యెషయా
12 ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఇలా అంటావు:
“యెహోవా, నువ్వు నా మీద కోపగించుకున్నా,
నీ కోపం మెల్లమెల్లగా తగ్గిపోయింది, నువ్వు నన్ను ఓదార్చావు,+
నీకు కృతజ్ఞతలు.
నేను ఆయన మీద నమ్మకముంచి నిర్భయంగా జీవిస్తాను;+
ఎందుకంటే యెహోవా* యెహోవాయే నా శక్తి, నా బలం;
ఆయనే నా రక్షణ అయ్యాడు.”+
3 రక్షణ ఊటల నుండి
నువ్వు సంతోషంగా నీళ్లు చేదుకుంటావు.+
4 ఆ రోజు నువ్వు ఇలా అంటావు:
“యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన పేరున ప్రార్థించండి,
దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి!+
ఆయన పేరు ఎంత ఘనమైనదో ప్రకటించండి.+
5 యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి,*+ ఆయన గొప్పగొప్ప పనులు చేశాడు.+
ఈ విషయాన్ని భూమంతటా చాటండి.