కీర్తనలు
యాత్ర కీర్తన.
126 చెరలో ఉన్న సీయోను ప్రజల్ని యెహోవా తిరిగి సమకూర్చినప్పుడు,+
మనం కల కంటున్నామని అనుకున్నాం.
2 అప్పుడు మన నోటి నిండా నవ్వులు,
మన నాలుక మీద ఆనంద ధ్వనులు ఉన్నాయి.+
అప్పుడు వేరే దేశాల ప్రజలు,
“యెహోవా వాళ్ల కోసం గొప్ప పనులు చేశాడు” అని చెప్పుకున్నారు.+
3 యెహోవా మన కోసం గొప్ప పనులు చేశాడు,+
మనం చాలా సంతోషంగా ఉన్నాం.
5 ఏడుస్తూ విత్తనాలు చల్లేవాళ్లు
సంతోషంతో కేకలు వేస్తూ పంట కోస్తారు.