కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • వ్యతిరేకత ఉన్నా పని ఆగలేదు (1-14)

      • ఆయుధాలు పట్టుకొని పని చేయడం (15-23)

నెహెమ్యా 4:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 2:10; 6:1, 2; 13:28

నెహెమ్యా 4:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 4:10

నెహెమ్యా 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 13:1, 2
  • +నెహె 2:19

నెహెమ్యా 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 123:3
  • +కీర్త 79:12

నెహెమ్యా 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:23

నెహెమ్యా 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 4:3
  • +నెహె 2:19
  • +యెహో 13:2, 3; నెహె 13:23

నెహెమ్యా 4:10

అధస్సూచీలు

  • *

    లేదా “బరువులు మోసేవాళ్ల.”

నెహెమ్యా 4:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “పదిసార్లు.”

నెహెమ్యా 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 13:17
  • +సం 14:9; ద్వితీ 20:3; యెహో 1:9
  • +ద్వితీ 7:21; 10:17

నెహెమ్యా 4:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 5:16
  • +నెహె 11:1

నెహెమ్యా 4:17

అధస్సూచీలు

  • *

    లేదా “విసిరే ఆయుధం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2006, పేజీ 9

నెహెమ్యా 4:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 10:9; 2ది 13:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2006, పేజీ 9

నెహెమ్యా 4:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:30; యెహో 23:10

నెహెమ్యా 4:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 13:19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 4:1నెహె 2:10; 6:1, 2; 13:28
నెహె. 4:2నెహె 4:10
నెహె. 4:3నెహె 13:1, 2
నెహె. 4:3నెహె 2:19
నెహె. 4:4కీర్త 123:3
నెహె. 4:4కీర్త 79:12
నెహె. 4:5యిర్మీ 18:23
నెహె. 4:7నెహె 4:3
నెహె. 4:7నెహె 2:19
నెహె. 4:7యెహో 13:2, 3; నెహె 13:23
నెహె. 4:14నెహె 13:17
నెహె. 4:14సం 14:9; ద్వితీ 20:3; యెహో 1:9
నెహె. 4:14ద్వితీ 7:21; 10:17
నెహె. 4:16నెహె 5:16
నెహె. 4:16నెహె 11:1
నెహె. 4:18సం 10:9; 2ది 13:12
నెహె. 4:20ద్వితీ 1:30; యెహో 23:10
నెహె. 4:23నెహె 13:19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 4:1-23

నెహెమ్యా

4 మేము ప్రాకారాన్ని తిరిగి కడుతున్నామని విన్న వెంటనే సన్బల్లటుకు+ కోపం వచ్చింది, అతనికి అది ఏమాత్రం నచ్చలేదు. అతను యూదుల్ని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. 2 అతను తన సహోదరుల ముందు, సమరయ సైన్యం ముందు ఇలా అన్నాడు: “బలహీనులైన ఈ యూదులు ఏమి చేస్తున్నారు? వాళ్లంతటవాళ్లే దాన్ని పూర్తి చేస్తారా? బలులు అర్పిస్తారా? అదంతా ఒక్కరోజులోనే పూర్తౌతుందా? దుమ్ము పట్టిన రాళ్లకుప్పల్లో ఉన్న కాలిపోయిన రాళ్లకు వాళ్లు మళ్లీ ప్రాణం పోస్తారా?”+

3 అతని పక్కనే నిలబడివున్న అమ్మోనీయుడైన+ టోబీయా+ ఇలా అన్నాడు: “వాళ్లు కడుతున్న దాని మీదికి ఒక నక్క ఎక్కినా చాలు వాళ్ల రాతి గోడ పడిపోతుంది.”

4 మా దేవా, ఆలకించు, ఎందుకంటే వాళ్లు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు.+ వాళ్ల నిందల్ని వాళ్ల తలల మీదికే రప్పించు.+ వాళ్లు దోపుడుసొమ్ము అయ్యేలా, వేరే దేశంలో బందీలయ్యేలా చేయి. 5 వాళ్ల తప్పుల్ని కప్పేయకు, వాళ్ల పాపాల్ని తుడిచేయకు. వాటిని నీ ముందు నుండి తుడిచేయకు.+ ఎందుకంటే వాళ్లు ప్రాకారాన్ని కట్టేవాళ్లను అవమానించారు.

6 కాబట్టి మేము ప్రాకారాన్ని కడుతూనే ఉన్నాం. నగరం చుట్టూరా ప్రాకారం సగం ఎత్తు వరకు కట్టబడింది. ప్రజలు మనసుపెట్టి పనిచేస్తూ ఉన్నారు.

7 సన్బల్లటు, టోబీయా,+ అరబీయులు,+ అమ్మోనీయులు, అష్డోదీయులు+ యెరూషలేము ప్రాకారాల మరమ్మతు పని ముందుకు సాగుతోందని, ప్రాకారంలోని పగుళ్లు మూసేయబడుతున్నాయని విన్న వెంటనే వాళ్లకు చాలా కోపమొచ్చింది. 8 వాళ్లంతా కలిసి యెరూషలేముకు వచ్చి, దాని మీద యుద్ధం చేసి, అక్కడ అలజడి సృష్టించాలని పథకం వేశారు. 9 కానీ మేము మా దేవునికి ప్రార్థించి, వాళ్ల నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పగలూ రాత్రీ కాపలా  పెట్టాం.

10 అయితే యూదావాళ్లు ఇలా అన్నారు: “పనిచేసేవాళ్ల* బలం తగ్గిపోయింది, శిథిలాలు ఇంకా చాలా ఉన్నాయి; మనం ప్రాకారాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేం.”

11 మా శత్రువులు మాత్రం ఇలా అంటూ ఉన్నారు: “వాళ్లకు తెలిసేలోపే, వాళ్లు మనల్ని చూసేలోపే, మనం వాళ్ల మధ్యకు వెళ్లి, వాళ్లను చంపి, పని ఆపేద్దాం.”

12 వాళ్ల దగ్గర్లో నివసిస్తున్న యూదులు వచ్చినప్పుడల్లా, “వాళ్లు అన్నివైపుల నుండి మన మీదికి వస్తారు” అని పదేపదే* మాతో అనేవాళ్లు.

13 కాబట్టి నేను ప్రాకారం వెనక చాలా కిందికి ఉన్న రక్షణలేని స్థలాల దగ్గర కొంతమందిని కాపలా పెట్టాను. వాళ్లను కుటుంబాలవారీగా వాళ్ల కత్తులతో, ఈటెలతో, విల్లులతో కాపలా ఉంచాను. 14 వాళ్లు భయపడడం నేను చూసినప్పుడు వెంటనే లేచి ప్రముఖులతో,+ ఉప పాలకులతో, మిగతా ప్రజలతో ఇలా అన్నాను: “వాళ్లకు భయపడకండి.+ సంభ్రమాశ్చర్యాలు పుట్టించే గొప్ప దేవుడైన యెహోవాను+ గుర్తుచేసుకోండి; మీ సహోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కూతుళ్ల కోసం, మీ భార్యల కోసం, మీ ఇళ్ల కోసం పోరాడండి.”

15 వాళ్లు చేస్తున్నది మాకు తెలిసిపోయిందని, సత్యదేవుడు వాళ్ల పథకాన్ని చెడగొట్టాడని మా శత్రువులు విన్నప్పుడు మాలో ప్రతీ ఒక్కరం మా పని చేయడానికి ప్రాకారం దగ్గరికి తిరిగెళ్లాం. 16 ఆ రోజు నుండి నా మనుషుల్లో సగంమంది పని చేసేవాళ్లు.+ ఇంకో సగంమంది ఈటెల్ని, డాళ్లను, విల్లుల్ని, కవచాల్ని ధరించేవాళ్లు. అధిపతులు+ యూదా ఇంటివాళ్లందరికి మద్దతిస్తూ వాళ్ల వెనక నిలబడేవాళ్లు. 17 ఆ యూదులు ప్రాకారాన్ని కడుతున్నారు. బరువులు మోసేవాళ్లు ఒక చేతితో పనిచేస్తూ ఇంకో చేతితో ఆయుధం* పట్టుకున్నారు. 18 పనిచేసే ప్రతీ ఒక్కరు తమ నడుముకు కత్తి కట్టుకున్నారు. బూర* ఊదేవాడు+ నా పక్కన నిలబడ్డాడు.

19 తర్వాత నేను ప్రముఖులకు, ఉప పాలకులకు, మిగతా ప్రజలకు ఇలా చెప్పాను: “చేయాల్సిన పని చాలా ఉంది. ప్రాకారం మీద మనం ఒకరికొకరం చాలా దూరంగా ఉన్నాం. 20 మీరు బూర శబ్దం విన్నప్పుడు, మా దగ్గరికి వచ్చేయండి. మన దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు.”+

21 కాబట్టి మేము పని చేస్తూనే ఉన్నాం. అదే సమయంలో, మిగతా సగంమంది తెల్లవారుజాము నుండి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకొనివున్నారు. 22 అప్పుడు నేను ప్రజలతో, “ప్రతీ ఒక్కరు తనతన సహాయకునితో కలిసి రాత్రి యెరూషలేము లోపలే గడపాలి, వాళ్లు రాత్రిపూట మనకు కాపలా కాస్తారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను. 23 కాబట్టి మాలో ఎవ్వరమూ, అంటే నేను గానీ, నా సహోదరులు గానీ, నా సేవకులు+ గానీ, నా వెనకాల వచ్చిన కాపలాదారులు గానీ ఎప్పుడూ మా బట్టల్ని తీసేయలేదు. ప్రతీ ఒక్కరం కుడిచేతితో ఆయుధాల్ని పట్టుకునే ఉండేవాళ్లం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి