కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • బత్షెబతో దావీదు వ్యభిచారం (1-13)

      • దావీదు ఊరియాను చంపించడం (14-25)

      • దావీదు బత్షెబను భార్యగా చేసుకోవడం (26, 27)

2 సమూయేలు 11:1

అధస్సూచీలు

  • *

    అంటే, వసంతకాలంలో.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:26
  • +1ది 20:1

2 సమూయేలు 11:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:24; 1రా 1:11
  • +1ది 3:5, 9
  • +ఆది 10:15; ద్వితీ 20:17
  • +2స 23:8, 39; 1రా 15:5

2 సమూయేలు 11:4

అధస్సూచీలు

  • *

    బహుశా రుతుస్రావ అపవిత్రత కావచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:14, 17
  • +లేవీ 18:20; 20:10; సామె 6:32; హెబ్రీ 13:4
  • +లేవీ 12:2; 15:19; 18:19

2 సమూయేలు 11:8

అధస్సూచీలు

  • *

    లేదా “రాజ భాగం,” అంటే, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి గౌరవనీయుడైన అతిథికి పంపించే భాగం.

2 సమూయేలు 11:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:17; 7:2
  • +లేవీ 15:16; 1స 21:5

2 సమూయేలు 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 51:14; సామె 3:29

2 సమూయేలు 11:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:9

2 సమూయేలు 11:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:32; 7:1
  • +న్యా 9:50-53

2 సమూయేలు 11:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:7-9; 1రా 15:5; కీర్త 5:6; 11:4; హెబ్రీ 13:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 11:12స 12:26
2 సమూ. 11:11ది 20:1
2 సమూ. 11:32స 12:24; 1రా 1:11
2 సమూ. 11:31ది 3:5, 9
2 సమూ. 11:3ఆది 10:15; ద్వితీ 20:17
2 సమూ. 11:32స 23:8, 39; 1రా 15:5
2 సమూ. 11:4నిర్గ 20:14, 17
2 సమూ. 11:4లేవీ 18:20; 20:10; సామె 6:32; హెబ్రీ 13:4
2 సమూ. 11:4లేవీ 12:2; 15:19; 18:19
2 సమూ. 11:112స 6:17; 7:2
2 సమూ. 11:11లేవీ 15:16; 1స 21:5
2 సమూ. 11:15కీర్త 51:14; సామె 3:29
2 సమూ. 11:172స 12:9
2 సమూ. 11:21న్యా 6:32; 7:1
2 సమూ. 11:21న్యా 9:50-53
2 సమూ. 11:27ఆది 39:7-9; 1రా 15:5; కీర్త 5:6; 11:4; హెబ్రీ 13:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 11:1-27

సమూయేలు రెండో గ్రంథం

11 సంవత్సరం ఆరంభంలో,* రాజులు యుద్ధాలకు వెళ్లే కాలంలో, అమ్మోనీయుల్ని నాశనం చేయడానికి దావీదు యోవాబును, తన సేవకుల్ని, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ పంపించాడు. వాళ్లు రబ్బాను ముట్టడించారు.+ ఆ సమయంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు.+

2 ఒకరోజు సాయంత్రం దావీదు తన మంచం మీద నుండి లేచి రాజభవనం మిద్దె మీద అటూఇటూ నడుస్తున్నాడు. అతను మిద్దె మీద నుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది. 3 దావీదు ఆమె గురించి కనుక్కోవడానికి ఒక మనిషిని పంపించాడు. అతను వచ్చి ఇలా చెప్పాడు: “ఆమె పేరు బత్షెబ.+ ఆమె ఏలీయాము కూతురు,+ హిత్తీయుడైన+ ఊరియా+ భార్య.” 4 అప్పుడు దావీదు ఆమెను తీసుకురావడానికి+ మనుషుల్ని పంపించాడు. ఆమె అతని దగ్గరికి వచ్చింది, అతను ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు.+ (ఆమె తన అపవిత్రత* నుండి తనను తాను పవిత్రపర్చుకుంటున్న సమయంలో ఇది జరిగింది)+ తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది.

5 ఆమె గర్భవతి అయింది. ఆమె, “నేను గర్భవతిని అయ్యాను” అని దావీదుకు కబురు పంపించింది. 6 అప్పుడు దావీదు, “హిత్తీయుడైన ఊరియాను నా దగ్గరికి పంపించు” అని యోవాబుకు కబురు చేశాడు. కాబట్టి యోవాబు ఊరియాను దావీదు దగ్గరికి పంపించాడు. 7 ఊరియా తన దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అతన్ని, యోవాబు ఎలా ఉన్నాడో, సైనికులు ఎలా ఉన్నారో, యుద్ధం ఎలా జరుగుతుందో అడిగాడు. 8 తర్వాత దావీదు ఊరియాతో, “మీ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అన్నాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లినప్పుడు అతని వెనక, రాజు ఇచ్చిన కానుక* పంపించబడింది. 9 అయితే, ఊరియా తన ఇంటికి వెళ్లకుండా రాజభవనం ప్రవేశ ద్వారం దగ్గర తన ప్రభువు సేవకులందరితోపాటు నిద్రపోయాడు. 10 “ఊరియా తన ఇంటికి వెళ్లలేదు” అని దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను, “నువ్వు ఇప్పుడే కదా ప్రయాణం చేసి వచ్చావు. నీ ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు. 11 దానికి ఊరియా దావీదుతో ఇలా అన్నాడు: “మందసం+ అలాగే ఇశ్రాయేలు ప్రజలు, యూదావాళ్లు డేరాల్లో ఉంటున్నారు; నా ప్రభువు యోవాబు, నా ప్రభువు సేవకులు బయట మైదానంలో మకాం వేసుకొని ఉన్నారు. అలాంటప్పుడు నేను తినడానికి, తాగడానికి, నా భార్యతో పడుకోవడానికి+ నా ఇంటికి వెళ్లాలా? నీ జీవం తోడు, నీ ఊపిరి తోడు, నేను ఆ పని చేయను!”

12 అప్పుడు దావీదు ఊరియాతో, “ఈ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు, రేపు నిన్ను పంపిస్తాను” అన్నాడు. దాంతో ఊరియా ఆ రోజు, ఆ తర్వాతి రోజు యెరూషలేములోనే ఉన్నాడు. 13 తర్వాత దావీదు తనతో కలిసి తినడానికి, తాగడానికి ఊరియాను పిలిపించాడు. అతనికి బాగా తాగించాడు. అయితే సాయంత్రమయ్యే సరికి అతను తన ప్రభువు సేవకులతో కలిసి తన పడక మీద పడుకోవడానికి వెళ్లాడు కానీ తన ఇంటికి మాత్రం వెళ్లలేదు. 14 ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాసి, ఊరియా చేతికిచ్చి పంపించాడు. 15 అతను ఉత్తరంలో ఇలా రాశాడు: “యుద్ధం తీవ్రంగా జరిగే ముందు వరుసల్లో ఊరియాను ఉంచు, తర్వాత అతనికి దెబ్బ తగిలి చనిపోయేలా మీరు అతని వెనక నుండి వచ్చేయండి.”+

16 యోవాబు నగరాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు, అతను ఊరియాను బలమైన యోధులు ఉన్న స్థలంలో ఉంచాడు. 17 నగరంలోని మనుషులు బయటికి వచ్చి యోవాబుతో పోరాడినప్పుడు, దావీదు సేవకులు కొంతమంది చనిపోయారు. చనిపోయినవాళ్లలో హిత్తీయుడైన ఊరియా కూడా ఉన్నాడు.+ 18 అప్పుడు యోవాబు యుద్ధం గురించిన వార్తలన్నీ దావీదుకు తెలియజేశాడు. 19 యోవాబు సందేశకున్ని ఇలా ఆదేశించాడు: “యుద్ధం గురించిన వార్తలన్నీ నువ్వు రాజుకు చెప్పాక 20 రాజుకు కోపం వచ్చి నీతో, ‘యుద్ధం చేయడానికి మీరు నగరానికి అంత దగ్గరగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రాకారం మీద నుండి వాళ్లు బాణాలు వేస్తారని మీకు తెలీదా? 21 ఎరుబ్బెషెతు+ కుమారుడైన అబీమెలెకును+ ఎవరు చంపారు? తేబేసులో ప్రాకారం మీద నుండి అతనిపై తిరుగలి రాయి వేసి అతని చావుకు కారణమైంది ఒక స్త్రీ కాదా? మీరు ప్రాకారానికి అంత దగ్గరగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?’ అని అంటే, నువ్వు ఇలా చెప్పు, ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.’”

22 దాంతో ఆ సందేశకుడు వెళ్లి దావీదుకు చెప్పమని యోవాబు తనకు ఆదేశించినవన్నీ చెప్పాడు. 23 తర్వాత అతను దావీదుకు ఇలా చెప్పాడు: “వాళ్ల మనుషులు మామీద పైచేయి సాధించారు. వాళ్లు మైదానంలో మామీదికి వచ్చారు; కానీ మేము వాళ్లను వెనక్కి నగర ప్రవేశ ద్వారం దగ్గరికి తరిమాం. 24 బాణాలు వేసేవాళ్లు ప్రాకారం మీద నుండి నీ సేవకుల మీద బాణాలు వేస్తూ ఉన్నారు. రాజు సేవకుల్లో కొంతమంది చనిపోయారు; నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.” 25 అప్పుడు దావీదు ఆ సందేశకునితో ఇలా అన్నాడు: “యోవాబుకు ఇలా చెప్పు: ‘ఈ విషయం గురించి నువ్వు ఆందోళనపడొద్దు. యుద్ధంలో ఎవరైనా చనిపోవచ్చు. నగరం మీద నీ పోరాటాన్ని తీవ్రతరం చేసి దాన్ని జయించు.’ తర్వాత అతన్ని ప్రోత్సహించు.”

26 తన భర్త చనిపోయాడని ఊరియా భార్య విన్నప్పుడు, ఆమె తన భర్త గురించి దుఃఖపడడం మొదలుపెట్టింది. 27 దుఃఖించే రోజులు పూర్తికాగానే, దావీదు ఆమె కోసం మనుషుల్ని పంపించి ఆమెను తన ఇంటికి తెప్పించుకున్నాడు. ఆమె అతని భార్య అయింది. అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. కానీ దావీదు చేసిన పని యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి