కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • స్తెఫను మహాసభ ముందు మాట్లాడడం (1-53)

        • పూర్వీకుల కాలం (2-16)

        • మోషే నాయకత్వం, ఇశ్రాయేలీయుల విగ్రహపూజ (17-43)

        • మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు నివసించడు (44-50)

      • స్తెఫనును రాళ్లతో కొట్టడం (54-60)

అపొస్తలుల కార్యాలు 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 48

    కావలికోట బ్రోషురు,

    విశ్వాసం, పేజీ 31

    కావలికోట,

    11/1/2001, పేజీ 31

    1/15/1998, పేజీ 10

అపొస్తలుల కార్యాలు 7:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    విశ్వాసం, పేజీలు 31-33

    కావలికోట,

    11/1/2001, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 7:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:32
  • +ఆది 12:4, 5; హెబ్రీ 11:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    కొత్త లోక అనువాదం, పేజీలు 1825-1826

    కావలికోట,

    11/1/2001, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 7:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:7; 13:14, 15; 17:1, 8

అపొస్తలుల కార్యాలు 7:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:13; నిర్గ 12:40

అపొస్తలుల కార్యాలు 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:14
  • +నిర్గ 3:12

అపొస్తలుల కార్యాలు 7:8

అధస్సూచీలు

  • *

    లేదా “ఇస్సాకు యాకోబు విషయంలో అలాగే చేశాడు” అయ్యుంటుంది.

  • *

    లేదా “మూలపురుషులకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:9, 10
  • +ఆది 21:1-3
  • +ఆది 21:4

అపొస్తలుల కార్యాలు 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:9-11
  • +ఆది 37:28; 45:4
  • +ఆది 39:2, 3

అపొస్తలుల కార్యాలు 7:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:40-46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 12/2019, పేజీ 1

అపొస్తలుల కార్యాలు 7:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:54; 42:5

అపొస్తలుల కార్యాలు 7:12

అధస్సూచీలు

  • *

    లేదా “ధాన్యం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 42:2, 6

అపొస్తలుల కార్యాలు 7:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 45:1, 16

అపొస్తలుల కార్యాలు 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 45:9-11
  • +ఆది 46:27; ద్వితీ 10:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2002, పేజీ 27

అపొస్తలుల కార్యాలు 7:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 46:29; ద్వితీ 26:5
  • +ఆది 49:33
  • +నిర్గ 1:6

అపొస్తలుల కార్యాలు 7:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:16; నిర్గ 13:19; యెహో 24:32

అపొస్తలుల కార్యాలు 7:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1998, పేజీలు 12-13

అపొస్తలుల కార్యాలు 7:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:7, 8

అపొస్తలుల కార్యాలు 7:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:10, 22

అపొస్తలుల కార్యాలు 7:20

అధస్సూచీలు

  • *

    లేదా “దేవుని దృష్టిలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:2; హెబ్రీ 11:23

అపొస్తలుల కార్యాలు 7:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:3
  • +నిర్గ 2:5, 10

అపొస్తలుల కార్యాలు 7:22

అధస్సూచీలు

  • *

    అక్ష., “తెలివి అంతటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 11:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2014, పేజీ 30

    6/15/2012, పేజీ 21

    3/15/2007, పేజీ 19

    6/15/2002, పేజీ 10

అపొస్తలుల కార్యాలు 7:23

అధస్సూచీలు

  • *

    లేదా “ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో చూడడానికి.”

  • *

    లేదా “అతను నిర్ణయించుకున్నాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:11-15

అపొస్తలుల కార్యాలు 7:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:21, 22; 18:2-4

అపొస్తలుల కార్యాలు 7:30

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:2-10

అపొస్తలుల కార్యాలు 7:31

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

అపొస్తలుల కార్యాలు 7:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:6; మార్కు 12:26; లూకా 20:37

అపొస్తలుల కార్యాలు 7:33

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

అపొస్తలుల కార్యాలు 7:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:23, 24

అపొస్తలుల కార్యాలు 7:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 2:14
  • +నిర్గ 4:19

అపొస్తలుల కార్యాలు 7:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:21, 22
  • +సం 14:33, 34
  • +నిర్గ 7:3
  • +నిర్గ 12:41

అపొస్తలుల కార్యాలు 7:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:15

అపొస్తలుల కార్యాలు 7:38

అధస్సూచీలు

  • *

    లేదా “సమాజం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:3
  • +గల 3:19
  • +నిర్గ 21:1; ద్వితీ 9:10

అపొస్తలుల కార్యాలు 7:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:3, 4
  • +నిర్గ 16:3

అపొస్తలుల కార్యాలు 7:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:1, 23

అపొస్తలుల కార్యాలు 7:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:4, 6

అపొస్తలుల కార్యాలు 7:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2000, పేజీలు 14-15

అపొస్తలుల కార్యాలు 7:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:7
  • +యిర్మీ 25:11; ఆమో 5:25-27

అపొస్తలుల కార్యాలు 7:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:40

అపొస్తలుల కార్యాలు 7:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:3; యెహో 3:14
  • +ఆది 17:1, 8; యెహో 23:9; 24:18

అపొస్తలుల కార్యాలు 7:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:2; 1ది 22:7; కీర్త 132:1-5

అపొస్తలుల కార్యాలు 7:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 6:1

అపొస్తలుల కార్యాలు 7:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 49

    కావలికోట,

    1/1/1991, పేజీలు 11-12

అపొస్తలుల కార్యాలు 7:49

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 11:4
  • +మత్త 5:34, 35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 49

అపొస్తలుల కార్యాలు 7:50

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 66:1, 2; హెబ్రీ 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 49

అపొస్తలుల కార్యాలు 7:51

అధస్సూచీలు

  • *

    లేదా “మీ హృదయాలు, చెవులు సున్నతి పొందలేదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 63:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 7

అపొస్తలుల కార్యాలు 7:52

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:16
  • +మత్త 23:31
  • +యెష 53:8; అపొ 3:13, 14

అపొస్తలుల కార్యాలు 7:53

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:38; గల 3:19

అపొస్తలుల కార్యాలు 7:54

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 46, 50

అపొస్తలుల కార్యాలు 7:55

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 110:1; మత్త 26:64

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2004, పేజీ 8

    1/1/1991, పేజీ 12

అపొస్తలుల కార్యాలు 7:56

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:13
  • +రోమా 8:34

అపొస్తలుల కార్యాలు 7:58

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 24:14, 16; మత్త 23:37; యోహా 16:2
  • +ద్వితీ 17:7
  • +అపొ 8:1; 22:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/1999, పేజీ 29

అపొస్తలుల కార్యాలు 7:59

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2008, పేజీ 31

    1/1/2005, పేజీ 31

    12/15/1994, పేజీ 24

    1/1/1991, పేజీ 12

అపొస్తలుల కార్యాలు 7:60

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    అక్ష., “మరణంలో నిద్రించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:44

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 7:2ఆది 11:31
అపొ. 7:3ఆది 12:1
అపొ. 7:4ఆది 11:32
అపొ. 7:4ఆది 12:4, 5; హెబ్రీ 11:8
అపొ. 7:5ఆది 12:7; 13:14, 15; 17:1, 8
అపొ. 7:6ఆది 15:13; నిర్గ 12:40
అపొ. 7:7ఆది 15:14
అపొ. 7:7నిర్గ 3:12
అపొ. 7:8ఆది 17:9, 10
అపొ. 7:8ఆది 21:1-3
అపొ. 7:8ఆది 21:4
అపొ. 7:9ఆది 37:9-11
అపొ. 7:9ఆది 37:28; 45:4
అపొ. 7:9ఆది 39:2, 3
అపొ. 7:10ఆది 41:40-46
అపొ. 7:11ఆది 41:54; 42:5
అపొ. 7:12ఆది 42:2, 6
అపొ. 7:13ఆది 45:1, 16
అపొ. 7:14ఆది 45:9-11
అపొ. 7:14ఆది 46:27; ద్వితీ 10:22
అపొ. 7:15ఆది 46:29; ద్వితీ 26:5
అపొ. 7:15ఆది 49:33
అపొ. 7:15నిర్గ 1:6
అపొ. 7:16ఆది 23:16; నిర్గ 13:19; యెహో 24:32
అపొ. 7:18నిర్గ 1:7, 8
అపొ. 7:19నిర్గ 1:10, 22
అపొ. 7:20నిర్గ 2:2; హెబ్రీ 11:23
అపొ. 7:21నిర్గ 2:3
అపొ. 7:21నిర్గ 2:5, 10
అపొ. 7:22నిర్గ 11:3
అపొ. 7:23నిర్గ 2:11-15
అపొ. 7:29నిర్గ 2:21, 22; 18:2-4
అపొ. 7:30నిర్గ 3:2-10
అపొ. 7:32నిర్గ 3:6; మార్కు 12:26; లూకా 20:37
అపొ. 7:34నిర్గ 2:23, 24
అపొ. 7:35నిర్గ 2:14
అపొ. 7:35నిర్గ 4:19
అపొ. 7:36నిర్గ 14:21, 22
అపొ. 7:36సం 14:33, 34
అపొ. 7:36నిర్గ 7:3
అపొ. 7:36నిర్గ 12:41
అపొ. 7:37ద్వితీ 18:15
అపొ. 7:38నిర్గ 19:3
అపొ. 7:38గల 3:19
అపొ. 7:38నిర్గ 21:1; ద్వితీ 9:10
అపొ. 7:39సం 14:3, 4
అపొ. 7:39నిర్గ 16:3
అపొ. 7:40నిర్గ 32:1, 23
అపొ. 7:41నిర్గ 32:4, 6
అపొ. 7:422రా 17:16
అపొ. 7:431రా 11:7
అపొ. 7:43యిర్మీ 25:11; ఆమో 5:25-27
అపొ. 7:44నిర్గ 25:40
అపొ. 7:45ద్వితీ 31:3; యెహో 3:14
అపొ. 7:45ఆది 17:1, 8; యెహో 23:9; 24:18
అపొ. 7:462స 7:2; 1ది 22:7; కీర్త 132:1-5
అపొ. 7:471రా 6:1
అపొ. 7:48అపొ 17:24
అపొ. 7:49కీర్త 11:4
అపొ. 7:49మత్త 5:34, 35
అపొ. 7:50యెష 66:1, 2; హెబ్రీ 3:4
అపొ. 7:51యెష 63:10
అపొ. 7:522ది 36:16
అపొ. 7:52మత్త 23:31
అపొ. 7:52యెష 53:8; అపొ 3:13, 14
అపొ. 7:53అపొ 7:38; గల 3:19
అపొ. 7:55కీర్త 110:1; మత్త 26:64
అపొ. 7:56దాని 7:13
అపొ. 7:56రోమా 8:34
అపొ. 7:58లేవీ 24:14, 16; మత్త 23:37; యోహా 16:2
అపొ. 7:58ద్వితీ 17:7
అపొ. 7:58అపొ 8:1; 22:20
అపొ. 7:60మత్త 5:44
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 7:1-60

అపొస్తలుల కార్యాలు

7 అయితే ప్రధానయాజకుడు, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. 2 అప్పుడు స్తెఫను ఇలా అన్నాడు: “సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో నివసించడానికి ముందు,+ మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి కనిపించి, 3 ‘నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పాడు.+ 4 తర్వాత అతను కల్దీయుల దేశం నుండి బయటికి వచ్చి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయాక,+ దేవుడు అతన్ని మీరు ఇప్పుడు ఉంటున్న ఈ దేశానికి వెళ్లమన్నాడు.+ 5 కానీ ఈ దేశంలో దేవుడు అతనికి వారసత్వ ఆస్తిగా ఏమీ ఇవ్వలేదు, కనీసం అతను కాలు పెట్టేంత స్థలం కూడా ఇవ్వలేదు. అయితే అతనికి, ఆ తర్వాత అతని సంతానానికి* ఈ దేశాన్ని వారసత్వ ఆస్తిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.+ అప్పటికి అబ్రాహాముకు ఇంకా పిల్లలు లేరు. 6 అంతేకాదు, అతని సంతానం* తమది కాని దేశంలో పరదేశులుగా ఉంటారని, ఆ దేశ ప్రజలు వీళ్లను బానిసలుగా చేసుకొని 400 ఏళ్లపాటు వీళ్లను కష్టాలు పెడతారని దేవుడు అతనికి చెప్పాడు.+ 7 అయితే, ‘ఏ దేశంలో వాళ్లు బానిసలుగా ఉంటారో ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను.+ ఇవి జరిగిన తర్వాత వాళ్లు ఆ దేశం నుండి బయటికి వచ్చి ఈ స్థలంలో నాకు పవిత్రసేవ చేస్తారు’+ అని దేవుడు చెప్పాడు.

8 “దేవుడు అతనితో సున్నతి ఒప్పందం కూడా చేశాడు.+ తర్వాత అతను ఇస్సాకుకు తండ్రి అయ్యాడు,+ ఎనిమిదో రోజున అతనికి సున్నతి చేశాడు.+ ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు.* యాకోబు, 12 మంది కుటుంబ పెద్దలకు* తండ్రి అయ్యాడు. 9 ఆ కుటుంబ పెద్దలు యోసేపు మీద అసూయపడి+ అతన్ని ఐగుప్తీయులకు అమ్మేశారు.+ అయితే దేవుడు అతనికి తోడుగా ఉండి+ 10 అతనికి వచ్చిన శ్రమలన్నిటిలో అతన్ని కాపాడాడు; ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయను, తెలివిని అనుగ్రహించాడు. ఫరో అతన్ని ఐగుప్తు మీద, తన ఇల్లంతటి మీద అధికారిగా నియమించాడు.+ 11 తర్వాత ఐగుప్తు దేశమంతటి మీదికి, అలాగే కనాను దేశమంతటి మీదికి కరువు వచ్చింది. అవును, గొప్ప శ్రమ వచ్చింది. దాంతో మన పూర్వీకులకు తినడానికి ఏమీ దొరకలేదు.+ 12 అయితే ఐగుప్తులో ఆహారం* ఉందని తెలియడంతో యాకోబు మన పూర్వీకుల్ని మొదటిసారి ఐగుప్తుకు పంపించాడు.+ 13 వాళ్లు రెండోసారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు చెప్పాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.+ 14 కాబట్టి యోసేపు తన తండ్రి యాకోబును, తన బంధువులందర్నీ కనాను దేశం నుండి రమ్మని కబురు పంపాడు.+ వాళ్లందరూ 75 మంది.+ 15 కాబట్టి యాకోబు ఐగుప్తుకు వెళ్లాడు.+ తర్వాత అతను అక్కడే చనిపోయాడు.+ అలాగే మన పూర్వీకులు కూడా చనిపోయారు.+ 16 వాళ్ల ఎముకల్ని షెకెముకు తీసుకెళ్లి, షెకెములో హమోరు కుమారుల దగ్గర అబ్రాహాము వెండి నాణేలతో కొన్న సమాధిలో  పెట్టారు.+

17 “దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే సమయం దగ్గరపడుతుండగా, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంతగానో పెరుగుతూ వచ్చింది. 18 తర్వాత, యోసేపు గురించి తెలియని ఇంకో రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు.+ 19 అతను మన పూర్వీకుల మీద కుట్ర పన్నాడు. వాళ్ల పిల్లలు బ్రతికి ఉండకూడదనే ఉద్దేశంతో, పుట్టగానే ఆ పిల్లల్ని వదిలేయాలని వాళ్లను బలవంతం చేశాడు. అలా వాళ్లతో చెడుగా వ్యవహరించాడు.+ 20 ఆ సమయంలోనే మోషే పుట్టాడు, అతను చాలా* అందంగా ఉండేవాడు. మూడు నెలలు అతను తండ్రి ఇంట్లోనే పెరిగాడు.+ 21 అయితే అతను వదిలేయబడినప్పుడు+ ఫరో కూతురు అతన్ని తీసుకొని, తన సొంత కుమారుడిలా పెంచింది.+ 22 కాబట్టి ఐగుప్తీయుల విద్యలన్నిటినీ* మోషేకు నేర్పించారు. నిజానికి అతను శక్తివంతంగా మాట్లాడాడు, గొప్ప పనులు చేశాడు.+

23 “అతనికి 40 ఏళ్లు వచ్చినప్పుడు, తన సహోదరుల్ని అంటే ఇశ్రాయేలీయుల్ని చూడడానికి* వెళ్లాలని అతని మనసుకు అనిపించింది.*+ 24 అప్పుడు అతను ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయునితో అన్యాయంగా ప్రవర్తించడం చూసి ఆ ఇశ్రాయేలీయుణ్ణి కాపాడాడు, ఆ ఐగుప్తీయుణ్ణి చంపి తన సహోదరుని తరఫున పగతీర్చుకున్నాడు. 25 దేవుడు తన ద్వారా వాళ్లను కాపాడబోతున్నాడనే విషయాన్ని తన సహోదరులు గ్రహిస్తారని అతను అనుకున్నాడు. కానీ వాళ్లు గ్రహించలేదు. 26 తర్వాతి రోజు అతను వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతను వాళ్ల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తూ, ‘మీరిద్దరు సహోదరులు. మీరెందుకు ఇలా పోట్లాడుకుంటున్నారు?’ అని అన్నాడు. 27 అయితే తన సహోదరుణ్ణి కొడుతున్న వ్యక్తి, మోషేను పక్కకు నెట్టేసి ఇలా అన్నాడు: ‘మా మీద పరిపాలకునిగా, న్యాయమూర్తిగా నిన్ను ఎవరు నియమించారు? 28 నిన్న ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టే నన్ను కూడా చంపాలనుకుంటున్నావా?’ 29 ఆ మాట విన్నప్పుడు మోషే పారిపోయి, మిద్యాను దేశంలో పరదేశిగా జీవించాడు. అక్కడ అతనికి ఇద్దరు కుమారులు పుట్టారు.+

30 “40 సంవత్సరాల తర్వాత, సీనాయి పర్వతం దగ్గరున్న ఎడారి* ప్రాంతంలో, మండుతున్న ముళ్లపొద మంటల్లో అతనికి ఒక దేవదూత కనిపించాడు.+ 31 ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మోషే ఎంతో ఆశ్చర్యపోయాడు. అదేమిటో తెలుసుకుందామని దాని దగ్గరికి వెళ్తుండగా, యెహోవా* స్వరం అతనికి ఇలా వినిపించింది: 32 ‘నేను మీ పూర్వీకుల దేవుణ్ణి, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి.’+ దాంతో మోషే వణికిపోయి, ఇక దానివైపు చూసే ధైర్యం చేయలేదు. 33 అప్పుడు యెహోవా* అతనితో ఇలా చెప్పాడు: ‘నీ పాదాలకున్న చెప్పులు తీసేయి, నువ్వు నిలబడిన స్థలం పవిత్రమైనది. 34 ఐగుప్తులో ఉన్న నా ప్రజలు పడుతున్న కష్టాల్ని నేను నిజంగా చూశాను, వాళ్ల మూల్గులు నేను విన్నాను.+ అందుకే వాళ్లను కాపాడడానికి దిగివచ్చాను. రా, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను.’ 35 ‘నిన్ను పరిపాలకునిగా, న్యాయమూర్తిగా ఎవరు నియమించారు?’+ అంటూ వాళ్లు తిరస్కరించిన ఆ మోషేనే దేవుడు పరిపాలకునిగా, విమోచకునిగా పంపించాడు.+ ముళ్లపొదలో అతనికి కనిపించిన దేవదూత ద్వారా అలా పంపించాడు. 36 ఈ మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రం దగ్గర,+ అలాగే 40 సంవత్సరాల పాటు ఎడారిలో+ అద్భుతాలు, సూచనలు చేస్తూ+ వాళ్లను బయటికి నడిపించాడు.+

37 “ ‘దేవుడు మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు’+ అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతనే. 38 ఎడారిలో ఇశ్రాయేలీయుల* మధ్య ఉన్నదీ, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన+ దేవదూతతో,+ అలాగే మన పూర్వీకులతో ఉన్నదీ ఇతనే. ఇతనే మనకు ఇవ్వడానికి దేవుని నుండి సజీవమైన సందేశాన్ని అందుకున్నాడు.+ 39 మన పూర్వీకులు అతని మాట వినడానికి నిరాకరించారు.+ వాళ్లు అతన్ని పక్కకు నెట్టేసి, తమ హృదయాల్లో ఐగుప్తుకు వెళ్లాలని కోరుకున్నారు.+ 40 వాళ్లు అహరోనుతో ఇలా అన్నారు: ‘మనల్ని నడిపించడానికి మన కోసం దేవుళ్లను చేయి. ఐగుప్తు దేశం నుండి మనల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో తెలీదు.’+ 41 కాబట్టి వాళ్లు ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసుకుని, దానికి బలి అర్పించారు, తమ చేతులతో చేసినదాన్ని చూస్తూ సంబరాలు జరుపుకున్నారు.+ 42 కాబట్టి ప్రవక్తల పుస్తకంలో రాసివున్నట్టే దేవుడు వాళ్లను సూర్య చంద్ర నక్షత్రాల్ని పూజించేలా వదిలేశాడు.+ ఆ పుస్తకంలో ఇలా రాసివుంది: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఎడారిలో 40 సంవత్సరాల పాటు మీరు అర్పణలు, బలులు అర్పించింది నాకా? కాదు కదా? 43 మీరు మొలొకు గుడారాన్ని,+ రొంఫా దేవుడి నక్షత్రాన్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి మోసుకెళ్లారు. మీరు పూజించడానికే ఆ ప్రతిమల్ని చేసుకున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని బబులోను అవతలికి పంపించేస్తాను.’+

44 “మన పూర్వీకులకు ఎడారిలో ఒక సాక్ష్యపు గుడారం ఉండేది. దాన్ని చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం వాళ్లు దాన్ని చేశారు.+ 45 తర్వాత, మన పూర్వీకుల పిల్లలు ఆ గుడారాన్ని పొందారు. వాళ్లు యెహోషువతో పాటు అన్యజనుల దేశానికి వెళ్లినప్పుడు దాన్ని తమతో తీసుకెళ్లారు.+ దేవుడు మన పూర్వీకుల ముందు నుండి వాళ్లను వెళ్లగొట్టాడు.+ దావీదు రోజుల వరకు ఆ గుడారం అక్కడే ఉంది. 46 దావీదు దేవుని దృష్టిలో అనుగ్రహం పొందాడు. అతను యాకోబు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టే గొప్ప అవకాశం తనకు ఇవ్వమని కోరాడు.+ 47 కానీ దేవుని కోసం ఆ మందిరాన్ని సొలొమోను కట్టాడు.+ 48 అయితే చేతులతో చేసిన మందిరాల్లో సర్వోన్నతుడు నివసించడు.+ దీని గురించి ప్రవక్త కూడా ఇలా చెప్పాడు: 49 ‘యెహోవా* ఇలా అంటున్నాడు: ఆకాశం నా సింహాసనం,+ భూమి నా పాదపీఠం.+ మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఎక్కడ? 50 వీటన్నిటినీ చేసింది నా చేతులే కదా?’+

51 “మొండి ప్రజలారా, మీరు మీ చెవులు మూసుకున్నారు, మీ ఆలోచనాతీరు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు.* మీరు ఎప్పుడూ పవిత్రశక్తిని ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు చేసినట్టే మీరూ చేస్తున్నారు.+ 52 మీ పూర్వీకులు హింసించని ప్రవక్త ఒక్కరైనా ఉన్నారా?+ అవును, ఆ నీతిమంతుని రాక గురించి ముందే ప్రకటించినవాళ్లను మీ పూర్వీకులు చంపేశారు.+ మీరేమో ఆ నీతిమంతునికి ద్రోహం చేసి, ఆయన్ని హత్య చేశారు;+ 53 దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని పొంది+ కూడా దాన్ని పాటించలేదు.”

54 ఆ మాటలు విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు స్తెఫనును చూస్తూ పళ్లు కొరకడం మొదలుపెట్టారు. 55 అయితే అతను పవిత్రశక్తితో నిండిపోయి, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అతనికి దేవుని మహిమ, దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం కనిపించింది.+ 56 అప్పుడు అతను, “ఇదిగో! ఆకాశం తెరవబడి ఉండడం, మానవ కుమారుడు+ దేవుని కుడిపక్కన నిలబడి ఉండడం+ నేను చూస్తున్నాను” అన్నాడు. 57 ఆ మాట వినగానే వాళ్లు గట్టిగా కేకలు వేస్తూ, తమ చెవులు మూసుకొని, ఒక్కసారిగా అందరూ అతని మీదికి వచ్చారు. 58 వాళ్లు అతన్ని నగరం బయటికి లాక్కొచ్చి, అతని మీదికి రాళ్లు విసరడం మొదలుపెట్టారు.+ అతని మీద అబద్ధసాక్ష్యం చెప్పినవాళ్లు+ తమ పైవస్త్రాల్ని సౌలు అనే ఒక యువకుడి పాదాల దగ్గర పెట్టారు.+ 59 వాళ్లు స్తెఫను మీద రాళ్లు విసురుతున్నప్పుడు, అతను ఇలా వేడుకున్నాడు: “యేసు ప్రభువా, నా ప్రాణాన్ని* నీకు అప్పగిస్తున్నాను.” 60 తర్వాత అతను మోకరించి బిగ్గరగా ఇలా అన్నాడు: “యెహోవా,* ఈ పాపానికి వాళ్లను బాధ్యులుగా ఎంచకు.”+ ఆ మాట అన్నాక, అతను చనిపోయాడు.*

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి