కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • ఏడో రోజున దేవుడు విశ్రాంతి ​తీసుకోవడం (1-3)

      • యెహోవా దేవుడు భూమ్యాకాశాల సృష్టికర్త (4)

      • ఏదెను తోటలో పురుషుడు, స్త్రీ (5-25)

        • మట్టితో మనిషిని చేయడం (7)

        • తెలివినిచ్చే చెట్టును నిషేధించడం (15-17)

        • స్త్రీని సృష్టించడం (18-25)

ఆదికాండం 2:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “వాటి సైన్యమంతటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:6; కీర్త 146:6

ఆదికాండం 2:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:17; హెబ్రీ 4:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 56

    కావలికోట,

    10/15/2012, పేజీ 22

    10/1/2001, పేజీ 30

    7/15/1998, పేజీలు 14-16

ఆదికాండం 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2023, పేజీలు 5-6

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 88

    కావలికోట,

    10/15/2012, పేజీ 22

    7/15/2011, పేజీలు 24-25

    10/1/2001, పేజీ 30

    3/1/1990, పేజీ 25

ఆదికాండం 2:4

అధస్సూచీలు

  • *

    ఇక్కడ, దేవుని సొంత పేరైన יהוה (YHWH) మొట్టమొదటిసారి కనిపిస్తుంది. ఈ పేరు ఆయన్ని వేరే దేవుళ్లందరి నుండి ప్రత్యేకపరుస్తుంది. అనుబంధం A4 చూడండి.

  • *

    ఇది ఆరు సృష్టి రోజుల కాలమంతటినీ సూచిస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 2

ఆదికాండం 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1998, పేజీ 9

ఆదికాండం 2:7

అధస్సూచీలు

  • *

    లేదా “ఊపిరిని; శ్వాసను.”

  • *

    లేదా “జీవించే ప్రాణి.” హీబ్రూలో నెఫెష్‌. దీనికి అక్షరార్థంగా, “ఊపిరి తీసుకునే ప్రాణి” అని అర్థం. పదకోశంలో “ప్రాణం” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:19; కీర్త 103:14; ప్రస 3:20
  • +ఆది 7:22; యెష 42:5; అపొ 17:25
  • +1కొ 15:45, 47

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 71

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2017 పేజీ 5

    4/1/1999, పేజీలు 14-15

    10/1/1997, పేజీ 19

    9/1/1994, పేజీ 8

    3/1/1990, పేజీ 16

    జ్ఞానము, పేజీ 81

ఆదికాండం 2:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:15; 3:23
  • +ఆది 1:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2018, పేజీ 3

    కావలికోట,

    4/1/1990, పేజీ 10

    3/1/1990, పేజీలు 14-15

ఆదికాండం 2:9

అధస్సూచీలు

  • *

    లేదా “జ్ఞానాన్నిచ్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:22, 24; ప్రక 2:7
  • +ఆది 2:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1828

    కావలికోట బ్రోషురు,

    4/15/1999, పేజీలు 7-8

    3/1/1990, పేజీలు 16-17

    తేజరిల్లు!,

    11/8/1998, పేజీ 7

ఆదికాండం 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

ఆదికాండం 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీ 16

ఆదికాండం 2:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీ 16

ఆదికాండం 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీ 16

ఆదికాండం 2:14

అధస్సూచీలు

  • *

    లేదా “టైగ్రిస్‌.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:4
  • +ఆది 10:8, 11
  • +ఆది 15:18; ద్వితీ 11:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీ 16

ఆదికాండం 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:28; 2:8; కీర్త 115:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2023, పేజీ 16

    కావలికోట,

    3/1/1990, పేజీలు 14-19

ఆదికాండం 2:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:8, 9; 3:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 160

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 42-43

    సంతృప్తికరమైన జీవితం, పేజీ 22

    జ్ఞానము, పేజీలు 56-57

    కావలికోట,

    3/1/1990, పేజీలు 16-17

ఆదికాండం 2:17

అధస్సూచీలు

  • *

    లేదా “జ్ఞానాన్నిచ్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:19; కీర్త 146:4; ప్రస 9:5, 10; యెహె 18:4; రోమా 5:12; 1కొ 15:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 160

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2019 పేజీ 8

    కావలికోట (అధ్యయన),

    4/2018, పేజీ 5

    కావలికోట,

    9/15/2014, పేజీలు 24-25

    1/1/2003, పేజీ 4

    1/15/2001, పేజీలు 4-5

    3/1/1990, పేజీలు 16-17, 26, 28-29

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 42-43, 61-62

    సంతృప్తికరమైన జీవితం, పేజీ 22

    జ్ఞానము, పేజీలు 56-58

ఆదికాండం 2:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 11:8, 9; 1తి 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీ 23

    తేజరిల్లు!,

    4/8/2005, పేజీలు 10-11

    5/15/2011, పేజీ 8

    11/15/2000, పేజీలు 24-25

    7/15/1995, పేజీలు 10-11

    6/1/1990, పేజీ 12

    4/1/1990, పేజీలు 21-22

    కుటుంబ సంతోషం, పేజీ 34

ఆదికాండం 2:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2023, పేజీ 16

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 29

    కావలికోట,

    3/1/1990, పేజీలు 19-20

ఆదికాండం 2:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీలు 19-22

ఆదికాండం 2:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

ఆదికాండం 2:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 10:9; 1తి 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    1/1/2004, పేజీ 30

ఆదికాండం 2:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 11:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2004, పేజీ 30

    3/1/1990, పేజీలు 22-23

    4/1/1990, పేజీ 22

ఆదికాండం 2:24

అధస్సూచీలు

  • *

    లేదా “భార్యతోనే ఉండిపోతాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 2:16; మత్త 19:5; మార్కు 10:7, 8; రోమా 7:2; 1కొ 6:16; ఎఫె 5:31; హెబ్రీ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్స్‌ 16, 58, 130

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 42

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 4

    కావలికోట (అధ్యయన),

    6/2017, పేజీ 5

    కావలికోట (అధ్యయన),

    8/2016, పేజీలు 8-9

    కావలికోట,

    10/1/2011, పేజీ 31

    1/15/2011, పేజీలు 14-16

    1/1/2004, పేజీ 30

    11/15/2000, పేజీ 25

    4/1/1990, పేజీ 22

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 23-24

ఆదికాండం 2:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 2:1నెహె 9:6; కీర్త 146:6
ఆది. 2:2నిర్గ 31:17; హెబ్రీ 4:4
ఆది. 2:4యెష 45:18
ఆది. 2:7ఆది 3:19; కీర్త 103:14; ప్రస 3:20
ఆది. 2:7ఆది 7:22; యెష 42:5; అపొ 17:25
ఆది. 2:71కొ 15:45, 47
ఆది. 2:8ఆది 2:15; 3:23
ఆది. 2:8ఆది 1:26
ఆది. 2:9ఆది 3:22, 24; ప్రక 2:7
ఆది. 2:9ఆది 2:17
ఆది. 2:14దాని 10:4
ఆది. 2:14ఆది 10:8, 11
ఆది. 2:14ఆది 15:18; ద్వితీ 11:24
ఆది. 2:15ఆది 1:28; 2:8; కీర్త 115:16
ఆది. 2:16ఆది 2:8, 9; 3:2
ఆది. 2:17ఆది 3:19; కీర్త 146:4; ప్రస 9:5, 10; యెహె 18:4; రోమా 5:12; 1కొ 15:22
ఆది. 2:181కొ 11:8, 9; 1తి 2:13
ఆది. 2:19ఆది 1:26
ఆది. 2:22మార్కు 10:9; 1తి 2:13
ఆది. 2:231కొ 11:8
ఆది. 2:24మలా 2:16; మత్త 19:5; మార్కు 10:7, 8; రోమా 7:2; 1కొ 6:16; ఎఫె 5:31; హెబ్రీ 13:4
ఆది. 2:25ఆది 3:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 2:1-25

ఆదికాండం

2 అలా ఆకాశాన్ని, భూమిని, వాటిలోని సమస్తాన్ని* చేయడం పూర్తయింది.+ 2 ఏడో రోజుకల్లా, దేవుడు అప్పటివరకు తాను చేస్తూ వచ్చిన పనిని పూర్తిచేశాడు; తాను అప్పటివరకు చేస్తూ వచ్చిన పని నుండి ఆయన ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ 3 దేవుడు ఏడో రోజును దీవించి, దాన్ని పవిత్రమైనదిగా ప్రకటించాడు; ఎందుకంటే, అప్పటివరకు తన ఉద్దేశం ప్రకారం చేసిన సృష్టి పనులన్నిటి నుండి దేవుడు ఆ రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.

4 భూమ్యాకాశాలు సృష్టించబడినప్పుడు, యెహోవా* దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన+ రోజున* వాటి చరిత్ర ఇది.

5 అప్పటికి భూమ్మీద ఏ పొదలూ లేవు, మొక్కలు మొలవడం ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే యెహోవా దేవుడు అప్పటికింకా భూమ్మీద వర్షాన్ని కురిపించలేదు, నేలను సాగుచేయడానికి ఏ మనిషీ లేడు. 6 అయితే భూమ్మీది నుండి ఆవిరి పైకి లేచి, నేల అంతటినీ తడిపేది.

7 యెహోవా దేవుడు నేల మట్టితో మనిషిని చేసి,+ అతని ముక్కు రంధ్రాల్లో జీవ వాయువును* ఊదాడు;+ అప్పుడు మనిషి జీవించే వ్యక్తి* అయ్యాడు.+ 8 అంతేకాదు, యెహోవా దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట+ వేసి, తాను తయారుచేసిన మనిషిని+ అక్కడ ఉంచాడు. 9 అలా, చూడడానికి చక్కగా, తినడానికి మంచిగా ఉండే ప్రతీ చెట్టును యెహోవా దేవుడు మొలిపించాడు; అంతేకాదు ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని,+ అలాగే మంచిచెడుల తెలివినిచ్చే* చెట్టును+ మొలిపించాడు.

10 ఆ తోటను తడపడానికి ఏదెనులో నుండి ఒక నది ప్రవహించేది. అది అక్కడి నుండి నాలుగు నదులుగా చీలిపోయింది. 11 మొదటి నది పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టూ ప్రవహించేది, అక్కడ బంగారం ఉంది. 12 ఆ దేశపు బంగారం మంచిది. అక్కడ బోళం, సులిమాని రాళ్లు కూడా ఉన్నాయి. 13 రెండో నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టూ ప్రవహించేది. 14 మూడో నది పేరు హిద్దెకెలు;*+ అది అష్షూరుకు+ తూర్పు వైపున ప్రవహించేది; నాలుగో నది యూఫ్రటీసు.+

15 యెహోవా దేవుడు మనిషిని తీసుకుని ఏదెను తోటను సేద్యం చేయడానికి, దాన్ని చూసుకోవడానికి అతన్ని అందులో పెట్టాడు.+ 16 అంతేకాదు యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ తోటలోని ప్రతీ చెట్టు పండ్లను నువ్వు తృప్తిగా తినొచ్చు.+ 17 కానీ, మంచిచెడుల తెలివినిచ్చే* చెట్టు పండ్లను మాత్రం నువ్వు తినకూడదు; ఎందుకంటే దాని పండ్లను తిన్న రోజున నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.”+

18 తర్వాత యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “మనిషి ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు. నేను అతనికి సాటియైన సహాయకారిని చేస్తాను.”+ 19 అంతకుముందు, యెహోవా దేవుడు నేల నుండి ప్రతీ అడవి జంతువును, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణిని చేసి, వాటిలో ప్రతీదాన్ని మనిషి ఏమని పిలుస్తాడో చూడడానికి వాటిని అతని దగ్గరికి తేవడం మొదలుపెట్టాడు; ప్రతీ ప్రాణిని మనిషి ఏమని పిలిచాడో, అదే దాని పేరు అయింది.+ 20 అలా మనిషి సాధు జంతువులన్నిటికీ, ఆకాశంలో ఎగిరే ప్రాణులకు, ప్రతీ అడవి జంతువుకు పేరు పెట్టాడు. అయితే మనిషికి మాత్రం సాటియైన సహాయకారి ఎవరూ లేరు. 21 కాబట్టి యెహోవా దేవుడు మనిషికి గాఢనిద్ర కలిగించి, అతను నిద్రపోతున్నప్పుడు, అతని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి, ఆ చోటును మాంసంతో పూడ్చేశాడు. 22 యెహోవా దేవుడు ఆ పురుషుని నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా చేసి, ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు.+

23 అప్పుడు పురుషుడు ఇలా అన్నాడు:

“ఇది నిజంగా నా ఎముకల్లో ఎముక,

నా మాంసంలో మాంసం.

ఇది నరుని నుండి తీయబడింది కాబట్టి,

నారి అని పిలవబడుతుంది.”+

24 అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు,* వాళ్లు ఒక్క శరీరం అవుతారు.+ 25 ఆ పురుషుడు, అతని భార్య ఇద్దరూ నగ్నంగానే ఉన్నారు;+ అయినా వాళ్లకు సిగ్గు అనిపించలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి