కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హబక్కూకు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హబక్కూకు విషయసూచిక

      • సహాయం కోసం ప్రవక్త మొర (1-4)

        • ‘యెహోవా, ఎంతకాలం?’ (2)

        • “అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?” (3)

      • దేవుడు కల్దీయుల్ని ఉపయోగించుకుని శిక్షించడం (5-11)

      • ప్రవక్త యెహోవాను వేడుకోవడం (12-17)

        • “నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు” (12)

        • ‘నువ్వు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవాడివి’ (13)

హబక్కూకు 1:1

అధస్సూచీలు

  • *

    బహుశా “భావోద్వేగంతో హత్తుకోవడం” అనే అర్థం ఉండవచ్చు.

హబక్కూకు 1:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఎప్పుడు జోక్యం చేసుకుంటావు?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 13:1
  • +కీర్త 22:1; ప్రక 6:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీలు 14-15

    కావలికోట,

    6/15/2000, పేజీ 19

    2/1/2000, పేజీలు 8-9

    1/15/2000, పేజీ 10

    12/15/1999, పేజీ 21

హబక్కూకు 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీలు 14-15

హబక్కూకు 1:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 12:6; ప్రస 8:11; యెష 1:21; అపొ 7:52, 53

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీలు 8-9

హబక్కూకు 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 29:14; విలా 4:11, 12; అపొ 13:40, 41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీలు 15, 17

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2017, పేజీ 6

    కావలికోట,

    11/15/2007, పేజీ 10

    2/1/2000, పేజీలు 10-11, 13

హబక్కూకు 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:2
  • +యిర్మీ 5:15-17; 6:22, 23; యెహె 23:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీ 15

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    11/2017, పేజీ 6

    కావలికోట,

    11/15/2007, పేజీ 10

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:7

అధస్సూచీలు

  • *

    లేదా “ఘనతను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 39:5-7; దాని 5:18, 19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:6
  • +యిర్మీ 4:13; విలా 4:19; యెహె 17:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:9
  • +యెష 27:8; యెహె 17:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:12
  • +యిర్మీ 32:24; 52:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:11

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్ల శక్తే వాళ్ల దేవుడు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 47:5, 6; యిర్మీ 51:24; జెక 1:15
  • +దాని 5:1, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 11

హబక్కూకు 1:12

అధస్సూచీలు

  • *

    లేదా “మేము చనిపోము” అయ్యుంటుంది.

  • *

    అక్ష., “బండరాయీ.”

  • *

    లేదా “గద్దించడానికే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 90:2; 93:2; ప్రక 1:8
  • +1తి 1:17; ప్రక 15:3
  • +ద్వితీ 32:4
  • +యిర్మీ 30:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీ 15

    కావలికోట,

    2/1/2000, పేజీలు 11-12

హబక్కూకు 1:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 5:4, 5
  • +యిర్మీ 12:1
  • +కీర్త 35:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీ 15

    కావలికోట,

    2/1/2000, పేజీ 12

    8/1/1991, పేజీలు 19-20

హబక్కూకు 1:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2000, పేజీ 12

హబక్కూకు 1:15

అధస్సూచీలు

  • *

    అంటే, శత్రువైన కల్దీయుడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:11

హబక్కూకు 1:16

అధస్సూచీలు

  • *

    లేదా “ధూపం వేస్తాడు.”

హబక్కూకు 1:17

అధస్సూచీలు

  • *

    లేదా “తన కత్తిని దూస్తూ ఉంటాడా?” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:17; నహూ 3:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హబ. 1:2కీర్త 13:1
హబ. 1:2కీర్త 22:1; ప్రక 6:10
హబ. 1:4యోబు 12:6; ప్రస 8:11; యెష 1:21; అపొ 7:52, 53
హబ. 1:5యెష 29:14; విలా 4:11, 12; అపొ 13:40, 41
హబ. 1:6యిర్మీ 46:2
హబ. 1:6యిర్మీ 5:15-17; 6:22, 23; యెహె 23:22, 23
హబ. 1:7యిర్మీ 39:5-7; దాని 5:18, 19
హబ. 1:8యిర్మీ 5:6
హబ. 1:8యిర్మీ 4:13; విలా 4:19; యెహె 17:3
హబ. 1:9యెష 27:8; యెహె 17:10
హబ. 1:9యిర్మీ 25:9
హబ. 1:102రా 24:12
హబ. 1:10యిర్మీ 32:24; 52:7
హబ. 1:11యెష 47:5, 6; యిర్మీ 51:24; జెక 1:15
హబ. 1:11దాని 5:1, 4
హబ. 1:12కీర్త 90:2; 93:2; ప్రక 1:8
హబ. 1:121తి 1:17; ప్రక 15:3
హబ. 1:12ద్వితీ 32:4
హబ. 1:12యిర్మీ 30:11
హబ. 1:13కీర్త 5:4, 5
హబ. 1:13యిర్మీ 12:1
హబ. 1:13కీర్త 35:21, 22
హబ. 1:15యిర్మీ 50:11
హబ. 1:172ది 36:17; నహూ 3:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హబక్కూకు 1:1-17

హబక్కూకు

1 హబక్కూకు* ప్రవక్త ఒక దర్శనంలో పొందిన సందేశం:

 2 యెహోవా, ఎంతకాలం సహాయం కోసం నేను నీకు మొరపెట్టాలి?

ఎప్పుడు నా మొర వింటావు?+

సహాయం కోసం ఎంతకాలం నేను వేడుకోవాలి?

దౌర్జన్యం నుండి నన్ను ఎప్పుడు కాపాడతావు?*+

 3 నన్నెందుకు దుష్టత్వాన్ని చూడనిస్తున్నావు?

అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?

నాశనం, దౌర్జన్యం ఎందుకు నా కళ్లముందు ఉన్నాయి?

గొడవలు, కొట్లాటలు ఎందుకు ఎక్కువౌతున్నాయి?

 4 ధర్మశాస్త్రం బలహీనమైపోయింది,

న్యాయం అనేది ఎప్పుడూ జరగట్లేదు.

దుష్టులు నీతిమంతుల్ని చుట్టుముడుతున్నారు;

అందుకే న్యాయం పక్కదారి పడుతోంది.+

 5 “దేశాల వైపు చూడండి, మనసుపెట్టండి!

నోళ్లు వెళ్లబెట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఉండండి;

మీ రోజుల్లో ఒకటి జరగబోతుంది,

దాని గురించి మీకు చెప్పినా మీరు నమ్మరు.+

 6 ఇదిగో, నేను కల్దీయుల్ని రేపుతున్నాను,+

వాళ్లు క్రూరులు, ఉగ్రులు.

తమవికాని ఇళ్లను ఆక్రమించుకోవడానికి

వాళ్లు విశాలమైన భూభాగాల గుండా సంచరిస్తారు.+

 7 వాళ్లు భయంకరులు, భీకరులు.

వాళ్లు తమ సొంత న్యాయాన్ని, అధికారాన్ని* స్థాపిస్తారు.+

 8 వాళ్ల గుర్రాలు చిరుతపులుల కన్నా వేగంగా పరుగెత్తుతాయి.

అవి రాత్రిపూట తిరిగే తోడేళ్ల కన్నా భయంకరమైనవి.+

వాళ్ల గుర్రాలు దౌడు తీస్తూ ముందుకు సాగుతాయి;

అవి చాలా దూరం నుండి వస్తాయి.

ఎరను పట్టుకోవడానికి గద్ద దూసుకొచ్చినట్టు వాళ్లు అకస్మాత్తుగా దూసుకొస్తారు.+

 9 వాళ్లంతా దౌర్జన్యం చేయడానికే వస్తారు.+

వాళ్లు సూటిగా చూస్తూ బలమైన తూర్పు గాలిలా దూసుకొస్తారు,+

ఇసుక రేణువులంత మందిని చెరపట్టుకుపోతారు.

10 వాళ్లు రాజుల్ని గేలి చేస్తారు.

ఉన్నతాధికారుల్ని అపహాస్యం చేస్తారు.+

ప్రాకారమున్న ప్రతీ చోటును చూసి నవ్వుకుంటారు;+

మట్టిదిబ్బలు వేసి వాటిని ఆక్రమిస్తారు.

11 తర్వాత వాళ్లు వేగంగా వీచే గాలిలా దేశం గుండా సాగిపోతారు.

అయితే వాళ్లు అపరాధులుగా లెక్కించబడతారు.+

ఎందుకంటే, వాళ్లు తమ దేవుడే తమకు శక్తినిచ్చాడని అంటారు.”*+

12 యెహోవా, నువ్వు అనాది కాలం నుండి ఉన్నావు కదా?+

నా దేవా, పవిత్రుడివైన నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు.*+

యెహోవా, తీర్పు అమలుచేయడానికే నువ్వు వాళ్లను నియమించావు;

నా ఆశ్రయదుర్గమా,*+ మమ్మల్ని శిక్షించడానికే* వాళ్లను నియమించావు.+

13 నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి,

నువ్వు దుష్టత్వాన్ని సహించలేవు.+

అలాంటిది, మోసగాళ్లను నువ్వెందుకు సహిస్తున్నావు?+

దుష్టుడు తనకన్నా నీతిమంతుణ్ణి మింగేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నావు?+

14 నువ్వు ఎందుకు మనుషుల్ని సముద్రంలోని చేపల్లా చేశావు?

ఎందుకు నాయకుడు లేని సముద్రప్రాణుల్లా చేశావు?

15 అతను* వాళ్లందర్నీ గాలం వేసి లాగుతాడు,

తన వల వేసి పట్టుకుంటాడు,

చేపలు పట్టే తన వలలో వాళ్లను సమకూర్చి

సంతోషంతో గంతులేస్తాడు.+

16 అందుకే అతను తన వలకు బలులు అర్పిస్తాడు.

చేపలు పట్టే తన వలకు బలులు అర్పిస్తాడు;*

ఎందుకంటే వాటి వల్లే అతనికి పుష్టికరమైన ఆహారం,

శ్రేష్ఠమైన ఆహారం దొరుకుతుంది.

17 అతను ఇలాగే తన వలను నింపుకుంటూ ఖాళీ చేస్తూ ఉంటాడా?*

కనికరం లేకుండా దేశాల్ని వధిస్తూ ఉంటాడా?+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి