికి అతని సేవకులు, “ఇదిగో! చనిపోయినవాళ్లను సంప్రదించే ఒక స్త్రీ ఏన్దోరులో+ ఉంది” అని జవాబిచ్చారు.

8 దాంతో సౌలు మారువేషం వేసుకొని వేరే బట్టలు ధరించి రాత్రిపూట తన ఇద్దరు మనుషుల్ని వెంటబెట్టుకొని ఆ స్త్రీ దగ్గరికి వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “చనిపోయినవాళ్లను సంప్రదించే నీ సామర్థ్యం ఉపయోగించి,+ నేను నీకు చెప్పే వ్యక్తిని నా కోసం పైకి రప్పించి భవిష్యత్తు గురించి దయచేసి నాకు చెప్పు.” 9 అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో, చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, సోదె చెప్పేవాళ్లను దేశం నుండి ఎలా వెళ్లగొట్టాడో నీకు తెలిసే ఉండాలి.+ మరి నేను చంపబడేలా ఉరి పన్నడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు?”+ అంది. 10 అప్పుడు సౌలు ఆమెతో, “యెహోవా జీవం తోడు, ఈ విషయంలో నీకు శిక్ష పడదు!” అంటూ యెహోవా పేరున ప్రమాణం చేశాడు. 11 దానికి ఆ స్త్రీ, “నేను నీ కోసం ఎవర్ని పైకి రప్పించాలి?” అని అడిగింది. అతను, “నా కోసం సమూయేలును పైకి రప్పించు” అన్నాడు. 12 ఆ స్త్రీ “సమూయేలును”*+ చూసినప్పుడు గట్టిగా కేకలు వేస్తూ సౌలుతో, “నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు సౌలువే!” అని అంది. 13 అప్పుడు రాజు ఆమెను, “భయపడకు, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. ఆ స్త్రీ సౌలుతో, “దేవునిలాంటి ఒక వ్యక్తి భూమిలో నుండి పైకి రావడం నాకు కనిపిస్తోంది” అంది. 14 వెంటనే అతను, “చూడడానికి అతను ఎలా ఉన్నాడు?” అని ఆమెను అడిగాడు. దానికి ఆమె, “ఒక ముసలాయన పైకి వస్తున్నాడు, అతను చేతుల్లేని నిలువుటంగీ వేసుకొని ఉన్నాడు”+ అంది. దాంతో సౌలు అది “సమూయేలు” అని గుర్తుపట్టి, మోకాళ్లూని నేలమీద సాష్టాంగపడ్డాడు.

15 అప్పుడు “సమూయేలు” సౌలును, “నన్ను పైకి రప్పించి ఎందుకు ఇబ్బందిపెట్టావు?” అని అడిగాడు. దానికి సౌలు, “నేను పెద్ద కష్టంలో ఉన్నాను. ఫిలిష్తీయులు నాతో పోరాడుతున్నారు, పైగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఆయన అంతకుముందులా ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకు జవాబివ్వడం లేదు;+ అందుకే నేను ఏమి చేయాలో తెలియజేస్తావని నిన్ను పిలిచాను”+ అని చెప్పాడు.

16 అప్పుడు “సమూయేలు” ఇలా అన్నాడు: “యెహోవాయే నిన్ను విడిచిపెట్టి+ నీకు శత్రువు అయ్యాక ఇప్పుడు నువ్వు నా దగ్గర విచారణ చేయడం దేనికి? 17 యెహోవా అంతకుముందు నా ద్వారా చెప్పిన విషయాన్ని చేస్తాడు. యెహోవా నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసి నీ తోటివాడైన దావీదుకు ఇస్తాడు.+ 18 నువ్వు యెహోవా స్వరానికి లోబడలేదు, ఆయనకు తీవ్రమైన కోపాన్ని తెప్పించిన అమాలేకీయుల్ని నాశనం చేయలేదు.+ అందుకే యెహోవా ఈ రోజు నీకు ఇలా చేస్తున్నాడు. 19 అంతేకాదు, యెహోవా ఇశ్రాయేలునూ, నిన్నూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు.+ రేపు నువ్వూ,+ నీ కుమారులూ+ నాతోపాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలు సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు.”+

20 వెంటనే సౌలు నేలమీద బోర్లాపడి, “సమూయేలు” మాటల్ని బట్టి ఎంతో భయపడ్డాడు. అతను పగలంతా, రాత్రంతా ఏమీ తినలేదు కాబట్టి అతనిలో అస్సలు శక్తి లేదు. 21 ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎంతో ఆందోళనగా కనిపించాడు. అప్పుడు ఆమె అతనితో ఇలా అంది: “నీ సేవకురాలినైన నేను నువ్వు చెప్పిన మాటకు లోబడ్డాను, నా ప్రాణాలకు తెగించి+ నువ్వు చెప్పింది చేశాను. 22 ఇప్పుడు నీ సేవకురాలు చెప్పేది దయచేసి విను. నేను నీకు ఒక రొట్టె ముక్క వడ్డిస్తాను; నువ్వు దాన్ని తిను, ప్రయాణం చేయడానికి నీకు కాస్త శక్తి వస్తుంది.” 23 కానీ అతను ఒప్పుకోకుండా, “నేను తినను” అన్నాడు. అయితే అతని సేవకులు, అలాగే ఆ స్త్రీ అతన్ని బ్రతిమాలుతూ ఉండడంతో చివరికి సౌలు వాళ్ల మాట విని నేలమీద నుండి లేచి మంచం మీద కూర్చున్నాడు. 24 ఆ స్త్రీ ఇంట్లో కొవ్విన దూడ ఉంది. ఆమె త్వరత్వరగా దాన్ని వధించింది;* పిండి తీసుకొని దాన్ని పిసికి పులవని రొట్టెలు చేసింది. 25 ఆమె వాటిని సౌలుకు, అతని సేవకులకు వడ్డించడంతో వాళ్లు తిన్నారు. తర్వాత వాళ్లు లేచి ఆ రాత్రి వెళ్లిపోయారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి