యెషయా
29 “అరీయేలుకు* శ్రమ, దావీదు డేరాలు వేసుకున్న అరీయేలు నగరానికి+ శ్రమ!
సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి;
వార్షిక పండుగల్ని+ జరుపుకుంటూ ఉండండి.
2 అయితే నేను అరీయేలు మీదికి కష్టాలు తీసుకొస్తాను,+
దానిలో దుఃఖం, ప్రలాపం ఉంటాయి,+
అది నాకు దేవుని బలిపీఠపు కొలిమిలా తయారౌతుంది.+
3 నేను అన్నివైపులా డేరాలు వేసి నిన్ను చుట్టుముడతాను,
కర్రలతో నీ చుట్టూ కోట కట్టి
ముట్టడిగోడలు నిలబెడతాను.+
చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్ల స్వరంలా
నీ స్వరం నేల నుండి వినిపిస్తుంది,+
నీ మాటలు ధూళిలో నుండి కిచకిచలాడినట్టు వినిపిస్తాయి.
అదంతా ఒక్కసారిగా, అకస్మాత్తుగా జరుగుతుంది.+
6 సైన్యాలకు అధిపతైన యెహోవా నీ మీద దృష్టి పెడతాడు;
ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో,
సుడిగాలితో, తుఫానుతో, దహించే అగ్ని జ్వాలలతో నీ మీద దృష్టి పెడతాడు.”+
7 అప్పుడు అరీయేలు మీద యుద్ధం చేసే దేశాలన్నిటి సమూహం+
అంటే, దానితో యుద్ధం చేసేవాళ్లంతా,
దాని చుట్టూ ఉన్న ముట్టడి బురుజులు,
దానిమీదికి కష్టాలు తీసుకొచ్చే వాళ్లు
ఒక కలలా, రాత్రి కలిగే దర్శనంలా అవుతారు.
8 అవును, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆకలిగా ఉన్న వ్యక్తి భోజనం చేస్తున్నట్టు కలగంటాడు,
కానీ లేచినప్పుడు ఇంకా ఆకలిగానే ఉంటాడు,
దాహంగా ఉన్న వ్యక్తి నీళ్లు తాగుతున్నట్టు కలగంటాడు,
కానీ లేచినప్పుడు ఇంకా నీరసంగానే, దాహంగానే ఉంటాడు.
సీయోను పర్వతంతో యుద్ధం చేసే
దేశాలన్నిటి సమూహం విషయంలో కూడా అలాగే జరుగుతుంది.+
వాళ్లు మత్తుగా ఉన్నారు, కానీ ద్రాక్షారసం వల్ల కాదు;
వాళ్లు తూలుతున్నారు, కానీ మద్యం వల్ల కాదు.
10 ఎందుకంటే యెహోవా మీకు గాఢనిద్ర కలగజేశాడు;+
మీ కళ్లకు, అంటే ప్రవక్తలకు గుడ్డితనం కలగజేశాడు,+
మీ తలలకు, అంటే దర్శనాలు చూసేవాళ్లకు ముసుగు వేశాడు.+
11 ప్రతీ దర్శనం మీకొక ముద్రవేసిన గ్రంథంలా+ తయారౌతుంది. ఎవరైనా దాన్ని ఒక చదువువచ్చిన వ్యక్తికి ఇచ్చి, “దయచేసి దీన్ని బయటికి చదువు” అని అంటే, అతను “ఇది నేను చదవలేను, ఎందుకంటే దీనికి ముద్రవేసి ఉంది” అంటాడు. 12 వాళ్లు దాన్ని చదువురాని ఒక వ్యక్తికి ఇచ్చి, “దయచేసి దీన్ని చదువు” అని అంటే, అతను “నాకసలు చదవడమే రాదు” అంటాడు.
13 యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రజలు నా దగ్గరికి వస్తామని నోటితో చెప్తున్నారు,
పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,+
కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది;
వీళ్లు కేవలం తాము నేర్చుకున్న మనుషుల ఆజ్ఞల్ని బట్టి నాకు భయపడుతున్నారు.+
14 కాబట్టి ఈ ప్రజల విషయంలో నేనే మళ్లీ అద్భుతమైన పనులు చేస్తాను,+
ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన పనులు చేస్తూనే ఉంటాను;
వీళ్ల జ్ఞానుల తెలివి నశించిపోతుంది,
వీళ్లలోని బుద్ధిగల వాళ్ల అవగాహన కనుమరుగైపోతుంది.”+
15 యెహోవా నుండి తమ పథకాలు* దాచడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లకు శ్రమ.+
వాళ్లు చీకటి స్థలంలో తమ పనులు చేస్తూ,
“మమ్మల్ని ఎవరు చూస్తారు?
మా గురించి ఎవరికి తెలుసు?” అని చెప్పుకుంటున్నారు.+
16 మీరెంత వంకరగా ఆలోచిస్తున్నారు!*
కుమ్మరిని, బంకమట్టిని ఒకేలా చూడొచ్చా?+
చేయబడిన వస్తువు తనను చేసిన వ్యక్తి గురించి
“ఇతను నన్ను చేయలేదు” అనొచ్చా?+
రూపించబడిన వస్తువు తన రూపకర్త గురించి
“ఇతనికి ఏమీ తెలీదు” అని అంటుందా?+
18 ఆ రోజు, చెవిటివాళ్లు ఆ గ్రంథంలోని మాటలు వింటారు,
గుడ్డివాళ్ల కళ్లు చీకట్లో నుండి, అంధకారంలో నుండి చూస్తాయి.+
19 సాత్వికులు యెహోవాను బట్టి ఎంతో సంతోషిస్తారు,
పేదవాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి బట్టి చాలా ఆనందిస్తారు.+
20 ఎందుకంటే నిరంకుశ పాలకుడు ఇక ఉండడు,
గొప్పలు చెప్పుకున్న వ్యక్తి అంతమైపోతాడు,
హానిచేయాలని కాచుకొని కూర్చున్న వాళ్లంతా నాశనం చేయబడతారు,+
21 అబద్ధాలతో ఇతరుల్ని దోషులుగా చేసేవాళ్లు,
నగర ద్వారం దగ్గర గద్దించే* వ్యక్తి కోసం ఉచ్చు పన్నేవాళ్లు,+
అర్థంపర్థంలేని వాదనలతో నీతిమంతుడికి న్యాయం జరగకుండా చేసేవాళ్లు+ లేకుండా పోతారు.
22 కాబట్టి, అబ్రాహామును+ విడిపించిన యెహోవా యాకోబు ఇంటివాళ్లతో ఇలా అంటున్నాడు:
23 ఎందుకంటే, అతను నా చేతిపనైన తన పిల్లల్ని
తన మధ్య చూసినప్పుడు,+
వాళ్లు నా పేరును పవిత్రపరుస్తారు;
అవును, యాకోబు పవిత్ర దేవుణ్ణి వాళ్లు పవిత్రపరుస్తారు,
ఇశ్రాయేలు దేవుణ్ణి బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనౌతారు.+
24 ఆలోచన పక్కదారి పట్టినవాళ్లు అవగాహనను పొందుతారు,
ఫిర్యాదు చేసేవాళ్లు ఉపదేశాన్ని స్వీకరిస్తారు.”