కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • ఇశ్రాయేలు నాయకులతో యెహోషువ చివరి మాటలు (1-16)

        • యెహోవా మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు (14)

యెహోషువ 23:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:14; లేవీ 26:6
  • +యెహో 13:1

యెహోషువ 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:18
  • +ద్వితీ 31:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1992, పేజీ 12

యెహోషువ 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:11-14, 40, 42

యెహోషువ 23:4

అధస్సూచీలు

  • *

    లేదా “సూర్యాస్తమయం వైపున.”

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:1
  • +యెహో 13:2-6

యెహోషువ 23:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:30; 33:2; ద్వితీ 11:23
  • +సం 33:53

యెహోషువ 23:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:7; ద్వితీ 17:18; 31:26
  • +ద్వితీ 12:32; యెహో 1:7, 8

యెహోషువ 23:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:33; ద్వితీ 7:2
  • +నిర్గ 20:5

యెహోషువ 23:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:20; యెహో 22:5

యెహోషువ 23:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:3-5

యెహోషువ 23:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:8; న్యా 3:31; 2స 23:8
  • +ద్వితీ 28:7
  • +నిర్గ 23:27; ద్వితీ 3:22

యెహోషువ 23:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:5
  • +ద్వితీ 4:9; యెహో 22:5

యెహోషువ 23:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:29; యెహో 13:2-6
  • +నిర్గ 34:16; ద్వితీ 7:3; న్యా 3:6; 1రా 11:4; ఎజ్రా 9:2

యెహోషువ 23:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:3, 21

యెహోషువ 23:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “నేను ఈ రోజు సర్వలోక మార్గంలో వెళ్తున్నాను.”

  • *

    అక్ష., “మీ నిండు హృదయంతో, మీ నిండు ప్రాణంతో మీకు బాగా తెలుసు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:45; 1రా 8:56

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2008, పేజీలు 17-18

    11/1/2007, పేజీలు 22-24

యెహోషువ 23:15

అధస్సూచీలు

  • *

    లేదా “శాపాలన్నిటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:3-12
  • +లేవీ 26:14-17

యెహోషువ 23:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 23:1నిర్గ 33:14; లేవీ 26:6
యెహో. 23:1యెహో 13:1
యెహో. 23:2ద్వితీ 16:18
యెహో. 23:2ద్వితీ 31:28
యెహో. 23:3యెహో 10:11-14, 40, 42
యెహో. 23:4ద్వితీ 7:1
యెహో. 23:4యెహో 13:2-6
యెహో. 23:5నిర్గ 23:30; 33:2; ద్వితీ 11:23
యెహో. 23:5సం 33:53
యెహో. 23:6నిర్గ 24:7; ద్వితీ 17:18; 31:26
యెహో. 23:6ద్వితీ 12:32; యెహో 1:7, 8
యెహో. 23:7నిర్గ 23:33; ద్వితీ 7:2
యెహో. 23:7నిర్గ 20:5
యెహో. 23:8ద్వితీ 10:20; యెహో 22:5
యెహో. 23:9యెహో 1:3-5
యెహో. 23:10లేవీ 26:8; న్యా 3:31; 2స 23:8
యెహో. 23:10ద్వితీ 28:7
యెహో. 23:10నిర్గ 23:27; ద్వితీ 3:22
యెహో. 23:11ద్వితీ 6:5
యెహో. 23:11ద్వితీ 4:9; యెహో 22:5
యెహో. 23:12నిర్గ 23:29; యెహో 13:2-6
యెహో. 23:12నిర్గ 34:16; ద్వితీ 7:3; న్యా 3:6; 1రా 11:4; ఎజ్రా 9:2
యెహో. 23:13న్యా 2:3, 21
యెహో. 23:14యెహో 21:45; 1రా 8:56
యెహో. 23:15లేవీ 26:3-12
యెహో. 23:15లేవీ 26:14-17
యెహో. 23:162రా 24:20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 23:1-16

యెహోషువ

23 యెహోవా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి వాళ్లకు విశ్రాంతి ఇచ్చిన+ చాలా రోజుల తర్వాత, యెహోషువ బాగా ముసలివాడైనప్పుడు,+ 2 అతను ఇశ్రాయేలీయులందర్నీ, వాళ్ల పెద్దల్ని, నాయకుల్ని, న్యాయమూర్తుల్ని, అధికారుల్ని+ పిలిపించి,+ వాళ్లతో ఇలా అన్నాడు: “నేను బాగా ముసలివాణ్ణి అయ్యాను, వయసు పైబడింది. 3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికీ చేసినదంతా మీరే స్వయంగా చూశారు, మీ దేవుడైన యెహోవాయే మీ తరఫున పోరాడాడు.+ 4 చూడండి, పడమటి వైపున* యొర్దాను నుండి మహా సముద్రం* వరకు నివసిస్తున్న దేశాలవాళ్లను నేను వెళ్లగొట్టి,+ ఆ ప్రాంతాన్ని చీట్లు వేసి నేను మీకు ఇచ్చాను; ఇతర జనాలు ఇంకా ఆ ప్రాంతంలోనే ఉన్నారు, అయినా ఆ ప్రాంతం మీదే.+ 5 మీ దేవుడైన యెహోవాయే వాళ్లను మీ ఎదుట నుండి నెట్టేసి+ మీ కోసం వాళ్లను బయటికి వెళ్లగొట్టాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టే వాళ్ల దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు.+

6 “కాబట్టి మీరు ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో+ రాయబడిన వాటన్నిటినీ పాటించి, అమలు చేయడానికి చాలా ధైర్యంగా ఉండాలి. దాని నుండి మీరు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ ఎప్పుడూ మళ్లకూడదు,+ 7 మీ మధ్య మిగిలివున్న ఈ దేశాలవాళ్లతో ఎన్నడూ కలవకూడదు.+ మీరు కనీసం వాళ్ల దేవుళ్ల పేర్లు కూడా పలకకూడదు, వాళ్ల దేవుళ్ల పేరున ప్రమాణం చేయకూడదు; మీరు ఎన్నడూ వాళ్ల దేవుళ్లను సేవించకూడదు, వాటికి మొక్కకూడదు.+ 8 బదులుగా, మీరు ఈ రోజు వరకు ఉన్నట్టే మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి.+ 9 యెహోవా శక్తివంతమైన గొప్ప దేశాల్ని మీ ఎదుట నుండి వెళ్లగొడతాడు. ఈ రోజు వరకు ఏ మనిషీ మీకు ఎదురు నిలవలేకపోయాడు.+ 10 మీలో ఒక్క మనిషి వెయ్యిమందిని తరుముతాడు.+ ఎందుకంటే మీకు మాటిచ్చినట్టే+ మీ దేవుడైన యెహోవా మీ కోసం యుద్ధం చేస్తున్నాడు.+ 11 కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించే విషయంలో+ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.+

12 “అయితే మీరు దేవుణ్ణి విడిచిపెట్టి, మీ మధ్య మిగిలివున్న+ ఈ దేశాల ప్రజల్ని హత్తుకొని వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకొని,+ వాళ్లతో సహవసిస్తుంటే, 13 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలవాళ్లను వెళ్లగొడుతూ ఉండడని+ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యేంతవరకు వాళ్లు మీకు బోనులా, ఉరిలా, మీ వీపులమీద కొరడాలా, మీ కళ్లలో ముళ్లలా తయారౌతారు.

14 “చూడండి! నేను చనిపోబోతున్నాను,* మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కమాట కూడా తప్పిపోలేదని మీకు బాగా తెలుసు.* అవన్నీ మీ విషయంలో నిజమయ్యాయి. వాటిలో ఒక్కమాట కూడా తప్పిపోలేదు.+ 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిటినీ మీ కోసం నెరవేర్చినట్టే,+ యెహోవా తాను వాగ్దానం చేసిన విపత్తులన్నిటినీ* మీ మీదికి తీసుకొస్తాడు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేస్తాడు.+ 16 మీరు పాటించాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఒప్పందాన్ని మీరు మీరితే, మీరు వెళ్లి ఇతర దేవుళ్లను సేవించి, వాటికి మొక్కితే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది;+ ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరగా నాశనమౌతారు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి