కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • సౌలు దావీదును ద్వేషిస్తూనే ఉండడం (1-13)

      • దావీదు సౌలు దగ్గర నుండి పారిపోవడం (14-24)

1 సమూయేలు 19:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:9; సామె 27:4

1 సమూయేలు 19:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:1; సామె 18:24

1 సమూయేలు 19:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:9, 13; సామె 17:17

1 సమూయేలు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:14

1 సమూయేలు 19:5

అధస్సూచీలు

  • *

    లేదా “రక్షణను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:49
  • +1స 20:32

1 సమూయేలు 19:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:21; 18:2, 13

1 సమూయేలు 19:9

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:14
  • +1స 18:10, 11

1 సమూయేలు 19:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 59:పైవిలాసం; 59:3

1 సమూయేలు 19:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2004, పేజీ 29

1 సమూయేలు 19:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:9

1 సమూయేలు 19:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:29

1 సమూయేలు 19:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:15, 17
  • +1స 20:1

1 సమూయేలు 19:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:18

1 సమూయేలు 19:24

అధస్సూచీలు

  • *

    లేదా “చాలీచాలని బట్టలతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 19:11స 18:9; సామె 27:4
1 సమూ. 19:21స 18:1; సామె 18:24
1 సమూ. 19:31స 20:9, 13; సామె 17:17
1 సమూ. 19:41స 22:14
1 సమూ. 19:51స 17:49
1 సమూ. 19:51స 20:32
1 సమూ. 19:71స 16:21; 18:2, 13
1 సమూ. 19:91స 16:14
1 సమూ. 19:91స 18:10, 11
1 సమూ. 19:11కీర్త 59:పైవిలాసం; 59:3
1 సమూ. 19:151స 18:9
1 సమూ. 19:171స 18:29
1 సమూ. 19:181స 7:15, 17
1 సమూ. 19:181స 20:1
1 సమూ. 19:221స 19:18
1 సమూ. 19:241స 10:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 19:1-24

సమూయేలు మొదటి గ్రంథం

19 ఆ తర్వాత సౌలు, తాను దావీదును చంపాలనుకుంటున్నానని తన కుమారుడు యోనాతానుకూ, తన సేవకులందరికీ చెప్పాడు.+ 2 అయితే సౌలు కుమారుడైన యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం+ కాబట్టి, యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “నా తండ్రి సౌలు నిన్ను చంపాలనుకుంటున్నాడు. రేపు ఉదయం జాగ్రత్తగా ఉండు, ఏదైనా రహస్య స్థలానికి వెళ్లి అక్కడ దాక్కో. 3 నువ్వు ఉండే పొలంలోకి నేను వచ్చి నా తండ్రి పక్కనే నిలబడతాను. నీ గురించి నా తండ్రితో మాట్లాడతాను, నాకేమైనా తెలిస్తే నీకు ఖచ్చితంగా చెప్తాను.”+

4 కాబట్టి యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడాడు.+ అతను సౌలుతో ఇలా అన్నాడు: “రాజు తన సేవకుడైన దావీదు విషయంలో పాపం చేయకూడదు, ఎందుకంటే అతను నీ విషయంలో పాపం చేయలేదు. అదీగాక అతను నీ కోసం చేసిన పనులవల్ల నీకు మేలు జరిగింది. 5 అతను తన ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుణ్ణి చంపాడు,+ అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప విజయాన్ని* ఇచ్చాడు. అది చూసి నువ్వు ఎంతో సంతోషించావు. కాబట్టి కారణం లేకుండా దావీదును చంపి అమాయకుని రక్తం విషయంలో ఎందుకు పాపం చేస్తావు?”+ 6 సౌలు యోనాతాను మాట విన్నాడు; “యెహోవా జీవం తోడు, నేను అతన్ని చంపను” అని సౌలు ప్రమాణం చేశాడు. 7 తర్వాత యోనాతాను దావీదును పిలిచి అతనికి ఈ విషయాలన్నీ చెప్పాడు. యోనాతాను దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. దావీదు ముందులాగే సౌలు సేవలో కొనసాగాడు.+

8 కొంతకాలానికి మళ్లీ యుద్ధం జరిగింది. అప్పుడు దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వాళ్లను ఘోరంగా హతం చేశాడు. వాళ్లు అతని ఎదుట నుండి పారిపోయారు.

9 ఒకరోజు సౌలు ఈటె పట్టుకొని తన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రతికూల ఆలోచనలు* రానిచ్చాడు.+ ఆ సమయంలో దావీదు వీణ* వాయిస్తున్నాడు.+ 10 సౌలు ఈటెతో దావీదును గోడకు బిగించడానికి ప్రయత్నించాడు, కానీ దావీదు తప్పించుకున్నాడు. సౌలు విసిరిన ఈటె గోడలోకి దిగబడింది. దావీదు అక్కడి నుండి పారిపోయి, ఆ రాత్రి తప్పించుకున్నాడు. 11 ఆ తర్వాత సౌలు, దావీదు ఇంటిని గమనిస్తూ ఉండడానికి, ఉదయాన్నే అతన్ని చంపడానికి మనుషుల్ని పంపించాడు.+ కానీ దావీదు భార్య మీకాలు అతనితో, “ఈ రాత్రి నువ్వు తప్పించుకోకపోతే, రేపటికల్లా చనిపోతావు” అంది. 12 వెంటనే మీకాలు దావీదును కిటికీలో నుండి కిందికి దింపింది. అలా అతను పారిపోయి తప్పించుకున్నాడు. 13 మీకాలు ఒక గృహదేవత విగ్రహాన్ని తీసుకొని మంచం మీద పెట్టింది, దావీదు తల ఉండే చోట మేక వెంట్రుకలతో అల్లిన గుడ్డను పెట్టి, దాన్ని బట్టతో కప్పింది.

14 అప్పుడు సౌలు దావీదును పట్టుకోవడానికి మనుషుల్ని పంపించాడు. కానీ ఆమె వాళ్లతో, “అతనికి ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పింది. 15 దాంతో సౌలు దావీదును చూడడానికి మళ్లీ మనుషుల్ని పంపిస్తూ, “అతన్ని చంపేలా మంచంతోపాటు అతన్ని తీసుకురండి” అని వాళ్లకు చెప్పాడు.+ 16 వాళ్లు లోపలికి వచ్చినప్పుడు, మంచం మీద గృహదేవత విగ్రహం, దావీదు తల ఉండే చోట మేక వెంట్రుకలతో అల్లిన గుడ్డ వాళ్లకు కనిపించాయి. 17 అప్పుడు సౌలు మీకాలుతో, “నువ్వు ఎందుకిలా నన్ను మోసం చేశావు? నా శత్రువు+ తప్పించుకునేలా అతన్ని ఎందుకు పంపించావు?” అన్నాడు. దానికి మీకాలు ఇలా చెప్పింది: “అతను నాతో, ‘నన్ను పంపించేయి, లేకపోతే నిన్ను చంపుతాను!’ అని అన్నాడు.”

18 అలా దావీదు తప్పించుకొని పారిపోయి, రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి+ వెళ్లాడు. సౌలు తనకు చేసినదంతా అతను సమూయేలుకు చెప్పాడు. తర్వాత అతనూ సమూయేలూ అక్కడి నుండి వెళ్లిపోయి నాయోతులో ఉండిపోయారు.+ 19 కొంతకాలానికి, “ఇదిగో! దావీదు రామాలోని నాయోతులో ఉన్నాడు!” అని సౌలుకు వార్త అందింది. 20 వెంటనే సౌలు దావీదును పట్టుకోవడానికి మనుషుల్ని పంపించాడు. వృద్ధ ప్రవక్తలు ప్రవచించడం, సమూయేలు నిలబడి వాళ్లకు నాయకత్వం వహించడం సౌలు మనుషులు చూసినప్పుడు, దేవుని పవిత్రశక్తి వాళ్ల మీదికి వచ్చింది. దాంతో వాళ్లు కూడా ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

21 వాళ్లు ఆ విషయం సౌలుకు చెప్పినప్పుడు, అతను వెంటనే వేరే మనుషుల్ని పంపించాడు, వాళ్లు కూడా ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో సౌలు మళ్లీ మూడో గుంపును పంపించాడు. వాళ్లు కూడా ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 22 చివరికి, సౌలు కూడా రామాకు వెళ్లాడు. అతను సేఖూలో ఉన్న పెద్ద బావి దగ్గరికి వచ్చినప్పుడు, “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. “రామాలోని నాయోతులో+ ఉన్నారు” అని అతనికి చెప్పారు. 23 సౌలు అక్కడి నుండి రామాలోని నాయోతుకు వెళ్తున్నప్పుడు, దేవుని పవిత్రశక్తి అతని మీదికి కూడా వచ్చింది. దాంతో అతను రామాలోని నాయోతుకు వచ్చేవరకు దారిపొడవునా ప్రవక్తలా ప్రవర్తిస్తూ నడిచాడు. 24 సౌలు కూడా తన బట్టలు తీసేసి, సమూయేలు ముందు ప్రవక్తలా ప్రవర్తించాడు. అతను ఆ రోజు పగలంతా, రాత్రంతా బట్టలు లేకుండా* పడివున్నాడు. అందుకే, “సౌలు కూడా ఒక ప్రవక్తా?”+ అని వాళ్లు అంటారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి