కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • అబ్రాముతో దేవుని ఒప్పందం (1-21)

        • 400 ఏళ్ల బానిసత్వం గురించిన ​ప్రవచనం (13)

        • దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (18-21)

ఆదికాండం 15:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా వాక్యం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 27:1; యెష 41:10; రోమా 8:31; హెబ్రీ 13:6
  • +ద్వితీ 33:29; సామె 30:5
  • +ఆది 17:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2010, పేజీ 8

ఆదికాండం 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

ఆదికాండం 15:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

  • *

    అక్ష., “కుమారుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:7; అపొ 7:5

ఆదికాండం 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:15, 16; 21:12

ఆదికాండం 15:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:17; ద్వితీ 1:10; రోమా 4:18; హెబ్రీ 11:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2004, పేజీలు 27-28

    1/15/1998, పేజీలు 10-11

ఆదికాండం 15:6

అధస్సూచీలు

  • *

    లేదా “లెక్కించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:8
  • +రోమా 4:13, 22; గల 3:6; యాకో 2:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీలు 2-6

    కావలికోట,

    1/15/2008, పేజీ 21

    1/15/2004, పేజీలు 27-28

    1/15/1998, పేజీలు 10-11

ఆదికాండం 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:31; నెహె 9:7

ఆదికాండం 15:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:9; నిర్గ 1:13, 14; 3:7; అపొ 7:6, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2016, పేజీలు 14-15

    కావలికోట,

    1/15/2004, పేజీ 27

    9/15/1998, పేజీలు 12-13

ఆదికాండం 15:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:4; సం 33:4
  • +నిర్గ 3:22; కీర్త 105:37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1998, పేజీలు 12-13

ఆదికాండం 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:8

ఆదికాండం 15:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 14:1; అపొ 7:7
  • +1రా 21:26; 2రా 21:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 62-63

    కావలికోట,

    1/15/2004, పేజీ 28

    6/1/1999, పేజీ 5

    4/1/1997, పేజీలు 17-18

ఆదికాండం 15:17

అధస్సూచీలు

  • *

    లేదా “కాగడా.”

ఆదికాండం 15:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:19; 22:17
  • +1రా 4:21
  • +నిర్గ 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2005, పేజీ 11

ఆదికాండం 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:6

ఆదికాండం 15:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:4
  • +నిర్గ 3:17
  • +యెహో 17:15

ఆదికాండం 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 15:1కీర్త 27:1; యెష 41:10; రోమా 8:31; హెబ్రీ 13:6
ఆది. 15:1ద్వితీ 33:29; సామె 30:5
ఆది. 15:1ఆది 17:5, 6
ఆది. 15:2ఆది 24:2, 3
ఆది. 15:3ఆది 12:7; అపొ 7:5
ఆది. 15:4ఆది 17:15, 16; 21:12
ఆది. 15:5ఆది 22:17; ద్వితీ 1:10; రోమా 4:18; హెబ్రీ 11:12
ఆది. 15:6హెబ్రీ 11:8
ఆది. 15:6రోమా 4:13, 22; గల 3:6; యాకో 2:23
ఆది. 15:7ఆది 11:31; నెహె 9:7
ఆది. 15:13ఆది 21:9; నిర్గ 1:13, 14; 3:7; అపొ 7:6, 7
ఆది. 15:14నిర్గ 7:4; సం 33:4
ఆది. 15:14నిర్గ 3:22; కీర్త 105:37
ఆది. 15:15ఆది 25:8
ఆది. 15:16యెహో 14:1; అపొ 7:7
ఆది. 15:161రా 21:26; 2రా 21:11
ఆది. 15:18ఆది 17:19; 22:17
ఆది. 15:181రా 4:21
ఆది. 15:18నిర్గ 3:8
ఆది. 15:191స 15:6
ఆది. 15:20యెహో 1:4
ఆది. 15:20నిర్గ 3:17
ఆది. 15:20యెహో 17:15
ఆది. 15:21ద్వితీ 7:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 15:1-21

ఆదికాండం

15 ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+ 2 దానికి అబ్రాము ఇలా అన్నాడు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నాకు ఏమి ఇస్తావు? నాకు ఇప్పటికీ పిల్లలు లేరు, దమస్కువాడైన ఎలీయెజెరు+ నా ఇంటికి వారసుడు కాబోతున్నాడు.” 3 అబ్రాము ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నాకు సంతానం*+ ఇవ్వలేదు. ఇదిగో! నా ఇంట్లోని సేవకుడు* నాకు వారసుడు కాబోతున్నాడు.” 4 కానీ యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ఇతను నీకు వారసుడు అవ్వడు. నీ సొంత కుమారుడే నీకు వారసుడు అవుతాడు.”+

5 తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+ 6 అబ్రాము యెహోవా మీద విశ్వాసం ఉంచాడు,+ దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.*+ 7 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నేను యెహోవాను, ఈ దేశాన్ని నీకు ఆస్తిగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ప్రాంతమైన ఊరు నుండి ఇక్కడికి తీసుకొచ్చింది నేనే.”+ 8 అందుకు అబ్రాము, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను ఈ దేశాన్ని ఆస్తిగా పొందుతానని నేనెలా నమ్మాలి?” అని అడిగాడు. 9 అప్పుడు దేవుడు అతనికి ఇలా చెప్పాడు: “నాకోసం ఒక మూడేళ్ల ఆవుదూడను, మూడేళ్ల మేకను, మూడేళ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురం పిల్లను తీసుకో.” 10 కాబట్టి అబ్రాము అవన్నీ తీసుకొని, వాటిని రెండుగా కోసి ఆ ముక్కల్ని ఎదురెదురుగా పెట్టాడు, కానీ పక్షుల్ని మాత్రం అతను కోయలేదు. 11 అప్పుడు, వేటాడే పక్షులు వాటి దగ్గరికి రావడం మొదలుపెట్టాయి, కానీ అబ్రాము ఆ పక్షుల్ని వెళ్లగొడుతూ ఉన్నాడు.

12 సూర్యాస్తమయం కాబోతుండగా, అబ్రాముకు గాఢనిద్ర పట్టింది. భయంకరమైన చిమ్మచీకటి అతన్ని అలుముకుంది. 13 తర్వాత దేవుడు అబ్రాముతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీ సంతానం* తమది కాని దేశంలో పరదేశులుగా జీవిస్తారు, అక్కడి ప్రజలు వీళ్లను బానిసలుగా చేసుకొని, 400 సంవత్సరాల పాటు వీళ్లను బాధిస్తారు.+ 14 కానీ వీళ్లు ఎవరి కిందైతే బానిసలుగా ఉంటారో ఆ జనానికి నేను తీర్పుతీరుస్తాను,+ తర్వాత వీళ్లు చాలా వస్తువులతో బయటికి వస్తారు.+ 15 నువ్వైతే, నెమ్మదితో నీ పూర్వీకుల దగ్గరికి వెళ్తావు; మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.+ 16 అయితే నీ వంశస్థులు నాలుగో తరంలో ఇక్కడికి తిరిగొస్తారు,+ ఎందుకంటే అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు.”+

17 సూర్యుడు అస్తమించి, చాలా చీకటైనప్పుడు పొగ లేస్తున్న ఒక కొలిమి కనిపించింది, అబ్రాము కోసి ఉంచిన భాగాల మధ్య నుండి ఒక దివిటీ* వెళ్లింది. 18 ఆ రోజు యెహోవా అబ్రాముతో ఒక ఒప్పందం చేశాడు.+ ఆయన ఇలా అన్నాడు: “ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు మహానది+ వరకు ఈ దేశాన్ని నీ సంతానానికి* ఇస్తాను.+ 19 అంటే కేనీయుల+ ప్రాంతాన్ని, కనిజ్జీయుల ప్రాంతాన్ని, కద్మోనీయుల ప్రాంతాన్ని, 20 హిత్తీయుల ప్రాంతాన్ని,+ పెరిజ్జీయుల ప్రాంతాన్ని,+ రెఫాయీయుల ప్రాంతాన్ని,+ 21 అమోరీయుల ప్రాంతాన్ని, కనానీయుల ప్రాంతాన్ని, గిర్గాషీయుల ప్రాంతాన్ని, యెబూసీయుల ప్రాంతాన్ని+ నీ వంశస్థులకు ఇస్తాను.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి