సామెతలు
2 నా కుమారుడా, నువ్వు నా మాటల్ని అంగీకరిస్తే,
నా ఆజ్ఞల్ని సంపదలా దాచుకుంటే,+
2 తెలివిగల మాటల్ని చెవిపెట్టి వింటే,+
వివేచనను నేర్చుకోవడానికి నీ హృదయాన్ని తెరిస్తే,+
వివేచన కోసం వేడుకుంటే,+
4 వెండిని వెదికినట్టు వాటిని వెదుకుతూ ఉంటే,+
దాచబడిన సంపదల కోసం తవ్వినట్టు వాటికోసం తవ్వుతూ ఉంటే,+
5 అప్పుడు, యెహోవాకు భయపడడం అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు,+
దేవుని గురించిన జ్ఞానం నీకు దొరుకుతుంది.+
8 ఆయన న్యాయమార్గాల్ని కనిపెడుతూ ఉంటాడు,
తన విశ్వసనీయుల త్రోవను కాపాడతాడు.+
9 అప్పుడు నువ్వు నీతి, న్యాయం, నిష్పక్షపాతం అంటే ఏంటో అర్థం చేసుకుంటావు,
ఏది మంచి మార్గమో+ గ్రహిస్తావు.
10 తెలివి నీ హృదయంలోకి వెళ్లినప్పుడు,+
జ్ఞానం నీ ప్రాణానికి* మనోహరంగా అనిపించినప్పుడు,+
11 ఆలోచనా సామర్థ్యం నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది,+
వివేచన నీకు కాపుదలగా ఉంటుంది;
12 అవి చెడు మార్గం నుండి,
తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ల + నుండి నిన్ను కాపాడతాయి,
13 వాళ్లు చీకటి దారుల్లో+ నడవడానికి
నిజాయితీగల* దారుల్ని విడిచిపెడతారు,
14 చెడ్డపనులు చేయడం వాళ్లకు సరదా,
వాళ్లు దిగజారిపోయిన చెడ్డ విషయాల్లో సంతోషిస్తారు,
15 వాళ్ల మార్గాలు వంకరవి
వాళ్ల పనులన్నీ మోసంతో నిండినవి.
16 తెలివి, దిగజారిన* స్త్రీ నుండి,
అనైతిక* స్త్రీ మాట్లాడే తియ్యని* మాటల నుండి నిన్ను కాపాడుతుంది;+
17 ఆమె తన యౌవనకాల భర్తను* వదిలేస్తుంది,+
తన దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని* మర్చిపోతుంది;
18 ఆమె ఇంటికి వెళ్లడం మరణం దగ్గరికి వెళ్లడమే,
ఆమె దారులు సమాధిలోకి తీసుకెళ్తాయి.+