కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • దావీదు మళ్లీ సౌలును చంపకుండా వదిలేయడం (1-25)

        • యెహోవా అభిషిక్తుని పట్ల దావీదు గౌరవం చూపించడం (11)

1 సమూయేలు 26:1

అధస్సూచీలు

  • *

    లేదా “ఎడారి; ఎండిన ప్రదేశం” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 55
  • +న్యా 19:14; 1స 10:26
  • +1స 23:14, 19, 24; కీర్త 54:పైవిలాసం

1 సమూయేలు 26:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:2

1 సమూయేలు 26:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:50; 17:55; 2స 2:8; 3:27

1 సమూయేలు 26:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:15
  • +2స 2:18; 1ది 2:15, 16
  • +2స 16:9; 18:5; 23:18

1 సమూయేలు 26:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:4; 26:23

1 సమూయేలు 26:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:1
  • +1స 24:6; 2స 1:14; 1ది 16:22; కీర్త 20:6

1 సమూయేలు 26:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:35; 1స 24:12; 25:38; కీర్త 94:1, 23
  • +కీర్త 37:12, 13
  • +1స 31:3, 6

1 సమూయేలు 26:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:18; 1స 24:6; 1ది 16:22; కీర్త 105:15

1 సమూయేలు 26:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:4

1 సమూయేలు 26:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:50; 17:55; 2స 2:8; 3:8

1 సమూయేలు 26:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:8

1 సమూయేలు 26:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:16, 17; 10:1
  • +1స 26:11

1 సమూయేలు 26:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:8, 16

1 సమూయేలు 26:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 35:7
  • +1స 24:9, 11

1 సమూయేలు 26:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “స్వాస్థ్యం,” ఇది ప్రజల్ని అలాగే వాళ్లు పొందిన భూమిని సూచించవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:9
  • +నిర్గ 19:5; ద్వితీ 26:18

1 సమూయేలు 26:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:14

1 సమూయేలు 26:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:17
  • +1స 24:10; 26:11

1 సమూయేలు 26:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 7:8; 18:20
  • +1స 24:6; 26:9

1 సమూయేలు 26:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:19

1 సమూయేలు 26:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:19
  • +1స 24:22; 27:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 26:1యెహో 15:20, 55
1 సమూ. 26:1న్యా 19:14; 1స 10:26
1 సమూ. 26:11స 23:14, 19, 24; కీర్త 54:పైవిలాసం
1 సమూ. 26:21స 24:2
1 సమూ. 26:51స 14:50; 17:55; 2స 2:8; 3:27
1 సమూ. 26:6ఆది 10:15
1 సమూ. 26:62స 2:18; 1ది 2:15, 16
1 సమూ. 26:62స 16:9; 18:5; 23:18
1 సమూ. 26:81స 24:4; 26:23
1 సమూ. 26:91స 10:1
1 సమూ. 26:91స 24:6; 2స 1:14; 1ది 16:22; కీర్త 20:6
1 సమూ. 26:10ద్వితీ 32:35; 1స 24:12; 25:38; కీర్త 94:1, 23
1 సమూ. 26:10కీర్త 37:12, 13
1 సమూ. 26:101స 31:3, 6
1 సమూ. 26:11లేవీ 19:18; 1స 24:6; 1ది 16:22; కీర్త 105:15
1 సమూ. 26:121స 24:4
1 సమూ. 26:141స 14:50; 17:55; 2స 2:8; 3:8
1 సమూ. 26:151స 26:8
1 సమూ. 26:161స 9:16, 17; 10:1
1 సమూ. 26:161స 26:11
1 సమూ. 26:171స 24:8, 16
1 సమూ. 26:18కీర్త 35:7
1 సమూ. 26:181స 24:9, 11
1 సమూ. 26:191స 24:9
1 సమూ. 26:19నిర్గ 19:5; ద్వితీ 26:18
1 సమూ. 26:201స 24:14
1 సమూ. 26:211స 24:17
1 సమూ. 26:211స 24:10; 26:11
1 సమూ. 26:23కీర్త 7:8; 18:20
1 సమూ. 26:231స 24:6; 26:9
1 సమూ. 26:24కీర్త 34:19
1 సమూ. 26:251స 24:19
1 సమూ. 26:251స 24:22; 27:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 26:1-25

సమూయేలు మొదటి గ్రంథం

26 కొంతకాలానికి జీఫు+ మనుషులు గిబియాలో+ ఉన్న సౌలు దగ్గరికి వచ్చి, “దావీదు యెషీమోనుకు* ఎదురుగా ఉన్న హకీలా కొండమీద దాక్కున్నాడు” అని చెప్పారు.+ 2 దాంతో సౌలు లేచి ఇశ్రాయేలులో నుండి ఎంపికచేయబడిన 3,000 మందిని తీసుకొని దావీదును వెదకడం కోసం జీఫు ఎడారిలోకి వెళ్లాడు.+ 3 సౌలు యెషీమోనుకు ఎదురుగా ఉన్న హకీలా కొండమీద దారి పక్కన మకాం వేశాడు. దావీదు అప్పుడు ఎడారిలో నివసిస్తున్నాడు. తనను వెదకడానికి సౌలు ఎడారిలోకి వచ్చాడని దావీదుకు తెలిసింది. 4 కాబట్టి సౌలు నిజంగా వచ్చాడో లేదో తెలుసుకోవడానికి దావీదు గూఢచారుల్ని పంపించాడు. 5 తర్వాత దావీదు సౌలు ఉన్న స్థలానికి వెళ్లాడు. సౌలు, అలాగే అతని సైన్యాధిపతీ నేరు కుమారుడూ అయిన అబ్నేరు+ పడుకొనివున్న స్థలాన్ని దావీదు చూశాడు; శిబిరంలో సౌలు పడుకొని ఉన్నాడు. అతని చుట్టూ సైనికులు ఉన్నారు. 6 అప్పుడు దావీదు హిత్తీయుడైన+ అహీమెలెకును, సెరూయా కుమారుడూ+ యోవాబు సహోదరుడూ అయిన అబీషైను,+ “శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతోపాటు ఎవరు వస్తారు?” అని అడిగాడు. దానికి అబీషై, “నేను నీతో వస్తాను” అన్నాడు. 7 దాంతో దావీదు, అబీషై రాత్రిపూట సైనికులు ఉన్న చోటికి వెళ్లారు. అక్కడ శిబిరంలో సౌలు నిద్రపోతుండడం, అతని తల పక్కన అతని ఈటె నేలలో గుచ్చివుండడం వాళ్లు చూశారు; అబ్నేరు, సైనికులు అతని చుట్టూ పడుకొని ఉన్నారు.

8 అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు.+ ఇప్పుడు దయచేసి ఒకే ఒక్కసారి అతన్ని ఈటెతో భూమిలోకి గుచ్చేందుకు నన్ను అనుమతించు. నేను రెండోసారి పొడవాల్సిన అవసరం ఉండదు” అని అన్నాడు. 9 అయితే దావీదు అబీషైతో, “అతనికి హాని చేయొద్దు, యెహోవా అభిషేకించిన వ్యక్తి+ మీద చెయ్యి ఎత్తి ఎవరు నిర్దోషులుగా ఉండగలరు?”+ అన్నాడు. 10 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, యెహోవాయే స్వయంగా అతన్ని చంపుతాడు,+ లేదా ఏదోకరోజు అందరిలా అతనూ చనిపోతాడు,+ లేదా యుద్ధానికి వెళ్లి అక్కడ నాశనమౌతాడు.+ 11 కానీ యెహోవా దృష్టి నుండి చూస్తే, యెహోవా అభిషేకించిన వ్యక్తి మీద నా చెయ్యి ఎత్తడం నా ఊహకందని విషయం!+ అతని తల పక్కన ఉన్న ఈటెను, నీళ్ల కూజాను దయచేసి తీసుకురా, మనం వెళ్లిపోదాం.” 12 అలా దావీదు సౌలు తల పక్కనున్న ఈటెను, నీళ్ల కూజాను తీసుకున్నాడు, వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్లను ఎవ్వరూ చూడలేదు,+ గమనించలేదు, ఎవ్వరూ లేవలేదు. వాళ్లందరూ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే యెహోవా వాళ్లకు గాఢనిద్ర కలిగించాడు. 13 తర్వాత దావీదు అవతలి వైపుకు వెళ్లి, కాస్త దూరంలో ఉన్న కొండ శిఖరం మీద నిలబడ్డాడు. వాళ్లకూ వీళ్లకూ మధ్య చాలా దూరం ఉంది.

14 అప్పుడు దావీదు సౌలు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును+ గట్టిగా పిలుస్తూ, “అబ్నేరూ, నువ్వు జవాబివ్వవా?” అన్నాడు. అందుకు అబ్నేరు, “రాజును పిలుస్తుంది ఎవరు?” అన్నాడు. 15 దావీదు అబ్నేరుతో ఇలా అన్నాడు: “నువ్వు యోధుడివి కాదా? ఇశ్రాయేలులో నీలాంటివాళ్లు ఎవరైనా ఉన్నారా? అలాంటిది నువ్వు నీ ప్రభువైన రాజుకు ఎందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి సైనికుల్లో ఒకడు అక్కడికి వచ్చాడు.+ 16 నువ్వు చేసింది మంచిదికాదు. యెహోవా జీవం తోడు, నువ్వు మరణశిక్షకు అర్హుడివి. ఎందుకంటే నువ్వు యెహోవా అభిషేకించిన వ్యక్తి+ అయిన నీ ప్రభువుకు కాపలా కాయలేదు. ఇప్పుడు చుట్టూ చూడు! రాజు తల పక్కన ఉన్న అతని ఈటె, నీళ్ల కూజా ఎక్కడ ఉన్నాయి?”+

17 అప్పుడు సౌలు దావీదు స్వరాన్ని గుర్తుపట్టి, “దావీదూ, నా కుమారుడా, ఇది నీ స్వరమేనా?”+ అని అడిగాడు. దానికి దావీదు, “నా ప్రభువైన రాజా, ఇది నా స్వరమే” అన్నాడు. 18 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “నా ప్రభువు తన సేవకుణ్ణి ఎందుకు తరుముతున్నాడు?+ నేను ఏమి చేశాను? నేను చేసిన తప్పేంటి?+ 19 నా ప్రభువైన రాజా, దయచేసి నీ సేవకుడు చెప్పేది విను, ఒకవేళ యెహోవాయే నిన్ను నా మీదికి రేపి ఉంటే, ఆయన నా ధాన్యార్పణను స్వీకరించాలి. కానీ ఒకవేళ మనుషులు నిన్ను ఉసిగొల్పి ఉంటే,+ వాళ్లు యెహోవా ఎదుట శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే వాళ్లు నాతో, ‘వెళ్లి వేరే దేవుళ్లను పూజించు!’ అంటూ నన్ను ఈ రోజు యెహోవా ప్రజల*+ నుండి దూరంగా వెళ్లగొట్టారు. 20 ఇప్పుడు యెహోవా సన్నిధికి దూరంగా నా రక్తం నేలమీద పడనివ్వొద్దు. కొండల్లో ఒక కౌజుపిట్టను తరుముతున్నట్టు ఇశ్రాయేలు రాజు ఒక మిన్నల్లిని+ వెదకడానికి బయల్దేరాడు.”

21 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను.+ దావీదూ, నా కుమారుడా, వెనక్కి వచ్చేయి, నేను ఇకమీదట నీకు ఏ హానీ చేయను. ఎందుకంటే నువ్వు ఈ రోజు నా ప్రాణాన్ని ఎంతో విలువైనదిగా చూశావు.+ నిజమే, నేను మూర్ఖంగా ప్రవర్తించి, ఘోరమైన తప్పు చేశాను” అన్నాడు. 22 అప్పుడు దావీదు ఇలా అన్నాడు: “ఇదిగో రాజు ఈటె. యువకుల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకెళ్లొచ్చు. 23 ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల నీతినిబట్టి, నమ్మకత్వాన్నిబట్టి యెహోవాయే ప్రతిఫలమిస్తాడు.+ ఎందుకంటే, ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించినా నేను మాత్రం యెహోవా అభిషేకించిన వ్యక్తి మీద నా చెయ్యి ఎత్తడానికి ఇష్టపడలేదు.+ 24 ఇదిగో! ఈ రోజు నీ ప్రాణం నా దృష్టిలో అమూల్యమైనదిగా ఉన్నట్టే, నా ప్రాణం కూడా యెహోవా దృష్టిలో అమూల్యమైనదిగా ఉండాలి; ఆయన నన్ను కష్టాలన్నిట్లో నుండి రక్షించాలి.”+ 25 దానికి సౌలు దావీదుతో, “దావీదూ, నా కుమారుడా, నువ్వు దీవించబడాలి. నువ్వు గొప్ప పనులు చేస్తావు, తప్పకుండా విజయం సాధిస్తావు”+ అన్నాడు. తర్వాత దావీదు తన దారిన వెళ్లిపోయాడు, సౌలు తన చోటికి తిరిగెళ్లిపోయాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి