సామెతలు
31 ఇవి లెమూయేలు రాజు మాటలు. ఇది వాళ్లమ్మ అతనికి ఉపదేశించిన ముఖ్య సందేశం:+
2 నా కుమారుడా, నేను నీకేం చెప్పాలి?
నా కడుపున పుట్టిన కుమారుడా,
నా మొక్కుబళ్ల ఫలితంగా పుట్టిన కుమారుడా,+ నీకేం చెప్పాలి?
4 లెమూయేలూ, ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు,
అవును, అది రాజులకు తగదు;
“నా మద్యం ఏది?” అని అనడం పాలకులకు తగదు.+
5 ఎందుకంటే వాళ్లు మద్యం తాగితే, చట్టాల్ని మర్చిపోయి,
దీనుల హక్కులకు భంగం కలిగిస్తారు.
7 వాళ్లు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు;
తమ కష్టాన్ని ఇక గుర్తుచేసుకోరు.
8 నోరులేని వాళ్ల తరఫున మాట్లాడు;
నశించిపోతున్న వాళ్లందరి హక్కులు కాపాడు.+
א [ఆలెఫ్]
10 సమర్థురాలైన* భార్య దొరకడం అరుదు.+
ఆమె పగడాల* కన్నా చాలాచాలా విలువైనది.
ב [బేత్]
11 ఆమె భర్త ఆమెను హృదయపూర్వకంగా నమ్ముతాడు,
విలువైనదేదీ అతనికి తక్కువ కాదు.
ג [గీమెల్]
12 ఆమె బ్రతికినన్ని రోజులు
అతనికి మంచే చేస్తుంది తప్ప చెడు చేయదు.
ד [దాలెత్]
13 ఆమె ఉన్నిని, నారను పోగుచేస్తుంది;
తన చేతులతో కష్టపడడమంటే ఆమెకు చాలా ఇష్టం.+
ה [హే]
ו [వావ్]
ז [జాయిన్]
ח [హేత్]
ט [తేత్]
18 తన వ్యాపారం లాభసాటిగా ఉందని ఆమె గమనిస్తుంది;
రాత్రిపూట ఆమె దీపం ఆరిపోదు.
י [యోద్]
כ [కఫ్]
20 తన చెయ్యి చాపి
దీనులకు, పేదవాళ్లకు సహాయం చేస్తుంది.+
ל [లామెద్]
21 మంచు కురుస్తున్నప్పుడు ఆమె తన ఇంటివాళ్ల గురించి ఆందోళనపడదు,
ఎందుకంటే వాళ్లంతా వెచ్చని* దుస్తులు వేసుకొని ఉంటారు.
מ [మేమ్]
22 ఆమె తన దుప్పట్లు తానే తయారుచేసుకుంటుంది.
నారతో, ఊదారంగు ఉన్నితో నేసిన వస్త్రాలు వేసుకుంటుంది.
נ [నూన్]
ס [సామెఖ్]
24 ఆమె నారవస్త్రాలు* తయారుచేసి అమ్ముతుంది,
వర్తకులకు దట్టీలు సరఫరా చేస్తుంది.
ע [అయిన్]
25 ఆమె బలాన్ని, వైభవాన్ని వస్త్రంలా ధరిస్తుంది,
భవిష్యత్తు గురించి ఆమె ఏమాత్రం భయపడదు.
פ [పే]
צ [సాదె]
ק [ఖొఫ్]
ר [రేష్]
ש [షీన్]
ת [తౌ]