కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • కొర్నేలికి వచ్చిన దర్శనం (1-8)

      • పేతురు దర్శనంలో పవిత్రపర్చబడిన జంతువుల్ని చూడడం (9-16)

      • పేతురు కొర్నేలిని సందర్శించడం (17-33)

      • పేతురు అన్యజనులకు మంచివార్త ప్రకటించడం (34-43)

        • “దేవునికి పక్షపాతం లేదు” (34, 35)

      • అన్యజనులు పవిత్రశక్తిని పొంది, బాప్తిస్మం తీసుకోవడం (44-48)

అపొస్తలుల కార్యాలు 10:1

అధస్సూచీలు

  • *

    ఇందులో 600 మంది రోమా సైనికులు ఉండేవాళ్లు.

  • *

    లేదా “శతాధిపతి,” ఇతని కింద 100 మంది సైనికులు ఉండేవాళ్లు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 70

    కావలికోట,

    1/1/1991, పేజీ 14

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 10:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “దాదాపు తొమ్మిదో గంట అప్పుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 3:1

అపొస్తలుల కార్యాలు 10:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 65:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 14

అపొస్తలుల కార్యాలు 10:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 69

అపొస్తలుల కార్యాలు 10:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “దాదాపు ఆరో గంట.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 10:10

అధస్సూచీలు

  • *

    లేదా “అతను పరవశుడయ్యాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 11:5-10

అపొస్తలుల కార్యాలు 10:12

అధస్సూచీలు

  • *

    లేదా “సరీసృపాలు.”

అపొస్తలుల కార్యాలు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:4, 13-20; 20:25; ద్వితీ 14:3, 19; యెహె 4:14

అపొస్తలుల కార్యాలు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 11:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 71

అపొస్తలుల కార్యాలు 10:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:2; 15:28; 16:6; 20:23

అపొస్తలుల కార్యాలు 10:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 10:1

అపొస్తలుల కార్యాలు 10:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 71-72, 75

    కావలికోట,

    3/15/2014, పేజీలు 3-4

అపొస్తలుల కార్యాలు 10:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 4:8; అపొ 14:12-15; ప్రక 19:10; 22:8, 9

అపొస్తలుల కార్యాలు 10:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 18:28
  • +అపొ 10:45; ఎఫె 3:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 71-72

అపొస్తలుల కార్యాలు 10:30

అధస్సూచీలు

  • *

    అక్ష., “తొమ్మిదో గంట అప్పుడు.”

అపొస్తలుల కార్యాలు 10:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:43

అపొస్తలుల కార్యాలు 10:33

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

అపొస్తలుల కార్యాలు 10:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:17; 2ది 19:7; రోమా 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2022 పేజీలు 6-7

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 72

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 5

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 7

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 9

    కావలికోట,

    7/1/2013, పేజీ 14

    2/1/2004, పేజీ 30

    9/15/1993, పేజీ 5

అపొస్తలుల కార్యాలు 10:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:13; 1కొ 12:13; గల 3:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తరచూ అడిగే ప్రశ్నలు, ఆర్టికల్‌ 64

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2022 పేజీలు 6-7

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 72

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 5

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 7

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 9

    కావలికోట,

    7/1/2013, పేజీ 14

    బ్రోషుర్లు

    2/1/2004, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 10:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 52:7; నహూ 1:15
  • +మత్త 28:18; రోమా 14:9; ప్రక 19:11, 16

అపొస్తలుల కార్యాలు 10:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 4:14

అపొస్తలుల కార్యాలు 10:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:2; 42:1; 61:1; మత్త 3:16
  • +లూకా 13:16
  • +యోహా 3:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2020, పేజీ 31

    నా బైబిలు పుస్తకం, పేజీలు 186-187

అపొస్తలుల కార్యాలు 10:39

అధస్సూచీలు

  • *

    లేదా “చెట్టుకు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ‘మంచి దేశము’, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 10:40

అధస్సూచీలు

  • *

    లేదా “వెల్లడయ్యేలా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోనా 1:17; 2:10; అపొ 2:23, 24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 4 2017 పేజీ 9

అపొస్తలుల కార్యాలు 10:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 24:30, 31; యోహా 21:13, 14

అపొస్తలుల కార్యాలు 10:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:31; రోమా 14:9; 2కొ 5:10; 2తి 4:1; 1పే 4:5
  • +మత్త 28:19, 20; అపొ 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2008, పేజీలు 16, 19

    1/1/2005, పేజీ 12

    రాజ్య పరిచర్య,

    2/2003, పేజీ 3

అపొస్తలుల కార్యాలు 10:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 24:27; ప్రక 19:10
  • +యెష 53:11; యిర్మీ 31:34; దాని 9:24

అపొస్తలుల కార్యాలు 10:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:31; 8:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 72

అపొస్తలుల కార్యాలు 10:45

అధస్సూచీలు

  • *

    లేదా “నమ్మకమైనవాళ్లు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 72

అపొస్తలుల కార్యాలు 10:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:1, 4; 19:6

అపొస్తలుల కార్యాలు 10:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 3:11; అపొ 8:36; 11:17

అపొస్తలుల కార్యాలు 10:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 16:19; అపొ 2:38

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 10:3అపొ 3:1
అపొ. 10:4కీర్త 65:2
అపొ. 10:10అపొ 11:5-10
అపొ. 10:14లేవీ 11:4, 13-20; 20:25; ద్వితీ 14:3, 19; యెహె 4:14
అపొ. 10:17అపొ 11:11
అపొ. 10:19అపొ 13:2; 15:28; 16:6; 20:23
అపొ. 10:22అపొ 10:1
అపొ. 10:26లూకా 4:8; అపొ 14:12-15; ప్రక 19:10; 22:8, 9
అపొ. 10:28యోహా 18:28
అపొ. 10:28అపొ 10:45; ఎఫె 3:5, 6
అపొ. 10:32అపొ 9:43
అపొ. 10:34ద్వితీ 10:17; 2ది 19:7; రోమా 2:11
అపొ. 10:35రోమా 2:13; 1కొ 12:13; గల 3:28
అపొ. 10:36యెష 52:7; నహూ 1:15
అపొ. 10:36మత్త 28:18; రోమా 14:9; ప్రక 19:11, 16
అపొ. 10:37లూకా 4:14
అపొ. 10:38యెష 11:2; 42:1; 61:1; మత్త 3:16
అపొ. 10:38లూకా 13:16
అపొ. 10:38యోహా 3:1, 2
అపొ. 10:40యోనా 1:17; 2:10; అపొ 2:23, 24
అపొ. 10:41లూకా 24:30, 31; యోహా 21:13, 14
అపొ. 10:42అపొ 17:31; రోమా 14:9; 2కొ 5:10; 2తి 4:1; 1పే 4:5
అపొ. 10:42మత్త 28:19, 20; అపొ 1:8
అపొ. 10:43లూకా 24:27; ప్రక 19:10
అపొ. 10:43యెష 53:11; యిర్మీ 31:34; దాని 9:24
అపొ. 10:44అపొ 4:31; 8:14, 15
అపొ. 10:46అపొ 2:1, 4; 19:6
అపొ. 10:47మత్త 3:11; అపొ 8:36; 11:17
అపొ. 10:48మత్త 16:19; అపొ 2:38
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 10:1-48

అపొస్తలుల కార్యాలు

10 కైసరయలో కొర్నేలి అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఇటలీ దళంలో* సైనికాధికారి.* 2 అతను దైవభక్తి గలవాడు. అతను, అతని ఇంటివాళ్లందరూ దేవునికి భయపడేవాళ్లు. అతను ప్రజలకు ఎన్నో దానధర్మాలు చేసేవాడు. ఎప్పుడూ పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాడు. 3 ఒకరోజు, మధ్యాహ్నం దాదాపు మూడింటికి*+ అతనికి ఒక దర్శనం వచ్చింది. దానిలో అతను, ఒక దేవదూత తన దగ్గరికి రావడం స్పష్టంగా చూశాడు. ఆ దేవదూత అతన్ని, “కొర్నేలీ!” అని పిలిచాడు. 4 కొర్నేలి భయపడి ఆ దేవదూతనే చూస్తూ, “ఏంటి ప్రభూ?” అని అడిగాడు. ఆ దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నీ ప్రార్థనలు, దానధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వాటిని గుర్తుచేసుకున్నాడు.+ 5 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అని పిలవబడే సీమోనును పిలిపించు. 6 అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.” 7 అతనితో మాట్లాడిన దేవదూత వెళ్లిపోగానే కొర్నేలి ఇద్దరు సేవకుల్ని, తనకు ఎప్పుడూ సేవచేసే సైనికుల్లో దైవభక్తిగల ఒకతన్ని పిలిచాడు. 8 అతను జరిగిందంతా వాళ్లకు చెప్పి, వాళ్లను యొప్పేకు పంపించాడు.

9 తర్వాతి రోజు వాళ్లు ప్రయాణిస్తూ ఆ నగరం దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో పేతురు ప్రార్థించడానికి మిద్దె మీదికి వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు 12 గంటలు* అయింది. 10 అతనికి బాగా ఆకలి వేయడంతో ఏమైనా తినాలనుకున్నాడు. భోజనం సిద్ధమౌతుండగా, అతనికి ఒక దర్శనం వచ్చింది.*+ 11 ఆకాశం తెరవబడడం, పెద్ద దుప్పటి లాంటిదాన్ని నాలుగు మూలల్లో పట్టుకొని భూమ్మీదికి దించడం అతను చూశాడు. 12 భూమ్మీద ఉండే అన్నిరకాల నాలుగు కాళ్ల జంతువులు, పాకే జీవులు,* ఆకాశపక్షులు అందులో ఉన్నాయి. 13 అప్పుడు ఒక స్వరం పేతురుతో, “పేతురూ, లేచి వాటిని చంపుకొని తిను!” అని చెప్పింది. 14 కానీ పేతురు, “లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు” అన్నాడు.+ 15 ఆ స్వరం రెండోసారి అతనితో మాట్లాడి, “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు” అని చెప్పింది. 16 మూడోసారి కూడా అలాగే జరిగింది. తర్వాత వెంటనే ఆ దుప్పటి లాంటిది ఆకాశానికి ఎత్తబడింది.

17 ఆ దర్శనానికి అర్థం ఏమైవుంటుందో అని పేతురు కలవరపడుతుండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఎక్కడుందో అడిగి తెలుసుకొని, అప్పుడే అతని ఇంటి గుమ్మం దగ్గర నిలబడి,+ 18 సీమోను పేతురు అక్కడ అతిథిగా ఉన్నాడా అని బిగ్గరగా అడిగారు. 19 పేతురు ఇంకా ఆ దర్శనం గురించే ఆలోచిస్తుండగా, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పాడు:+ “ఇదిగో! ముగ్గురు మనుషులు నీ గురించి అడుగుతున్నారు. 20 నువ్వు లేచి, కిందికి దిగి, ఏమాత్రం సందేహించకుండా వాళ్లతో వెళ్లు. ఎందుకంటే నేనే వాళ్లను పంపించాను.” 21 అప్పుడు పేతురు కిందికి దిగి, “మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. మీరు ఎందుకు వచ్చారు?” అని ఆ మనుషుల్ని అడిగాడు. 22 దానికి వాళ్లు ఇలా చెప్పారు: “సైనికాధికారి కొర్నేలి+ నీతిపరుడు, దేవునికి భయపడే వ్యక్తి. యూదులందరి మధ్య అతనికి మంచిపేరు ఉంది. దేవుడు ఒక పవిత్ర దేవదూతను కొర్నేలి దగ్గరికి పంపి, నిన్ను ఇంటికి పిలిపించుకొని, నువ్వు చెప్పేది వినమని అతన్ని ఆదేశించాడు.” 23 కాబట్టి అతను వాళ్లను లోపలికి పిలిచి, అతిథి మర్యాదలు చేశాడు.

తర్వాతి రోజు అతను లేచి వాళ్లతో వెళ్లాడు. యొప్పేకు చెందిన కొంతమంది సహోదరులు కూడా అతనితో వెళ్లారు. 24 ఆ తర్వాతి రోజు అతను కైసరయకు చేరుకున్నాడు. కొర్నేలి వాళ్లకోసం ఎదురుచూస్తూ తన బంధువుల్ని, దగ్గరి స్నేహితుల్ని అక్కడికి పిలిపించాడు. 25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు. 27 తర్వాత అతనితో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లి, అక్కడ చాలామంది ఉండడం చూశాడు. 28 అప్పుడు పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, యూదులు అన్యజనులతో సహవాసం చేయడం గానీ, వాళ్లను కలవడం గానీ ఎంత తప్పో+ మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.+ 29 అందుకే మీరు నా కోసం మనుషుల్ని పంపినప్పుడు, ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.”

30 అప్పుడు కొర్నేలి ఇలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం దాదాపు మూడింటికి* నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు, మెరిసే వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నా ముందు నిలబడి 31 ఇలా అన్నాడు: ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ దానధర్మాలు గుర్తుచేసుకున్నాడు. 32 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనబడే సీమోనును పిలిపించు. అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.’+ 33 అప్పుడు నేను వెంటనే నీ కోసం మనుషుల్ని పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి మంచిపని చేశావు. ఏ విషయాల్ని చెప్పమని యెహోవా* నీకు ఆజ్ఞాపించాడో వాటిని వినడానికి మేమంతా ఇప్పుడు దేవుని ముందు సిద్ధంగా ఉన్నాం.”

34 అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు: “దేవునికి పక్షపాతం లేదని+ నాకు ఇప్పుడు నిజంగా అర్థమైంది. 35 ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.+ 36 ఆయన ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు ద్వారా శాంతి గురించిన మంచివార్త ప్రకటించి,+ వాళ్లకు ఒక సందేశాన్ని పంపించాడు. ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.+ 37 యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించిన తర్వాత, గలిలయ దగ్గర మొదలుపెట్టి+ యూదయ అంతట ప్రజలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నారో మీకు తెలుసు. 38 వాళ్లు నజరేతుకు చెందిన యేసు గురించి మాట్లాడుకున్నారు. దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు.+ ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ+ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.+ 39 యూదుల దేశంలో, యెరూషలేములో ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. అయితే వాళ్లు ఆయన్ని కొయ్యకు* వేలాడదీసి చంపేశారు. 40 దేవుడు మూడో రోజున ఆయన్ని బ్రతికించి,+ ఆయన ప్రజలకు కనిపించేలా* చేశాడు. 41 అయితే దేవుడు ఆయన్ని అందరికీ కనిపించేలా చేయలేదు కానీ ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతోపాటు తిని తాగిన మాకు మాత్రమే కనిపించేలా చేశాడు.+ ఆయన్ని చూసేలా, ఆయన గురించి మాట్లాడేలా దేవుడు ముందే మమ్మల్ని నియమించాడు. 42 అంతేకాదు బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి+ ఈయనే అని ప్రజలకు ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించాడు.+ 43 ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు.+ ఆయన మీద విశ్వాసముంచే ప్రతీ ఒక్కరి పాపాలు ఆయన పేరు ద్వారా క్షమించబడతాయని+ వాళ్లు చెప్పారు.”

44 పేతురు ఈ విషయాల గురించి మాట్లాడుతుండగానే, వాక్యం వింటున్న వాళ్లందరి మీదికి పవిత్రశక్తి వచ్చింది.+ 45 పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని అన్యజనులు కూడా పొందడం చూసి, పేతురుతో పాటు వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు* ఎంతో ఆశ్చర్యపోయారు. 46 ఎందుకంటే, అక్కడున్నవాళ్లు వేరే భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి మహిమపర్చడం వాళ్లు విన్నారు.+ అప్పుడు పేతురు ఇలా అన్నాడు: 47 “వీళ్లు మనలాగే పవిత్రశక్తిని పొందారు కాబట్టి వీళ్లు నీళ్లలో బాప్తిస్మం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా?”+ 48 దాంతో పేతురు, వాళ్లు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోవాలని ఆజ్ఞాపించాడు.+ తర్వాత వాళ్లు కొన్ని రోజులు తమ దగ్గరే ఉండమని అతన్ని వేడుకున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి