సామెతలు
2 నిజాయితీగా నడుచుకునేవాడు యెహోవాకు భయపడుతున్నాడు,
కపట మార్గాల్లో నడిచేవాడు ఆయన్ని నీచంగా చూస్తున్నాడు.
3 మూర్ఖుల నోట అహంకారమనే బెత్తం ఉంది;
అయితే తెలివిగలవాళ్ల పెదాలు వాళ్లను కాపాడతాయి.
4 పశువులు లేకపోతే మేతతొట్టి శుభ్రంగా ఉంటుంది,
అయితే ఎద్దుల బలంవల్ల సమృద్ధిగా పంట పండుతుంది.
6 ఎగతాళి చేసేవాడు తెలివిని వెదుకుతాడు కానీ అది దొరకదు,
అవగాహన ఉన్న వ్యక్తికి జ్ఞానం సులభంగా దొరుకుతుంది.+
10 హృదయంలో ఉన్న బాధ హృదయానికే తెలుస్తుంది,
వేరేవాళ్లెవ్వరూ దాని సంతోషాన్ని పంచుకోలేరు.
13 పైకి నవ్వుతున్నా లోపల బాధ ఉండవచ్చు,
సంతోషం చివరికి దుఃఖంగా మారవచ్చు.
14 హృదయం స్థిరంగా లేనివాడు తన పనుల పర్యవసానాలు అనుభవిస్తాడు,+
కానీ మంచివాడు తన పనుల వల్ల వచ్చిన మంచి ఫలితాలు ఆనందిస్తాడు.+
16 తెలివిగలవాడు జాగ్రత్తగా ఉంటూ, చెడు నుండి పక్కకు తప్పుకుంటాడు,
కానీ మూర్ఖుడు నిర్లక్ష్య స్వభావం* చూపిస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటాడు.
17 త్వరగా కోప్పడేవాడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు,+
ఆలోచనా సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ద్వేషించబడతాడు.
18 అనుభవం లేనివాళ్లు తెలివితక్కువతనాన్నే చూపిస్తారు,
19 చెడ్డవాళ్లు మంచివాళ్ల ఎదుట వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది,
దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగి నమస్కారం చేస్తారు.
22 కుట్రపన్నేవాళ్లు దారి తప్పకుండా ఉంటారా?
అయితే మంచి చేయాలని ప్రయత్నించేవాళ్ల మీద ప్రజలు విశ్వసనీయ ప్రేమ చూపిస్తారు, వాళ్లను నమ్ముతారు.+
24 తెలివిగలవాళ్ల ధనం వాళ్లకు కిరీటం,
తెలివితక్కువవాళ్ల పనులు మరింత తెలివితక్కువతనానికి దారితీస్తాయి.+
25 నిజం చెప్పే సాక్షి ప్రాణాలు కాపాడతాడు,
దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.
27 యెహోవా మీదుండే భయం జీవపు ఊట,
అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది.
29 కోప్పడే విషయంలో నిదానించే వ్యక్తికి గొప్ప వివేచన ఉంది,+
ముక్కోపి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తాడు.+
31 దీనుల్ని మోసగించేవాడు వాళ్ల సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+
పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు ఆయన్ని మహిమపరుస్తున్నాడు.+