కీర్తనలు
యాత్ర కీర్తన. సొలొమోనుది.
యెహోవా నగరాన్ని కాపాడకపోతే,+
దాని కాపలావాళ్లు మెలకువగా ఉండడం వృథా.
2 మీరు పెందలకడ లేచి,
చాలా రాత్రి వరకు మెలకువగా ఉండి
ఆహారం కోసం కష్టపడడం వృథా;
ఎందుకంటే, ఆయన తాను ప్రేమించేవాళ్లకు
కావాల్సిన వాటిని, అలాగే మంచి నిద్రను కూడా ఇస్తున్నాడు.+
ఎందుకంటే, వాళ్ల కుమారులు నగర ద్వారం దగ్గర శత్రువులకు జవాబిస్తారు.