సామెతలు
24 చెడ్డవాళ్లను చూసి ఈర్ష్యపడకు,
వాళ్లతో సహవాసం చేయాలని కోరుకోకు.+
2 వాళ్ల హృదయం దౌర్జన్యం చేయడం గురించే ఆలోచిస్తుంది,
వాళ్ల పెదాలు సమస్యలు సృష్టించడం గురించి మాట్లాడతాయి.
5 తెలివిగలవాడు శక్తిమంతుడు,+
జ్ఞానంతో ఒక వ్యక్తి తన శక్తిని పెంచుకుంటాడు.
7 మూర్ఖుడికి నిజమైన తెలివి దొరకదు;+
నగర ద్వారం దగ్గర అతను ఏమీ మాట్లాడలేడు.
8 దుష్ట పన్నాగాలు పన్నేవాణ్ణి
కుట్రలు పన్నడంలో ఆరితేరినవాడు అని పిలుస్తారు.+
10 కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే
నీ శక్తి తగ్గిపోతుంది.
11 చంపడానికి తీసుకెళ్తున్న వాళ్లను రక్షించు,
వధకు వెళ్తున్న వాళ్లను కాపాడు.+
12 ఒకవేళ నువ్వు “ఆ విషయం మాకు తెలీదే” అని అంటే,
హృదయాల్ని* పరిశీలించే దేవుడు దాన్ని గ్రహించలేడా?+
అవును నిన్ను గమనించే ఆయనకు తెలుస్తుంది,
ఆయన ప్రతీ మనిషికి అతని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.+
13 నా కుమారుడా, తేనెను తిను, అది మంచిది;
తేనెపట్టు నుండి కారే తేనె తియ్యగా ఉంటుంది.
14 అలాగే తెలివి నీకు మంచిదని* తెలుసుకో.+
నువ్వు దాన్ని సంపాదిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది,
నీ ఆశ భంగం కాదు.+
15 దుష్టుడిలా నీతిమంతుని ఇంటి దగ్గర కాపుకాయకు;
అతని విశ్రాంతి స్థలాన్ని పాడుచేయకు.
16 ఎందుకంటే నీతిమంతుడు ఏడుసార్లు పడిపోవచ్చు, కానీ అతను మళ్లీ లేస్తాడు,+
అయితే విపత్తు వచ్చినప్పుడు దుష్టుడు పూర్తిగా పడిపోతాడు.+
17 నీ శత్రువు పడిపోయినప్పుడు ఆనందపడకు,
అతను తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషపడనివ్వకు;+
18 లేదంటే యెహోవా దాన్ని చూస్తాడు, అది ఆయనకు నచ్చదు,
19 చెడ్డవాళ్లను చూసి నిరాశపడకు;*
దుష్టుల్ని చూసి ఈర్ష్యపడకు.
20 చెడ్డవాళ్లెవ్వరికీ మంచి భవిష్యత్తు ఉండదు;+
దుష్టుల దీపం ఆరిపోతుంది.+
21 నా కుమారుడా, యెహోవాకూ రాజుకూ భయపడు.+
ఆ ఇద్దరు* వాళ్లమీదికి ఏ నాశనం తీసుకొస్తారో ఎవరికి తెలుసు?+
23 ఇవి కూడా జ్ఞానుల వాక్కులే:
తీర్పుతీర్చేటప్పుడు పక్షపాతం చూపించడం మంచిదికాదు.+
24 దుష్టుడితో “నువ్వు నీతిమంతుడివి” అనేవాణ్ణి+ ప్రజలు శపిస్తారు,
దేశదేశాల వాళ్లు అతన్ని చెడ్డవాడు అంటారు.
26 నిజాయితీగా జవాబిచ్చే వ్యక్తిని ప్రజలు ముద్దుపెట్టుకుంటారు.*+
28 ఆధారాలు లేకుండా నీ పొరుగువాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకు.+
నీ పెదాలతో ఇతరుల్ని మోసం చేయకు.+
30 సోమరి పొలం మీదుగా,+
వివేచన లేనివాడి ద్రాక్షతోట మీదుగా నేను వెళ్లాను.
31 అందులో కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి;
దురదగొండి మొక్కలు నేలనంతా కప్పేశాయి,
దాని రాతిగోడ పడిపోయింది.+
32 నేనది గమనించాను, జాగ్రత్తగా ఆలోచించాను;
దాన్ని చూసి ఈ పాఠం నేర్చుకున్నాను:*
33 కాసేపు నిద్రపోవడం, కాసేపు కునికిపాట్లు పడడం,
కాసేపు చేతులు ముడుచుకొని పడుకోవడం
34 వాటివల్ల, దోపిడీ దొంగలా పేదరికం,
ఆయుధాలు ధరించిన మనిషిలా లేమి నీ మీదికి వస్తాయి.+