కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

న్యాయాధిపతులు విషయసూచిక

      • న్యాయాధిపతి యెఫ్తా వెళ్లగొట్టబడ్డాడు, తర్వాత నాయకుడయ్యాడు (1-11)

      • యెఫ్తా అమ్మోనీయులతో తర్కించడం (12-28)

      • యెఫ్తా మొక్కుబడి, అతని కూతురు (29-40)

        • యెఫ్తా కూతురి అవివాహిత జీవితం (38-40)

న్యాయాధిపతులు 11:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 12:7; 1స 12:11; హెబ్రీ 11:32

న్యాయాధిపతులు 11:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2021, పేజీ 8

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 6

న్యాయాధిపతులు 11:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 8

న్యాయాధిపతులు 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:17

న్యాయాధిపతులు 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 11:2

న్యాయాధిపతులు 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:18

న్యాయాధిపతులు 11:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 9

న్యాయాధిపతులు 11:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “వినే వ్యక్తిగా.”

న్యాయాధిపతులు 11:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:17; 11:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీలు 6-7

న్యాయాధిపతులు 11:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:36, 38

న్యాయాధిపతులు 11:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:26
  • +ద్వితీ 3:16, 17
  • +సం 21:23, 24

న్యాయాధిపతులు 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:36, 37; ద్వితీ 2:9
  • +ద్వితీ 2:19, 37

న్యాయాధిపతులు 11:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:25
  • +సం 20:1

న్యాయాధిపతులు 11:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:1; సం 20:14; ద్వితీ 2:4
  • +ఆది 19:36, 37
  • +సం 20:22

న్యాయాధిపతులు 11:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:4
  • +సం 21:11
  • +సం 21:13

న్యాయాధిపతులు 11:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:21-26; ద్వితీ 2:26, 27

న్యాయాధిపతులు 11:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:32, 33

న్యాయాధిపతులు 11:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:15, 21

న్యాయాధిపతులు 11:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:36

న్యాయాధిపతులు 11:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:22

న్యాయాధిపతులు 11:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:7
  • +నిర్గ 23:28; 34:11; సం 33:53; ద్వితీ 9:5; 18:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 9

న్యాయాధిపతులు 11:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:2, 3; యెహో 24:9

న్యాయాధిపతులు 11:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:25
  • +సం 21:26

న్యాయాధిపతులు 11:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 33:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 9

న్యాయాధిపతులు 11:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 3:9, 10; జెక 4:6
  • +న్యా 10:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 9

న్యాయాధిపతులు 11:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:21

న్యాయాధిపతులు 11:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 1:11
  • +1స 1:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 4-5

    నా బైబిలు పుస్తకం, పేజీలు 88-89

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీలు 7-8

    కావలికోట,

    2/15/2008, పేజీలు 7-8

    8/15/2007, పేజీ 19

    5/15/2007, పేజీలు 9-10

    1/15/2005, పేజీ 26

న్యాయాధిపతులు 11:34

అధస్సూచీలు

  • *

    అంటే, గిలకల తప్పెట.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:17; 11:11

న్యాయాధిపతులు 11:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 30:2; కీర్త 15:4; ప్రస 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 4-5

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 8

న్యాయాధిపతులు 11:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 11:30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీలు 8-9

    కావలికోట,

    5/15/2007, పేజీ 10

న్యాయాధిపతులు 11:37

అధస్సూచీలు

  • *

    లేదా “నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను కాబట్టి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 4-5

