మీకా
6 దయచేసి యెహోవా చెప్పేది వినండి,
లేచి, మీ వ్యాజ్యాన్ని పర్వతాల ముందుకు తీసుకురండి,
కొండలకు మీ స్వరం వినబడనివ్వండి.+
2 పర్వతాల్లారా, భూమి స్థిరమైన పునాదుల్లారా,
యెహోవా వ్యాజ్యాన్ని వినండి,+
యెహోవాకు తన ప్రజల మీద ఒక వ్యాజ్యం ఉంది;
ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఆయన చేసే వాదన+ వినండి:
3 “నా ప్రజలారా, నేను మీకేం చేశాను?
మిమ్మల్ని ఎలా విసిగించాను?+
నామీద సాక్ష్యం చెప్పండి.
4 నేను మిమ్మల్ని ఐగుప్తు* దేశం నుండి బయటికి తీసుకొచ్చాను,+
దాస్య గృహం నుండి విడిపించాను;+
మోషేను, అహరోనును, మిర్యామును+ మీ ముందు పంపించాను.
5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు ఏమి కుట్ర పన్నాడో,+
బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఏమని జవాబిచ్చాడో,+
షిత్తీము నుండి గిల్గాలు+ వరకు ఏమి జరిగిందో+ దయచేసి గుర్తుతెచ్చుకోండి.
అప్పుడు మీరు యెహోవా నీతికార్యాల్ని తెలుసుకుంటారు.”
6 ఏమి తీసుకొని నేను యెహోవా ముందుకు రాను?
ఏమి తీసుకొచ్చి, ఉన్నత స్థానంలో ఉన్న దేవుని ముందు వంగి నమస్కారం చేయను?
సంపూర్ణ దహనబలులు, ఏడాది దూడలు తీసుకొని
ఆయన ముందుకు రానా?+
7 వేలాది పొట్టేళ్లు, విస్తారమైన నూనె
యెహోవాను సంతోషపెడతాయా?+
నా తిరుగుబాటు కోసం నా మొదటి కుమారుణ్ణి,
నా పాపాల కోసం నా కడుపున పుట్టినవాణ్ణి అర్పించనా?+
8 ఓ మనిషీ, ఏది మంచిదో ఆయన నీకు తెలియజేశాడు.
బదులుగా యెహోవా నిన్నేమి అడుగుతున్నాడు?
శిక్షాదండం మీద, దాన్ని నియమించిన వ్యక్తి మీద మనసుపెట్టండి.+
12 దానిలోని ధనవంతులు దౌర్జన్యంలో మునిగిపోయారు,
దాని నివాసులు అబద్ధాలాడతారు;+
వాళ్ల నోరు, నాలుక మోసకరమైనవి.+
13 “అందుకే, నేను నిన్ను కొట్టి గాయపరుస్తాను,+
నీ పాపాల్ని బట్టి నిన్ను నిర్మానుష్యం చేస్తాను.
14 నువ్వు తింటావు, కానీ తృప్తి పొందవు;
లోపల నీకు ఆకలిగానే ఉంటుంది.+
నువ్వు వస్తువుల్ని తీస్తావు, కానీ వాటిని భద్రంగా తీసుకెళ్లలేవు,
నువ్వు తీసుకెళ్లినా, నేను వాటిని కత్తికి అప్పగిస్తాను.
15 నువ్వు విత్తనాలు విత్తుతావు, కానీ పంట కోయవు.
ఒలీవ పండ్లు తొక్కుతావు, కానీ వాటి నూనె ఉపయోగించవు;
కొత్త ద్రాక్షారసం తయారుచేస్తావు, కానీ దాన్ని తాగవు.+
16 ఎందుకంటే మీరు ఒమ్రీ శాసనాల్ని, అహాబు ఇంటివాళ్ల ఆచారాలన్నిటినీ పాటిస్తున్నారు,+
వాళ్ల సలహాల ప్రకారం నడుస్తున్నారు.