కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు చెందుతుంది (1, 2)

      • పులవని రొట్టెల పండుగ (3-10)

      • మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు అంకితం (11-16)

      • ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం వైపుగా నడిపించబడ్డారు (17-20)

      • మేఘస్తంభం, అగ్నిస్తంభం (21, 22)

నిర్గమకాండం 13:2

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రపర్చు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:13; 18:15; ద్వితీ 15:19; లూకా 2:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 3/2021, పేజీ 1

నిర్గమకాండం 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:42; ద్వితీ 16:3
  • +ద్వితీ 4:34; నెహె 9:10

నిర్గమకాండం 13:4

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:1

నిర్గమకాండం 13:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18; నిర్గ 6:5, 8
  • +నిర్గ 3:17; ద్వితీ 8:7-9
  • +నిర్గ 3:8; 34:11

నిర్గమకాండం 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:15; 34:18

నిర్గమకాండం 13:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “సరిహద్దులన్నిట్లో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:15
  • +ద్వితీ 16:3

నిర్గమకాండం 13:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:26, 27

నిర్గమకాండం 13:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ కళ్ల మధ్య.”

  • *

    లేదా “జ్ఞాపికగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:14; ద్వితీ 11:18

నిర్గమకాండం 13:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:24, 25

నిర్గమకాండం 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18

నిర్గమకాండం 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:29; 34:19, 20; లేవీ 27:26; సం 3:13; లూకా 2:22, 23

నిర్గమకాండం 13:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:15

నిర్గమకాండం 13:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:7, 8

నిర్గమకాండం 13:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 5:2
  • +నిర్గ 12:29; కీర్త 78:51

నిర్గమకాండం 13:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ కళ్ల మధ్య.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:18

నిర్గమకాండం 13:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 8/2020, పేజీ 2

నిర్గమకాండం 13:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:2, 3; సం 33:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీ 26

నిర్గమకాండం 13:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 50:24, 25; యెహో 24:32; హెబ్రీ 11:22

నిర్గమకాండం 13:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:19
  • +సం 9:15; కీర్త 78:14

నిర్గమకాండం 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 105:39; 1కొ 10:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 13:2సం 3:13; 18:15; ద్వితీ 15:19; లూకా 2:22, 23
నిర్గ. 13:3నిర్గ 12:42; ద్వితీ 16:3
నిర్గ. 13:3ద్వితీ 4:34; నెహె 9:10
నిర్గ. 13:4ద్వితీ 16:1
నిర్గ. 13:5ఆది 15:18; నిర్గ 6:5, 8
నిర్గ. 13:5నిర్గ 3:17; ద్వితీ 8:7-9
నిర్గ. 13:5నిర్గ 3:8; 34:11
నిర్గ. 13:6నిర్గ 12:15; 34:18
నిర్గ. 13:7నిర్గ 23:15
నిర్గ. 13:7ద్వితీ 16:3
నిర్గ. 13:8నిర్గ 12:26, 27
నిర్గ. 13:9నిర్గ 12:14; ద్వితీ 11:18
నిర్గ. 13:10నిర్గ 12:24, 25
నిర్గ. 13:11ఆది 15:18
నిర్గ. 13:12నిర్గ 22:29; 34:19, 20; లేవీ 27:26; సం 3:13; లూకా 2:22, 23
నిర్గ. 13:13సం 18:15
నిర్గ. 13:14ద్వితీ 7:7, 8
నిర్గ. 13:15నిర్గ 5:2
నిర్గ. 13:15నిర్గ 12:29; కీర్త 78:51
నిర్గ. 13:16ద్వితీ 11:18
నిర్గ. 13:18నిర్గ 14:2, 3; సం 33:5
నిర్గ. 13:19ఆది 50:24, 25; యెహో 24:32; హెబ్రీ 11:22
నిర్గ. 13:21నిర్గ 14:19
నిర్గ. 13:21సం 9:15; కీర్త 78:14
నిర్గ. 13:22కీర్త 105:39; 1కొ 10:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 13:1-22

నిర్గమకాండం

13 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన ప్రతీ మగ సంతానాన్ని నా కోసం ప్రత్యేకపర్చు.* మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా మొదట పుట్టే ప్రతీ మగ సంతానం నాకు చెందుతుంది.”+

3 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “దాస్య గృహమైన ఐగుప్తు నుండి మీరు బయటికి వచ్చిన ఈ రోజును గుర్తుంచుకోండి.+ ఎందుకంటే యెహోవా తన బలమైన చేతితో మిమ్మల్ని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు.+ కాబట్టి మీరు పులిసింది ఏదీ తినకూడదు. 4 అబీబు* నెలలోని ఈ రోజున మీరు బయటికి వెళ్తున్నారు.+ 5 యెహోవా నీకు ఇస్తానని నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన+ పాలుతేనెలు ప్రవహించే దేశానికి,+ అంటే కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే దేశానికి నిన్ను తీసుకొచ్చినప్పుడు,+ ఈ నెలలో నువ్వు దీన్ని ఆచరించాలి. 6 ఏడురోజుల పాటు నువ్వు పులవని రొట్టెలు తినాలి,+ ఏడో రోజున యెహోవాకు పండుగ ఉంటుంది. 7 ఆ ఏడురోజులూ నువ్వు పులవని రొట్టెలు తినాలి;+ పులిసింది ఏదీ నీ దగ్గర కనిపించకూడదు.+ నీ ప్రాంతమంతట్లో* నీ దగ్గర పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు. 8 ఆ రోజు నువ్వు నీ కుమారునితో, ‘ఐగుప్తు నుండి యెహోవా నన్ను ఎలా బయటికి తీసుకొచ్చాడో గుర్తుచేసుకోవడానికి నేను ఇది చేస్తున్నాను’ అని చెప్పాలి.+ 9 యెహోవా బలమైన చేతితో నిన్ను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి యెహోవా నియమం నీ నోట ఉండేలా ఇది నీ చేతి మీద సూచనగా, నీ నుదుటి మీద* జ్ఞాపకార్థంగా* పనిచేస్తుంది.+ 10 ప్రతీ సంవత్సరం దాని నియమిత సమయంలో నువ్వు ఈ శాసనాన్ని పాటించాలి.+

11 “నీకు ఇస్తానని యెహోవా నీకూ, నీ పూర్వీకులకూ ప్రమాణం చేసిన+ కనానీయుల దేశానికి నిన్ను తీసుకొచ్చినప్పుడు, 12 మొదట పుట్టిన ప్రతీ మగబిడ్డను, అలాగే నువ్వు సంపాదించే పశువుల్లో మొదట పుట్టే ప్రతీ మగపిల్లను యెహోవాకు అంకితం చేయాలి. మగ సంతానం యెహోవాకు చెందుతుంది.+ 13 మొదట పుట్టే ప్రతీ గాడిద పిల్లను నువ్వు ఒక గొర్రెతో విడిపించాలి, ఒకవేళ దాన్ని విడిపించకపోతే దాని మెడను విరగ్గొట్టాలి. అలాగే నీ కుమారుల్లో మొదట పుట్టిన ప్రతీ ఒకర్ని నువ్వు విడిపించాలి.+

14 “తర్వాత ఒకవేళ నీ కుమారుడు, ‘దీని అర్థం ఏంటి?’ అని నిన్ను అడిగితే, నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘యెహోవా తన బలమైన చేతితో దాస్య గృహమైన ఐగుప్తు నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు.+ 15 మనల్ని పంపించడానికి ఫరో మొండిగా నిరాకరించినప్పుడు,+ మనుషుల మొదటి సంతానం దగ్గర నుండి జంతువుల మొదటి సంతానం వరకు ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని యెహోవా చంపేశాడు.+ అందుకే మొదట పుట్టిన ప్రతీ మగ సంతానాన్ని యెహోవాకు అర్పిస్తున్నాను, నా కుమారుల్లో మొదట పుట్టిన ప్రతీ ఒక్కడిని విడిపిస్తున్నాను.’ 16 ఇది నీ చేతి మీద సూచనగా, నీ నుదుటి మీద* బాసికంగా పనిచేయాలి,+ ఎందుకంటే యెహోవా తన బలమైన చేతితో ఐగుప్తు నుండి మనల్ని విడిపించాడు.”

17 ఫరో ఆ ప్రజల్ని పంపించినప్పుడు దేవుడు వాళ్లను ఫిలిష్తీయుల దేశానికి వెళ్లే దారి గుండా తీసుకెళ్లలేదు. నిజానికి అదే దగ్గరి దారి. ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు: “యుద్ధం వచ్చినప్పుడు ఈ ప్రజలు తమ మనసు మార్చుకొని ఐగుప్తుకు తిరిగెళ్లిపోతారు.” 18 కాబట్టి దేవుడు వాళ్లను చుట్టూ తిప్పి ఎర్రసముద్రం పక్కన ఉన్న ఎడారి మార్గం గుండా తీసుకెళ్లాడు.+ అయితే ఇశ్రాయేలీయులు యుద్ధ పంక్తులు తీరి ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. 19 మోషే యోసేపు ఎముకల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. ఎందుకంటే యోసేపు, “దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు, అప్పుడు మీరు మీతోపాటు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి” అని అంటూ ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకున్నాడు.+ 20 వాళ్లు సుక్కోతు నుండి బయల్దేరి ఎడారి అంచున ఉన్న ఏతాములో తమ డేరాలు వేసుకున్నారు.

21 యెహోవా దారిలో వాళ్లను నడిపించడానికి పగలేమో మేఘస్తంభంలో,+ రాత్రేమో వాళ్లకు వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో వాళ్ల ముందు వెళ్తూ ఉన్నాడు. అలా వాళ్లు పగలూ రాత్రీ ప్రయాణించగలిగారు.+ 22 పగలు మేఘస్తంభం గానీ, రాత్రి అగ్నిస్తంభం గానీ ఆ ప్రజల ముందు నుండి తొలగిపోయేది కాదు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి