కీర్తనలు
శ్రావ్యగీతం. విశ్రాంతి రోజు* కోసం గీతం.
92 యెహోవాకు కృతజ్ఞతలు తెలపడం మంచిది;+
సర్వోన్నతుడా, నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడడం* మంచిది;
2 ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను,
రాత్రుళ్లు నీ నమ్మకత్వాన్ని చాటించడం+ మంచిది;
3 పది తంతుల వాద్యంతో,
4 ఎందుకంటే యెహోవా, నీ కార్యాల్ని బట్టి నేను సంతోషించేలా చేశావు;
నీ చేతి పనుల్ని బట్టి నేను సంతోషంతో కేకలు వేస్తున్నాను.
5 యెహోవా, నీ పనులు ఎంత గొప్పవి!+
నీ ఆలోచనలు ఎంత లోతైనవి!+
6 బుద్ధిలేని వాళ్లెవ్వరూ వాటిని తెలుసుకోలేరు;
మూర్ఖులెవ్వరికీ ఈ విషయం అర్థంకాదు:+
7 శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడానికే
దుష్టులు కలుపు మొక్కల్లా* చిగురిస్తారు,
తప్పుచేసే వాళ్లంతా వర్ధిల్లుతారు.+
8 అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా హెచ్చించబడ్డావు.
9 యెహోవా, నీ శత్రువుల ఓటమిని చూడు,
నీ విరోధులు ఎలా నాశనమౌతారో చూడు;
తప్పుచేసే వాళ్లంతా చెల్లాచెదురౌతారు.+
11 నా శత్రువుల ఓటమిని నేను కళ్లారా చూస్తాను;+
నా మీద దాడిచేసే దుష్టుల పతనం గురించి చెవులారా వింటాను.
13 వాళ్లు యెహోవా మందిరంలో నాటబడ్డారు;
మన దేవుని ప్రాంగణాల్లో వాళ్లు వర్ధిల్లుతారు.+