కీర్తనలు
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయం కోసం నేను చేసే విన్నపం విను;
సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు;
నిజాయితీగా నేను చేసిన ప్రార్థన విను.+
2 నువ్వు నా తరఫున న్యాయమైన తీర్పు ఇవ్వాలి;+
ఏది సరైనదో నీ కళ్లు చూడాలి.
3 నువ్వు నా హృదయాన్ని పరిశీలించావు, రాత్రిపూట నన్ను పరిశోధించావు;+
నువ్వు నన్ను శుద్ధి చేశావు;+
నేను ఎలాంటి పన్నాగాలు పన్నలేదని నీకు తెలుస్తుంది,
నా నోరు తప్పు చేయలేదు.
4 వేరేవాళ్లు ఏమి చేసినా,
నేను మాత్రం నీ మాటల్ని బట్టి దోపిడీదారుల మార్గాలకు దూరంగా ఉంటున్నాను.+
6 దేవా, నేను నీకు మొరపెడుతున్నాను, ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు.+
చెవిపెట్టి* నా మాటలు ఆలకించు.+
7 నీ విశ్వసనీయ ప్రేమను అద్భుతమైన విధంగా చూపించు,+
దేవా, నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ల నుండి పారిపోయి
నీ కుడిచేతిని ఆశ్రయించేవాళ్లను నువ్వు రక్షిస్తావు.
9 నామీద దాడిచేసే దుష్టుల నుండి నన్ను కాపాడు,
నన్ను చుట్టుముట్టి చంపాలని చూసే నా శత్రువుల నుండి నన్ను రక్షించు.+
10 వాళ్ల హృదయాలు మొద్దుబారిపోయాయి;
వాళ్ల నోళ్లు అహంకారంగా మాట్లాడుతున్నాయి;
11 ఇప్పుడు వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు;+
మమ్మల్ని కూలదోసే అవకాశం కోసం చూస్తున్నారు.
12 దుష్టుడు, జంతువును ముక్కలుముక్కలుగా చీల్చేయడానికి ఆత్రంగా ఉన్న సింహంలా,
పొంచివున్న కొదమ సింహంలా ఉన్నాడు.