న్యాయాధిపతులు 11:39

అధస్సూచీలు

  • *

    లేదా “నియమం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 1:22, 24

న్యాయాధిపతులు 11:40

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 10

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

న్యాయా. 11:1న్యా 12:7; 1స 12:11; హెబ్రీ 11:32
న్యాయా. 11:4న్యా 10:17
న్యాయా. 11:7న్యా 11:2
న్యాయా. 11:8న్యా 10:18
న్యాయా. 11:11న్యా 10:17; 11:34
న్యాయా. 11:12ఆది 19:36, 38
న్యాయా. 11:13సం 21:26
న్యాయా. 11:13ద్వితీ 3:16, 17
న్యాయా. 11:13సం 21:23, 24
న్యాయా. 11:15ఆది 19:36, 37; ద్వితీ 2:9
న్యాయా. 11:15ద్వితీ 2:19, 37
న్యాయా. 11:16సం 14:25
న్యాయా. 11:16సం 20:1
న్యాయా. 11:17ఆది 36:1; సం 20:14; ద్వితీ 2:4
న్యాయా. 11:17ఆది 19:36, 37
న్యాయా. 11:17సం 20:22
న్యాయా. 11:18సం 21:4
న్యాయా. 11:18సం 21:11
న్యాయా. 11:18సం 21:13
న్యాయా. 11:19సం 21:21-26; ద్వితీ 2:26, 27
న్యాయా. 11:20ద్వితీ 2:32, 33
న్యాయా. 11:21యెహో 13:15, 21
న్యాయా. 11:22ద్వితీ 2:36
న్యాయా. 11:23నెహె 9:22
న్యాయా. 11:241రా 11:7
న్యాయా. 11:24నిర్గ 23:28; 34:11; సం 33:53; ద్వితీ 9:5; 18:12
న్యాయా. 11:25సం 22:2, 3; యెహో 24:9
న్యాయా. 11:26సం 21:25
న్యాయా. 11:26సం 21:26
న్యాయా. 11:27యెష 33:22
న్యాయా. 11:29న్యా 3:9, 10; జెక 4:6
న్యాయా. 11:29న్యా 10:17
న్యాయా. 11:30ద్వితీ 23:21
న్యాయా. 11:311స 1:11
న్యాయా. 11:311స 1:24
న్యాయా. 11:34న్యా 10:17; 11:11
న్యాయా. 11:35సం 30:2; కీర్త 15:4; ప్రస 5:4
న్యాయా. 11:36న్యా 11:30, 31
న్యాయా. 11:391స 1:22, 24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
న్యాయాధిపతులు 11:1-40

న్యాయాధిపతులు

11 గిలాదుకు చెందిన యెఫ్తా+ ఒక బలమైన యోధుడు; అతను ఒక వేశ్య కుమారుడు, అతని తండ్రి పేరు గిలాదు. 2 గిలాదు భార్య కూడా అతనికి కుమారుల్ని కన్నది. అయితే, వాళ్లు పెద్దవాళ్లు అయ్యాక యెఫ్తాను వెళ్లగొట్టారు; వాళ్లు అతనితో, “నువ్వు వేరే స్త్రీ కుమారుడివి కాబట్టి మన తండ్రి ఆస్తిలో నీకు ఏమాత్రం భాగం రాదు” అన్నారు. 3 కాబట్టి యెఫ్తా తన సహోదరుల దగ్గర నుండి పారిపోయి టోబు దేశంలో స్థిరపడ్డాడు. అక్కడ, పనీపాటాలేని కొంతమంది యెఫ్తా దగ్గరికి వచ్చి, అతని వెంట ఉన్నారు.

4 కొంతకాలం తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.+ 5 అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను వెనక్కి తీసుకురావడానికి వెంటనే వెళ్లారు. 6 వాళ్లు యెఫ్తాతో, “వచ్చి మా సైన్యాధికారిగా ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలుగుతాం” అన్నారు. 7 కానీ యెఫ్తా గిలాదు పెద్దలతో, “మీరే కదా నన్ను ఎంతో ద్వేషించి నా తండ్రి ఇంటి నుండి నన్ను వెళ్లగొట్టారు?+ ఇప్పుడు మీకు కష్టాలు వచ్చేసరికి నా దగ్గరికి వచ్చారా?” అన్నాడు. 8 అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాతో, “అందుకే మేము నీ దగ్గరికి తిరిగొచ్చాం. నువ్వు మాతోపాటు వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే, మా గిలాదు ప్రజలందరికీ నువ్వు నాయకుడివి అవుతావు” అన్నారు.+ 9 దానికి యెఫ్తా గిలాదు పెద్దలతో, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను వెనక్కి తీసుకెళ్లినప్పుడు, ఒకవేళ యెహోవా నా కోసం వాళ్లను ఓడిస్తే, నేను తప్పకుండా మీ నాయకుడిని అవుతాను!” అన్నాడు. 10 అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మన మధ్య సాక్షిగా* ఉండాలి, నువ్వు చెప్పినట్టు మేము చేయకపోతే ఆయన మాకు తీర్పు తీర్చాలి” అని యెఫ్తాతో అన్నారు. 11 అప్పుడు యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు; ప్రజలు అతన్ని తమ నాయకుడిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. యెఫ్తా అంతకుముందు తాను చెప్పిన మాటలన్నిటినీ మిస్పాలో+ యెహోవా ఎదుట మళ్లీ చెప్పాడు.

12 తర్వాత, యెఫ్తా సందేశకుల ద్వారా అమ్మోనీయుల+ రాజుకు ఈ సందేశం పంపించాడు: “నీకూ నాకూ మధ్య ఏ శత్రుత్వం ఉందని నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి వచ్చావు?” 13 దానికి అమ్మోనీయుల రాజు, “ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అర్నోను నుండి+ యబ్బోకు దాకా, యొర్దాను వరకు+ ఉన్న నా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.+ దాన్ని ఇప్పుడు శాంతియుతంగా తిరిగి ఇచ్చేయండి” అని యెఫ్తా పంపించిన సందేశకులతో అన్నాడు. 14 అయితే యెఫ్తా సందేశకుల్ని మళ్లీ అమ్మోనీయుల రాజు దగ్గరికి పంపించి, 15 ఇలా చెప్పమన్నాడు:

“యెఫ్తా చెప్పేది ఏమిటంటే: ‘ఇశ్రాయేలీయులు మోయాబీయుల ప్రాంతాన్ని+ గానీ, అమ్మోనీయుల ప్రాంతాన్ని గానీ ఆక్రమించుకోలేదు,+ 16 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఎడారి గుండా ఎర్రసముద్రం వరకు+ నడిచి కాదేషుకు+ చేరుకున్నారు. 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము+ రాజు దగ్గరికి సందేశకుల్ని పంపించి, “దయచేసి మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు” అని అడిగారు, కానీ దానికి ఎదోము రాజు ఒప్పుకోలేదు. వాళ్లు మోయాబు+ రాజుకు కూడా సందేశం పంపించారు, అతను కూడా ఒప్పుకోలేదు. దాంతో ఇశ్రాయేలీయులు కాదేషులోనే నివసించారు.+ 18 ఎడారి గుండా నడుస్తున్నప్పుడు వాళ్లు ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి ప్రయాణించారు.+ వాళ్లు మోయాబు దేశానికి తూర్పు వైపున+ ప్రయాణించి, అర్నోను ప్రాంతంలో డేరాలు వేసుకున్నారు; కానీ వాళ్లు మోయాబు సరిహద్దు+ లోపలికి రాలేదు, ఎందుకంటే అర్నోను మోయాబు సరిహద్దు.

19 “ ‘ఆ తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనును పరిపాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి సందేశకుల్ని పంపించి, “దయచేసి మమ్మల్ని నీ దేశం గుండా మా సొంత ప్రాంతానికి వెళ్లనివ్వు” అని అడిగారు.+ 20 కానీ సీహోను ఇశ్రాయేలీయుల్ని నమ్మలేదు కాబట్టి వాళ్లను తన ప్రాంతం గుండా వెళ్లనివ్వలేదు; అతను తన ప్రజలందర్నీ సమకూర్చి, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి యాహజులో మకాం వేశాడు.+ 21 అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని ప్రజలందర్నీ ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు; దాంతో ఇశ్రాయేలీయులు ఆ ప్రజల్ని ఓడించి, ఆ దేశ నివాసులైన అమోరీయుల ప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు.+ 22 అలా వాళ్లు, అర్నోను నుండి యబ్బోకు దాకా, ఎడారి నుండి యొర్దాను వరకు ఉన్న అమోరీయుల ప్రాంతమంతా స్వాధీనం చేసుకున్నారు.+

23 “ ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి అమోరీయుల్ని వెళ్లగొట్టాడు,+ ఇప్పుడు మీరు ఆ ఇశ్రాయేలీయుల్ని వెళ్లగొడతారా? 24 మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన కెమోషు+ మీకిచ్చే ఏ ప్రాంతాన్నైనా మీరు స్వాధీనం చేసుకోరా? అదేవిధంగా, మేము కూడా మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి వెళ్లగొడుతున్న ప్రతీ ఒక్కరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం.+ 25 నువ్వు సిప్పోరు కుమారుడూ మోయాబు రాజూ అయిన బాలాకు+ కన్నా గొప్పవాడివా? అతను ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా తలపడ్డాడా? వాళ్లతో ఎప్పుడైనా యుద్ధం చేశాడా? 26 గత 300 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు హెష్బోనులో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో;+ అరోయేరులో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; అర్నోను తీరాల్లో ఉన్న నగరాలన్నిట్లో నివసిస్తున్నారు. అప్పుడు నువ్వు వాటిని వెనక్కి తీసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు ఎందుకని?+ 27 నీకు వ్యతిరేకంగా నేను ఏ పాపం చేయకపోయినా నువ్వు నా మీద దాడి చేయడం తప్పు. న్యాయమూర్తి అయిన యెహోవా+ ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు మధ్య న్యాయం తీర్చాలి.’ ”

28 కానీ యెఫ్తా తనకు పంపిన సందేశాన్ని అమ్మోనీయుల రాజు లెక్కచేయలేదు.

29 యెహోవా పవిత్రశక్తి యెఫ్తా మీదికి వచ్చింది;+ అతను గిలాదు, మనష్షే గుండా ప్రయాణించి గిలాదుకు చెందిన మిస్పేకు+ వచ్చాడు. అక్కడి నుండి అతను అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

30 అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కుబడి చేసుకున్నాడు:+ “నువ్వు అమ్మోనీయుల్ని నా చేతికి అప్పగిస్తే, 31 నేను వాళ్లతో యుద్ధం చేసి క్షేమంగా తిరిగొచ్చినప్పుడు, నన్ను కలుసుకోవడానికి ఎవరైతే నా ఇంటి గుమ్మంలో నుండి బయటికి వస్తారో ఆ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠితం,+ నేను ఆ వ్యక్తిని దహనబలిగా అర్పిస్తాను.”+

32 యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాడు; యెహోవా వాళ్లను అతని చేతికి అప్పగించాడు. 33 అతను అరోయేరు నుండి మిన్నీతు వరకు అలాగే ఆబేల్‌-కెరామీము వరకు 20 నగరాల వాళ్లను ఘోరంగా హతం చేశాడు. అలా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు ఓడిపోయారు.

34 చివరికి యెఫ్తా మిస్పాలోని+ తన ఇంటికి వచ్చాడు, అప్పుడు ఇదిగో! అతని కూతురు కంజీరను* వాయిస్తూ, నాట్యం చేస్తూ అతన్ని కలుసుకోవడానికి వస్తోంది! అతనికి ఆమె ఒక్కతే సంతానం, ఆమె తప్ప అతనికి కుమారులు గానీ కూతుళ్లు గానీ లేరు. 35 యెఫ్తా ఆమెను చూసినప్పుడు బట్టలు చింపుకుని, “అయ్యో, నా కుమారీ! నువ్వు నా గుండెను బద్దలు చేశావు, ఎందుకంటే నేను పంపించేస్తుంది నిన్నే. నేను యెహోవాకు మాటిచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను”+ అన్నాడు.

36 కానీ ఆమె అతనితో, “తండ్రీ, నువ్వు యెహోవాకు మాటిచ్చివుంటే, నువ్వు మాటిచ్చినట్టే నాకు చేయి;+ ఎందుకంటే యెహోవా నీ కోసం నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడు” అంది. 37 తర్వాత ఆమె తన తండ్రితో ఇలా అంది: “అయితే ఒక్క మనవి, నన్ను రెండు నెలలపాటు ఒంటరిగా ఉండనివ్వు; నన్ను కొండలకు వెళ్లనివ్వు, నా కన్యాత్వం గురించి* నా స్నేహితురాళ్లతో కలిసి ఏడ్వనివ్వు.”

38 అందుకు యెఫ్తా, “వెళ్లు” అన్నాడు. అతను ఆమెను రెండు నెలలపాటు పంపించాడు; ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి తన కన్యాత్వం గురించి ఏడ్వడానికి కొండలకు వెళ్లింది. 39 రెండు నెలలు అయ్యాక, ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగొచ్చింది. తర్వాత యెఫ్తా తన కూతురి విషయంలో ఇచ్చిన మాటను నెరవేర్చాడు.+ ఆమె ఎన్నడూ పురుషునితో సంబంధం పెట్టుకోలేదు. ఆ తర్వాత ఇశ్రాయేలులో ఒక ఆచారం* మొదలైంది, అదేంటంటే: 40 ఇశ్రాయేలులోని యువతులు గిలాదుకు చెందిన యెఫ్తా కూతుర్ని మెచ్చుకోవడానికి ప్రతీ సంవత్సరం నాలుగు రోజులు వెళ్లేవాళ్లు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి