కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 రాజులు విషయసూచిక

      • యోషీయా, యూదా రాజు (1, 2)

      • ఆలయాన్ని బాగుచేయడానికి నిర్దేశాలు (3-7)

      • ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం (8-13)

      • విపత్తు గురించి హుల్దా ప్రవచించడం (14-20)

2 రాజులు 22:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 13:2; యిర్మీ 1:2; జెఫ 1:1
  • +2ది 34:1, 2
  • +యెహో 15:20, 39

2 రాజులు 22:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 15:5

2 రాజులు 22:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:8

2 రాజులు 22:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:13
  • +2రా 12:4, 5; 2ది 24:8
  • +2రా 12:9; 2ది 34:9

2 రాజులు 22:5

అధస్సూచీలు

  • *

    లేదా “మందిరానికి ఉన్న పగుళ్లను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:11, 12; 2ది 34:10

2 రాజులు 22:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:11

2 రాజులు 22:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:15; 2ది 34:12

2 రాజులు 22:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:24-26
  • +2రా 22:3
  • +2ది 34:14, 15

2 రాజులు 22:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “బయటికి కుమ్మరించి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:16-18

2 రాజులు 22:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:9

2 రాజులు 22:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:19-21; యోవే 2:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/2000, పేజీ 30

2 రాజులు 22:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:22; యిర్మీ 26:24

2 రాజులు 22:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:24; 29:27; 31:17

2 రాజులు 22:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:20; న్యా 4:4; నెహె 6:14; లూకా 2:36; అపొ 21:8, 9
  • +2ది 34:22-28

2 రాజులు 22:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:8

2 రాజులు 22:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:3; ద్వితీ 32:17; న్యా 2:12; యిర్మీ 2:11
  • +యెష 2:8
  • +ద్వితీ 32:22; యెష 33:14; యిర్మీ 7:20; యెహె 20:48

2 రాజులు 22:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 21:29; యాకో 4:6
  • +2రా 22:11

2 రాజులు 22:20

అధస్సూచీలు

  • *

    మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2000, పేజీ 30

    9/15/2000, పేజీ 30

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 రాజు. 22:11రా 13:2; యిర్మీ 1:2; జెఫ 1:1
2 రాజు. 22:12ది 34:1, 2
2 రాజు. 22:1యెహో 15:20, 39
2 రాజు. 22:21రా 15:5
2 రాజు. 22:32ది 34:8
2 రాజు. 22:41ది 6:13
2 రాజు. 22:42రా 12:4, 5; 2ది 24:8
2 రాజు. 22:42రా 12:9; 2ది 34:9
2 రాజు. 22:52రా 12:11, 12; 2ది 34:10
2 రాజు. 22:62ది 34:11
2 రాజు. 22:72రా 12:15; 2ది 34:12
2 రాజు. 22:8ద్వితీ 31:24-26
2 రాజు. 22:82రా 22:3
2 రాజు. 22:82ది 34:14, 15
2 రాజు. 22:92ది 34:16-18
2 రాజు. 22:10ద్వితీ 31:9
2 రాజు. 22:112ది 34:19-21; యోవే 2:13
2 రాజు. 22:122రా 25:22; యిర్మీ 26:24
2 రాజు. 22:13ద్వితీ 4:24; 29:27; 31:17
2 రాజు. 22:14నిర్గ 15:20; న్యా 4:4; నెహె 6:14; లూకా 2:36; అపొ 21:8, 9
2 రాజు. 22:142ది 34:22-28
2 రాజు. 22:162రా 22:8
2 రాజు. 22:17నిర్గ 20:3; ద్వితీ 32:17; న్యా 2:12; యిర్మీ 2:11
2 రాజు. 22:17యెష 2:8
2 రాజు. 22:17ద్వితీ 32:22; యెష 33:14; యిర్మీ 7:20; యెహె 20:48
2 రాజు. 22:191రా 21:29; యాకో 4:6
2 రాజు. 22:192రా 22:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 రాజులు 22:1-20

రాజులు రెండో గ్రంథం

22 యోషీయా+ రాజైనప్పుడు అతనికి ఎనిమిదేళ్లు; అతను యెరూషలేములో 31 సంవత్సరాలు పరిపాలించాడు.+ అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకు+ చెందిన అదాయా కూతురు. 2 యోషీయా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ తన పూర్వీకుడైన దావీదు మార్గాలన్నిట్లో నడిచాడు,+ అతను వాటి నుండి కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగలేదు.

3 యోషీయా రాజు తన పరిపాలనలోని 18వ సంవత్సరంలో మెషుల్లాము మనవడూ, అజల్యా కుమారుడూ, కార్యదర్శీ అయిన షాఫానును యెహోవా మందిరానికి పంపిస్తూ+ ఇలా చెప్పాడు: 4 “నువ్వు ప్రధానయాజకుడైన హిల్కీయా+ దగ్గరికి వెళ్లు; యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ,+ అంటే ద్వారపాలకులు ప్రజల దగ్గర సేకరించిన డబ్బంతటినీ పోగుచేయమని చెప్పు.+ 5 వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇవ్వాలి; వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరాన్ని* బాగుచేసే పనివాళ్లకు ఇస్తారు,+ 6 అంటే నైపుణ్యంగల పనివాళ్లకు, నిర్మాణకులకు, తాపీ పనివాళ్లకు ఇస్తారు; అంతేకాదు ఆ డబ్బుతో మందిరాన్ని బాగుచేయడానికి కావాల్సిన మ్రానుల్ని, చెక్కిన రాళ్లను కొంటారు.+ 7 అయితే వాళ్లకు ఇచ్చిన డబ్బు విషయంలో వాళ్లను లెక్క అడగాల్సిన అవసరం లేదు, వాళ్లు నమ్మకస్థులు.”+

8 తర్వాత ప్రధానయాజకుడైన హిల్కీయా, “యెహోవా మందిరంలో నాకు ధర్మశాస్త్ర గ్రంథం+ దొరికింది” అని కార్యదర్శి అయిన షాఫానుతో+ అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు, అతను దాన్ని చదవడం మొదలుపెట్టాడు.+ 9 తర్వాత కార్యదర్శి అయిన షాఫాను, రాజు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు: “నీ సేవకులు మందిరంలో ఉన్న డబ్బును సేకరించి* దాన్ని యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షించేవాళ్లకు అప్పగించారు.”+ 10 కార్యదర్శి అయిన షాఫాను రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం+ ఇచ్చాడు.” తర్వాత షాఫాను ఆ గ్రంథాన్ని రాజు ముందు చదవడం మొదలుపెట్టాడు.

11 ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే, రాజు తన బట్టలు చింపుకున్నాడు.+ 12 తర్వాత అతను యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు,+ మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శి అయిన షాఫానుకు, రాజ సేవకుడైన అశాయాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: 13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో రాయబడిన వాటిగురించి నా తరఫున, ప్రజల తరఫున, యూదావాళ్లందరి తరఫున యెహోవా దగ్గర విచారణ చేయండి; యెహోవా మనమీద చాలా కోపంగా ఉన్నాడు.+ ఎందుకంటే మన పూర్వీకులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు. మన విషయంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం వాళ్లు నడుచుకోలేదు.”

14 అప్పుడు యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా కలిసి హుల్దా అనే ప్రవక్త్రి+ దగ్గరికి వెళ్లారు. ఆమె, బట్టల గది మీద అధికారైన షల్లూము భార్య. షల్లూము హర్హషు మనవడు, తిక్వా కుమారుడు. హుల్దా యెరూషలేములోని రెండో భాగంలో నివసిస్తోంది, వాళ్లు అక్కడ ఆమెతో మాట్లాడారు.+ 15 ఆమె వాళ్లతో ఇలా అంది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘మిమ్మల్ని నా దగ్గరికి పంపించిన వ్యక్తితో ఇలా చెప్పండి: 16 “యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను ఈ స్థలం మీదికి, దాని నివాసుల మీదికి విపత్తు తీసుకొస్తాను, యూదా రాజు ఆ గ్రంథంలో చదివిన మాటలన్నిటినీ+ నేను నెరవేరుస్తాను. 17 వాళ్లు నన్ను విడిచిపెట్టి, వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తూ,+ తమ చేతి పనులన్నిటితో+ నాకు కోపం తెప్పించారు. కాబట్టి ఈ స్థలం మీద నా కోపాగ్ని రగులుకుంటుంది, అది ఆరిపోదు.’ ”+ 18 యెహోవా దగ్గర విచారణ చేయమని మిమ్మల్ని పంపించిన యూదా రాజుకు మీరు ఇలా చెప్పాలి, “నువ్వు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే: 19 ‘ఈ స్థలం గురించి, దాని నివాసుల గురించి నేను చెప్పిన మాటల్ని విన్నప్పుడు, అంటే వాళ్ల పరిస్థితిని చూసి ప్రజలు భయపడతారని, వాళ్లను శపిస్తారని నేను చెప్పిన మాటల్ని విన్నప్పుడు నీ హృదయం స్పందించింది; యెహోవా ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని,+ నీ బట్టల్ని చింపుకొని+ నా ఎదుట ఏడ్చావు; కాబట్టి నేను నీ ప్రార్థన విన్నాను అని యెహోవా చెప్తున్నాడు. 20 అందుకే నేను నిన్ను నీ పూర్వీకుల దగ్గరికి చేరుస్తాను,* నువ్వు శాంతిగా సమాధిలోకి చేర్చబడతావు, నేను ఈ స్థలం మీదికి తీసుకొచ్చే విపత్తు అంతటినీ నువ్వు చూడవు.’ ” ’ ” వాళ్లు రాజు దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి