కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • దావీదు సౌలును చంపకపోవడం (1-22)

        • యెహోవా అభిషిక్తుని పట్ల దావీదు గౌరవం చూపించడం (6)

1 సమూయేలు 24:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:28, 29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1990, పేజీలు 10-11

1 సమూయేలు 24:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    వాళ్లలా విశ్వాసం చూపించండి, ఆర్టికల్‌ 3

1 సమూయేలు 24:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “పాదాల్ని కప్పుకోవడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 57:పైవిలాసం; 142:పైవిలాసం

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1990, పేజీ 10

1 సమూయేలు 24:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:8, 23

1 సమూయేలు 24:5

అధస్సూచీలు

  • *

    లేదా “హృదయం నొచ్చుకుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 24:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 18

    కావలికోట,

    10/15/2007, పేజీలు 21-22

1 సమూయేలు 24:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:28; 1స 26:11; 2స 1:14; 1ది 16:22

1 సమూయేలు 24:7

అధస్సూచీలు

  • *

    లేదా “పంపించేశాడు” అయ్యుంటుంది.

1 సమూయేలు 24:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:17

1 సమూయేలు 24:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:19

1 సమూయేలు 24:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:4
  • +1స 9:16; 10:1; 26:9; కీర్త 105:15

1 సమూయేలు 24:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:18; కీర్త 35:7
  • +1స 23:14

1 సమూయేలు 24:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:23
  • +ద్వితీ 32:35
  • +1స 26:11

1 సమూయేలు 24:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:20

1 సమూయేలు 24:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:39; కీర్త 35:1

1 సమూయేలు 24:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:17

1 సమూయేలు 24:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:21

1 సమూయేలు 24:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:4, 10

1 సమూయేలు 24:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:25; కీర్త 18:20

1 సమూయేలు 24:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 13:14; 15:28; 18:8; 20:31; 23:17

1 సమూయేలు 24:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:1; 21:7
  • +లేవీ 19:12; ద్వితీ 6:13

1 సమూయేలు 24:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:34
  • +1స 23:29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 24:11స 23:28, 29
1 సమూ. 24:3కీర్త 57:పైవిలాసం; 142:పైవిలాసం
1 సమూ. 24:41స 26:8, 23
1 సమూ. 24:52స 24:10
1 సమూ. 24:6నిర్గ 22:28; 1స 26:11; 2స 1:14; 1ది 16:22
1 సమూ. 24:81స 26:17
1 సమూ. 24:91స 26:19
1 సమూ. 24:101స 24:4
1 సమూ. 24:101స 9:16; 10:1; 26:9; కీర్త 105:15
1 సమూ. 24:111స 26:18; కీర్త 35:7
1 సమూ. 24:111స 23:14
1 సమూ. 24:121స 26:23
1 సమూ. 24:12ద్వితీ 32:35
1 సమూ. 24:121స 26:11
1 సమూ. 24:141స 26:20
1 సమూ. 24:151స 25:39; కీర్త 35:1
1 సమూ. 24:161స 26:17
1 సమూ. 24:171స 26:21
1 సమూ. 24:181స 24:4, 10
1 సమూ. 24:191స 26:25; కీర్త 18:20
1 సమూ. 24:201స 13:14; 15:28; 18:8; 20:31; 23:17
1 సమూ. 24:212స 9:1; 21:7
1 సమూ. 24:21లేవీ 19:12; ద్వితీ 6:13
1 సమూ. 24:221స 15:34
1 సమూ. 24:221స 23:29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 24:1-22

సమూయేలు మొదటి గ్రంథం

24 సౌలు ఫిలిష్తీయుల్ని తరిమి వెనక్కి వచ్చిన వెంటనే, “ఇదిగో! దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉన్నాడు”+ అని అతనికి చెప్పారు.

2 దాంతో సౌలు ఇశ్రాయేలు అంతటి నుండి 3,000 మందిని ఎంచుకొని దావీదును, అతని మనుషుల్ని పట్టుకోవడానికి కొండమేకలు ఉండే నిటారైన కొండలకు వెళ్లాడు. 3 సౌలు దారిలో ఉన్న రాతి గొర్రెల దొడ్ల దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక గుహ ఉంది. అతను కాలకృత్యాలు తీర్చుకోవడానికి* అందులోకి వెళ్లాడు. ఆ సమయంలో దావీదు, అతని మనుషులు గుహ వెనక+ కూర్చొని సేదదీరుతున్నారు. 4 దావీదు మనుషులు అతనితో, “ఇదిగో! యెహోవా నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు,+ నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయడానికి ఆయన నిన్ను అనుమతిస్తున్నాడు” అన్నారు. దాంతో దావీదు లేచి సౌలు వేసుకున్న చేతుల్లేని నిలువుటంగీ అంచును మెల్లగా కోశాడు. 5 అయితే, సౌలు అంగీ అంచును కోసినందుకు అతని మనస్సాక్షి అతన్ని గద్దించసాగింది.*+ 6 అప్పుడు అతను తన మనుషులతో ఇలా అన్నాడు: “యెహోవా దృష్టి నుండి చూస్తే, యెహోవా అభిషేకించిన నా ప్రభువు మీద చెయ్యి ఎత్తి అతనికి ఇలా చేయడం నా ఊహకందని విషయం. ఎందుకంటే, అతను యెహోవా అభిషేకించిన వ్యక్తి.”+ 7 ఈ మాటలు చెప్పి దావీదు తన మనుషుల్ని సౌలు మీద దాడి చేయకుండా ఆపాడు.* సౌలు గుహలో నుండి బయటికి వచ్చి తన దారిన వెళ్లిపోయాడు.

8 తర్వాత దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి, సౌలు వెనక నుండి, “నా ప్రభూ, రాజా!” అని బిగ్గరగా పిలిచాడు.+ సౌలు వెనక్కి తిరిగి చూసినప్పుడు, దావీదు మోకాళ్లూని, సాష్టాంగపడ్డాడు. 9 దావీదు సౌలుతో ఇలా అన్నాడు: “ ‘ఇదిగో! దావీదు నీకు హాని చేయాలని చూస్తున్నాడు’ అని చెప్పే మనుషుల మాటల్ని నువ్వు ఎందుకు వింటున్నావు?+ 10 గుహలో యెహోవా నిన్ను నాకు ఎలా అప్పగించాడో ఈ రోజు నువ్వు కళ్లారా చూశావు. నిన్ను చంపమని నాకు ఒకరు చెప్పినప్పుడు,+ నేను నీ మీద జాలిపడి, ‘నా ప్రభువు యెహోవా అభిషేకించిన వ్యక్తి+ కాబట్టి నేను అతని మీద చెయ్యి ఎత్తను’ అన్నాను. 11 ఇదిగో, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ అంగీ అంచును చూడు; నేను నీ అంగీ అంచును కోసినప్పుడు, నేను నిన్ను చంపగలిగేవాణ్ణే కానీ నేనలా చేయలేదు. నీకు హాని చేయాలనే ఉద్దేశం గానీ, నీ మీద తిరుగుబాటు చేయాలనే ఉద్దేశం గానీ నాకు లేదని, నేను నీ విషయంలో పాపం చేయలేదని+ నువ్వు ఇప్పుడు చూసి అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వేమో నా ప్రాణం తీయాలని నన్ను వెంటాడుతున్నావు.+ 12 యెహోవా నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చాలి.+ యెహోవా నా కోసం నీమీద పగతీర్చుకోవాలి.+ కానీ నా చెయ్యి మాత్రం నీ మీదికి లేవదు.+ 13 ఒక ప్రాచీన సామెత చెప్తున్నట్టు, ‘దుష్టుని నుండే దుష్టత్వం వస్తుంది.’ కానీ నా చెయ్యి మాత్రం నీ మీదికి లేవదు. 14 ఇశ్రాయేలు రాజు ఎవర్ని పట్టుకోవడానికి బయల్దేరాడు? ఎవర్ని తరుముతున్నాడు? చచ్చిన కుక్కను కాదా? మిన్నల్లిని కాదా?+ 15 యెహోవా న్యాయమూర్తిగా ఉండాలి, ఆయన నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చాలి. ఆయన విషయాన్ని పరిశీలించి నా తరఫున వాదిస్తాడు,+ నాకు న్యాయం తీర్చి నీ చేతి నుండి నన్ను రక్షిస్తాడు.”

16 దావీదు మాట్లాడడం పూర్తవ్వగానే సౌలు, “నా కుమారుడా దావీదూ, ఇది నీ స్వరమేనా?”+ అని అడిగి, పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టాడు. 17 అతను దావీదుతో ఇలా అన్నాడు: “నువ్వు నాకన్నా ఎక్కువ నీతిమంతుడివి, ఎందుకంటే నువ్వు నాతో మంచిగా ప్రవర్తించావు, కానీ నేను నీకు కీడు చేశాను.+ 18 అవును, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినా నువ్వు నన్ను చంపకుండా నాతో మంచిగా ప్రవర్తించావని ఈ రోజు చూపించావు.+ 19 శత్రువు దొరికినప్పుడు ఎవరైనా హాని చేయకుండా అతని దారిన అతన్ని పంపిస్తారా? నువ్వు ఈ రోజు నాకు చేసినదాన్నిబట్టి యెహోవా నీకు మంచిని ప్రతిఫలంగా ఇస్తాడు.+ 20 ఇదిగో! నువ్వు ఖచ్చితంగా రాజుగా పరిపాలిస్తావనీ,+ నీ చేతిలో ఇశ్రాయేలు రాజ్యం ఎప్పటికీ ఉంటుందనీ నాకు తెలుసు. 21 ఇప్పుడు నువ్వు, నా తర్వాత నా సంతానాన్ని తుడిచివేయవనీ, నా తండ్రి ఇంటి నుండి నా పేరును కొట్టివేయవనీ+ యెహోవా పేరున నాకు ప్రమాణం చేయి.”+ 22 కాబట్టి దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. తర్వాత సౌలు ఇంటికి వెళ్లాడు.+ అయితే దావీదు, అతని మనుషులు వాళ్లు దాక్కున్న స్థలానికి వెళ్లారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి