కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • దావీదు కెయీలా నగరాన్ని కాపాడడం (1-12)

      • సౌలు దావీదును తరమడం (13-15)

      • యోనాతాను దావీదును బలపర్చడం (16-18)

      • దావీదు సౌలు చేతుల్లో నుండి తృటిలో తప్పించుకోవడం (19-29)

1 సమూయేలు 23:1

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 44

1 సమూయేలు 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 30:8; 2స 5:19; కీర్త 37:5

1 సమూయేలు 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:5
  • +1స 13:5; 14:52

1 సమూయేలు 23:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:39
  • +1స 14:6; 2స 5:19

1 సమూయేలు 23:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:1

1 సమూయేలు 23:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:20

1 సమూయేలు 23:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:14

1 సమూయేలు 23:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:21; 1స 30:7

1 సమూయేలు 23:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:19

1 సమూయేలు 23:11

అధస్సూచీలు

  • *

    లేదా “జమీందారులు” అయ్యుంటుంది.

1 సమూయేలు 23:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:1, 2; 25:13; 30:9

1 సమూయేలు 23:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 55; 1స 23:19; 26:1
  • +1స 18:29; 20:33; 27:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 10

1 సమూయేలు 23:15

అధస్సూచీలు

  • *

    లేదా “దావీదుకు తెలిసి భయపడ్డాడు” అయ్యుంటుంది.

1 సమూయేలు 23:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:5; సామె 17:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    వాళ్లలా విశ్వాసం చూపించండి, ఆర్టికల్‌ 3

    కావలికోట,

    12/15/2015, పేజీ 10

1 సమూయేలు 23:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:13; 2స 2:4; 5:3
  • +1స 20:31; 24:17, 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    వాళ్లలా విశ్వాసం చూపించండి, ఆర్టికల్‌ 3

    కావలికోట,

    12/1/1993, పేజీ 24

1 సమూయేలు 23:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:3; 20:42

1 సమూయేలు 23:19

అధస్సూచీలు

  • *

    లేదా “ఎడారి; ఎండిన ప్రదేశం” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:26
  • +1స 23:15
  • +1స 23:24
  • +1స 26:3
  • +1స 26:1; కీర్త 54:పైవిలాసం

1 సమూయేలు 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 54:3

1 సమూయేలు 23:23

అధస్సూచీలు

  • *

    లేదా “కుటుంబాలన్నిట్లో.”

1 సమూయేలు 23:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:14
  • +ద్వితీ 1:7
  • +యెహో 15:20, 55; 1స 25:2, 3

1 సమూయేలు 23:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:2; కీర్త 54:3
  • +1స 23:28

1 సమూయేలు 23:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 31:22
  • +కీర్త 17:9

1 సమూయేలు 23:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 54:7

1 సమూయేలు 23:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 62; పర 1:14

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 23:1యెహో 15:20, 44
1 సమూ. 23:21స 30:8; 2స 5:19; కీర్త 37:5
1 సమూ. 23:31స 22:5
1 సమూ. 23:31స 13:5; 14:52
1 సమూ. 23:4న్యా 6:39
1 సమూ. 23:41స 14:6; 2స 5:19
1 సమూ. 23:51స 23:1
1 సమూ. 23:61స 22:20
1 సమూ. 23:71స 23:14
1 సమూ. 23:9సం 27:21; 1స 30:7
1 సమూ. 23:101స 22:19
1 సమూ. 23:131స 22:1, 2; 25:13; 30:9
1 సమూ. 23:14యెహో 15:20, 55; 1స 23:19; 26:1
1 సమూ. 23:141స 18:29; 20:33; 27:1
1 సమూ. 23:16కీర్త 37:5; సామె 17:17
1 సమూ. 23:171స 16:13; 2స 2:4; 5:3
1 సమూ. 23:171స 20:31; 24:17, 20
1 సమూ. 23:181స 18:3; 20:42
1 సమూ. 23:191స 10:26
1 సమూ. 23:191స 23:15
1 సమూ. 23:191స 23:24
1 సమూ. 23:191స 26:3
1 సమూ. 23:191స 26:1; కీర్త 54:పైవిలాసం
1 సమూ. 23:20కీర్త 54:3
1 సమూ. 23:241స 23:14
1 సమూ. 23:24ద్వితీ 1:7
1 సమూ. 23:24యెహో 15:20, 55; 1స 25:2, 3
1 సమూ. 23:251స 26:2; కీర్త 54:3
1 సమూ. 23:251స 23:28
1 సమూ. 23:26కీర్త 31:22
1 సమూ. 23:26కీర్త 17:9
1 సమూ. 23:28కీర్త 54:7
1 సమూ. 23:29యెహో 15:20, 62; పర 1:14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 23:1-29

