కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • పదో తెగులు ప్రకటించబడడం (1-10)

        • ఇశ్రాయేలీయులు బహుమతులు అడిగి తీసుకోవాలి (2)

నిర్గమకాండం 11:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:31, 32

నిర్గమకాండం 11:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:21, 22; 12:35, 36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 26

నిర్గమకాండం 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:29

నిర్గమకాండం 11:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:22, 23; హెబ్రీ 11:28
  • +నిర్గ 12:12

నిర్గమకాండం 11:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:30

నిర్గమకాండం 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 8:22; 9:3, 4; 10:23; 12:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2020, పేజీ 6

నిర్గమకాండం 11:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:3
  • +నిర్గ 3:19; 7:4; రోమా 9:17, 18

నిర్గమకాండం 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:21; 9:15, 16; 10:20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 11:1నిర్గ 12:31, 32
నిర్గ. 11:2నిర్గ 3:21, 22; 12:35, 36
నిర్గ. 11:4నిర్గ 12:29
నిర్గ. 11:5నిర్గ 4:22, 23; హెబ్రీ 11:28
నిర్గ. 11:5నిర్గ 12:12
నిర్గ. 11:6నిర్గ 12:30
నిర్గ. 11:7నిర్గ 8:22; 9:3, 4; 10:23; 12:13
నిర్గ. 11:9నిర్గ 7:3
నిర్గ. 11:9నిర్గ 3:19; 7:4; రోమా 9:17, 18
నిర్గ. 11:10నిర్గ 4:21; 9:15, 16; 10:20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 11:1-10

నిర్గమకాండం

11 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరో మీదికి, ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించబోతున్నాను. ఆ తర్వాత అతను మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించేస్తాడు, నిజానికి అతను మిమ్మల్ని ఇక్కడినుండి వెళ్లగొడతాడు.+ 2 కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ తమ ఇరుగుపొరుగువాళ్లను వెండి-బంగారు వస్తువులు అడిగి తీసుకోవాలని ప్రజలతో చెప్పు.”+ 3 యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఆ ప్రజలు అనుగ్రహం పొందేలా చేశాడు. అంతేకాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సేవకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో మోషే చాలా గొప్పవాడు అయ్యాడు.

4 తర్వాత మోషే ఫరోతో ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్పాడంటే, ‘దాదాపు అర్ధరాత్రి సమయంలో నేను ఐగుప్తు మధ్యలోకి వెళ్తున్నాను.+ 5 ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+ తన సింహాసనంలో కూర్చున్న ఫరో మొదటి సంతానం దగ్గర నుండి తిరుగలి విసిరే దాసురాలి మొదటి సంతానం వరకు ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది; పశువుల్లో కూడా ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+ 6 ఐగుప్తు దేశమంతటా గొప్ప ఏడ్పు వినిపిస్తుంది. అంత గొప్ప ఏడ్పు ఇప్పటివరకూ లేదు, ఇకమీదట కూడా ఉండదు.+ 7 అయితే ఇశ్రాయేలీయుల్లోని మనుషుల్ని చూసి గానీ వాళ్ల పశువుల్ని చూసి గానీ కనీసం కుక్క కూడా మొరగదు. అప్పుడు, యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య తేడా చూపించగలడని మీకు తెలుస్తుంది.’+ 8 నీ సేవకులందరూ ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘నువ్వూ, నీ ప్రజలందరూ వెళ్లిపోండి’ అని అంటారు. అప్పుడు నేను వెళ్లిపోతాను.” ఆ మాట అని అతను చాలా కోపంగా ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

9 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో నేను ఇంకా ఎక్కువ అద్భుతాలు చేసేలా+ ఫరో మీ మాట వినడు.”+ 10 మోషే, అహరోనులు ఫరో ముందు ఈ అద్భుతాలన్నీ చేశారు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, కాబట్టి అతను ఇశ్రాయేలీయుల్ని తన దేశం నుండి పంపించలేదు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి