యెషయా
53 మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+
యెహోవా బాహువు ఎవరికి వెల్లడైంది?+
2 చిగురులా,+ ఎండిన దేశంలో వేరులా ఆయన అతని* ముందు పైకివస్తాడు.
ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.*
ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
మనం మాత్రం ఆయన్ని అంటువ్యాధి వచ్చినవాడిలా, దేవుడు శిక్షించి బాధపెట్టిన వ్యక్తిలా చూశాం.
6 మనందరం గొర్రెల్లా దారితప్పి తిరిగాం,+
ప్రతీ ఒక్కరం నచ్చిన దారిలో వెళ్లిపోయాం,
అయితే యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు.+
వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు,+
బొచ్చు కత్తిరించే వాళ్లముందు ఆడగొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు,
ఆయన నోరు తెరవలేదు.+
8 అన్యాయపు తీర్పు తీర్చి* ఆయన్ని తీసుకెళ్లిపోయారు;
ఆయన తరానికి* సంబంధించిన వివరాల గురించి ఎవరు ఆలోచిస్తారు?
10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*
నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+
11 ఆయన తాను అనుభవించిన వేదన వల్ల, తాను చూసినదాన్ని బట్టి సంతృప్తి పొందుతాడు.
నీతిమంతుడు, అంటే నా సేవకుడు తన జ్ఞానం వల్ల,
చాలామంది నీతిమంతులయ్యేలా సహాయం చేస్తాడు,+
వాళ్ల తప్పుల్ని భరిస్తాడు.+
12 అందుకే, చాలామందితో పాటు నేను ఆయనకు భాగం నియమిస్తాను,
బలశాలులతో పాటు ఆయన దోపుడుసొమ్ము పంచుకుంటాడు;
ఎందుకంటే, ఆయన తన ప్రాణాన్ని ధారపోసి, చివరికి చనిపోయాడు,+
దోషుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు;+
ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు,+
దోషుల తరఫున వేడుకున్నాడు.+