సమూయేలు మొదటి గ్రంథం

23 కొంతకాలం తర్వాత, “ఫిలిష్తీయులు కెయీలా+ మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్లు కళ్లాల్లోని* ధాన్యాన్ని దోచుకుంటున్నారు” అనే వార్త దావీదుకు అందింది. 2 అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఆ ఫిలిష్తీయుల్ని హతం చేయనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ దానికి యెహోవా, “నువ్వు వెళ్లి ఫిలిష్తీయుల్ని హతం చేసి కెయీలాను రక్షించు” అని దావీదుకు చెప్పాడు. 3 కానీ దావీదు మనుషులు అతనితో, “ఇదిగో! మేము ఇక్కడ యూదాలో ఉండే ఇంత భయపడుతున్నాం;+ అలాంటిది ఫిలిష్తీయుల సైన్యానికి వ్యతిరేకంగా+ కెయీలాకు వెళ్లాలంటే ఇంకెంత భయపడతామో ఆలోచించు!” అన్నారు. 4 దాంతో దావీదు మళ్లీ యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ అప్పుడు యెహోవా అతనితో, “నువ్వు లేచి, కెయీలాకు వెళ్లు, ఎందుకంటే ఫిలిష్తీయుల్ని నీ చేతికి అప్పగిస్తాను”+ అని చెప్పాడు. 5 కాబట్టి దావీదు తన మనుషులతో కెయీలాకు వెళ్లి, ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు; అతను వాళ్ల పశువుల్ని దోచుకొని, వాళ్లలో చాలామందిని హతం చేశాడు. అలా దావీదు కెయీలా నివాసుల్ని రక్షించాడు.+

6 అహీమెలెకు కుమారుడు అబ్యాతారు+ కెయీలాలో దావీదు దగ్గరికి పారిపోయినప్పుడు, అతని దగ్గర ఏఫోదు ఉంది. 7 “దావీదు కెయీలాకు వచ్చాడు” అనే వార్త సౌలుకు అందింది. అప్పుడు సౌలు, “దేవుడు అతన్ని నాకు అప్పగించాడు.+ అతను ద్వారాలు, అడ్డగడియలు ఉన్న నగరంలోకి ప్రవేశించి ఇరుక్కుపోయాడు” అని అనుకున్నాడు. 8 కెయీలాకు వెళ్లి దావీదును, అతని మనుషుల్ని చుట్టుముట్టేలా యుద్ధానికి రమ్మని సౌలు ప్రజలందరికీ పిలుపు ఇచ్చాడు. 9 సౌలు తనమీద కుట్ర పన్నుతున్నాడని దావీదుకు తెలిసినప్పుడు అతను యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును ఇక్కడికి తీసుకురా” అని చెప్పాడు.+ 10 తర్వాత దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవా, యెహోవా, నా కారణంగా సౌలు కెయీలా నగరానికి వచ్చి దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడని+ నీ సేవకుడినైన నేను విన్నాను. 11 కెయీలా నాయకులు* నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ సేవకుడు విన్నట్టు సౌలు ఇక్కడికి వస్తాడా? ఇశ్రాయేలు దేవా, యెహోవా, దయచేసి నీ సేవకునికి తెలియజేయి.” దానికి యెహోవా, “అతను వస్తాడు” అని జవాబిచ్చాడు. 12 అప్పుడు దావీదు, “కెయీలా నాయకులు నన్నూ, నా మనుషుల్నీ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. దానికి యెహోవా, “వాళ్లు నిన్ను అప్పగిస్తారు” అని చెప్పాడు.

13 వెంటనే దావీదు తన దగ్గరున్న దాదాపు 600 మందితో+ లేచి, కెయీలా నుండి ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్లాడు. దావీదు కెయీలా నుండి తప్పించుకున్నాడని సౌలుకు వార్త అందినప్పుడు, అతను దావీదు కోసం అక్కడికి వెళ్లలేదు. 14 దావీదు ఎడారిలో చేరుకోవడానికి కష్టమైన స్థలాల్లో, జీఫు+ ఎడారిలోని పర్వత ప్రాంతంలో నివసించాడు. సౌలు అతని కోసం వెదుకుతూనే ఉన్నాడు+ కానీ యెహోవా దావీదును అతని చేతికి అప్పగించలేదు. 15 సౌలు తన ప్రాణాన్ని తీయడానికి బయల్దేరాడన్న సంగతి, హోరేషు దగ్గర జీఫు ఎడారిలో ఉన్నప్పుడు దావీదుకు తెలిసింది.*

16 అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరికి వెళ్లి, యెహోవా మీద నమ్మకం పెంచుకోవడానికి దావీదుకు సహాయం చేశాడు.+ 17 అతను దావీదుతో, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు; నువ్వు ఇశ్రాయేలు మీద రాజవుతావు,+ నేను నీ తర్వాతి స్థానంలో ఉంటాను; ఈ సంగతి నా తండ్రి సౌలుకు కూడా తెలుసు”+ అని అన్నాడు. 18 తర్వాత వాళ్లిద్దరూ యెహోవా ఎదుట ఒప్పందం చేసుకున్నారు.+ దావీదు హోరేషులో ఉండిపోయాడు, యోనాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు.

19 తర్వాత జీఫు మనుషులు గిబియాలో+ ఉన్న సౌలు దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “దావీదు మాకు దగ్గర్లోనే ఉన్నాడు, అతను హోరేషులో+ చేరుకోవడానికి కష్టమైన స్థలాల్లో, యెషీమోనుకు* దక్షిణాన+ హకీలా కొండమీద+ ఉన్నాడు.+ 20 రాజా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. మేము అతన్ని నీ చేతికి అప్పగిస్తాం.”+ 21 దానికి సౌలు ఇలా అన్నాడు: “మీరు నా మీద కనికరం చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని దీవించాలి. 22 దయచేసి మీరు వెళ్లి, అతను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో, అతను అక్కడ ఉండడం ఎవరు చూశారో కనుక్కోవడానికి ప్రయత్నించండి. అతను చాలా యుక్తిగలవాడని నేను విన్నాను. 23 అతను దాక్కునే స్థలాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో జాగ్రత్తగా కనుక్కొని రుజువులతో నా దగ్గరికి రండి. అప్పుడు నేను మీతో వస్తాను; అతను గనుక దేశంలో ఉంటే, యూదాలోని వేలమందిలో* కూడా నేను అతన్ని వెదికి పట్టుకుంటాను.”

24 దాంతో వాళ్లు బయల్దేరి సౌలు కన్నా ముందు జీఫుకు+ వెళ్లారు. ఆ సమయంలో దావీదు, అతని మనుషులు యెషీమోనుకు దక్షిణాన అరాబాలోని+ మాయోను+ ఎడారిలో ఉన్నారు. 25 తర్వాత సౌలు అతన్ని వెదకడానికి తన మనుషులతో వచ్చాడు.+ ఆ విషయం దావీదు విన్నప్పుడు, అతను మాయోను ఎడారిలో ఉన్న బండ+ దగ్గరికి వెళ్లి అక్కడ నివసించాడు. అది విన్న సౌలు దావీదును తరుముతూ మాయోను ఎడారిలోకి వచ్చాడు. 26 సౌలు పర్వతానికి ఒకవైపుకు వచ్చినప్పుడు దావీదు, అతని మనుషులు పర్వతానికి ఇంకోవైపున ఉన్నారు. అప్పుడు దావీదు సౌలు నుండి తప్పించుకోవడానికి త్వరత్వరగా వెళ్తున్నాడు;+ కానీ సౌలు, అతని మనుషులు దావీదును, అతని మనుషుల్ని పట్టుకోవడానికి అంతకంతకూ దగ్గరగా వస్తూ ఉన్నారు.+ 27 అయితే, ఒక సందేశకుడు సౌలు దగ్గరికి వచ్చి, “త్వరగా రా, ఫిలిష్తీయులు దేశం మీద దాడి చేశారు!” అని అన్నాడు. 28 అప్పుడు సౌలు దావీదును తరమడం ఆపి+ ఫిలిష్తీయుల్ని ఎదుర్కోవడానికి వెళ్లాడు. అందుకే ఆ స్థలానికి వేరుపర్చే బండ అని పేరు పెట్టారు.

29 తర్వాత దావీదు అక్కడి నుండి వెళ్లి ఏన్గెదీ+ దగ్గర, చేరుకోవడానికి కష్టమైన స్థలాల్లో నివసించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి