కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • తామారు మీద అమ్నోను అత్యాచారం (1-22)

      • అబ్షాలోము అమ్నోనును చంపడం (23-33)

      • అబ్షాలోము గెషూరుకు పారిపోవడం (34-39)

2 సమూయేలు 13:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 3:9
  • +2స 3:2

2 సమూయేలు 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 13:35
  • +1స 16:9; 1ది 2:13

2 సమూయేలు 13:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:9; 20:17

2 సమూయేలు 13:5

అధస్సూచీలు

  • *

    లేదా “ఓదార్పు రొట్టెను.”

2 సమూయేలు 13:7

అధస్సూచీలు

  • *

    లేదా “ఓదార్పు రొట్టె.”

2 సమూయేలు 13:10

అధస్సూచీలు

  • *

    లేదా “ఓదార్పు రొట్టె.”

2 సమూయేలు 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:9, 29; 20:17; ద్వితీ 27:22
  • +ఆది 34:2, 7; న్యా 20:5, 6

2 సమూయేలు 13:18

అధస్సూచీలు

  • *

    లేదా “అలంకరించబడిన.”

2 సమూయేలు 13:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:6; ఎస్తే 4:1; యిర్మీ 6:26

2 సమూయేలు 13:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:3; 13:1
  • +లేవీ 18:9; ద్వితీ 27:22

2 సమూయేలు 13:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 19:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 16

2 సమూయేలు 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 34:7
  • +సామె 18:19

2 సమూయేలు 13:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 11:54
  • +1రా 1:9, 19

2 సమూయేలు 13:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 55:21; సామె 10:18; 26:24-26

2 సమూయేలు 13:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీలు 7-8

2 సమూయేలు 13:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:9; 1ది 2:13
  • +2స 13:3
  • +2స 12:10
  • +లేవీ 18:9, 29
  • +2స 13:12-14
  • +ఆది 27:41; కీర్త 7:14; సామె 18:19

2 సమూయేలు 13:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 13:38

2 సమూయేలు 13:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 13:3

2 సమూయేలు 13:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:3

2 సమూయేలు 13:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:14; యెహో 12:4, 5; 2స 14:23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 13:11ది 3:9
2 సమూ. 13:12స 3:2
2 సమూ. 13:32స 13:35
2 సమూ. 13:31స 16:9; 1ది 2:13
2 సమూ. 13:4లేవీ 18:9; 20:17
2 సమూ. 13:12లేవీ 18:9, 29; 20:17; ద్వితీ 27:22
2 సమూ. 13:12ఆది 34:2, 7; న్యా 20:5, 6
2 సమూ. 13:19యెహో 7:6; ఎస్తే 4:1; యిర్మీ 6:26
2 సమూ. 13:202స 3:3; 13:1
2 సమూ. 13:20లేవీ 18:9; ద్వితీ 27:22
2 సమూ. 13:21సామె 19:13
2 సమూ. 13:22ఆది 34:7
2 సమూ. 13:22సామె 18:19
2 సమూ. 13:23యోహా 11:54
2 సమూ. 13:231రా 1:9, 19
2 సమూ. 13:26కీర్త 55:21; సామె 10:18; 26:24-26
2 సమూ. 13:321స 16:9; 1ది 2:13
2 సమూ. 13:322స 13:3
2 సమూ. 13:322స 12:10
2 సమూ. 13:32లేవీ 18:9, 29
2 సమూ. 13:322స 13:12-14
2 సమూ. 13:32ఆది 27:41; కీర్త 7:14; సామె 18:19
2 సమూ. 13:342స 13:38
2 సమూ. 13:352స 13:3
2 సమూ. 13:372స 3:3
2 సమూ. 13:38ద్వితీ 3:14; యెహో 12:4, 5; 2స 14:23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 13:1-39

సమూయేలు రెండో గ్రంథం

13 దావీదు కుమారుడు అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లెలు ఉంది.+ దావీదు కుమారుడు అమ్నోను+ ఆమెపై మనసుపడ్డాడు. 2 అమ్నోను తన సహోదరి తామారు గురించి ఎంతో దిగులుపడుతూ క్షీణించిపోయాడు. తామారు కన్య కాబట్టి ఆమెను ఏమి చేయాలన్నా సాధ్యంకాదని అమ్నోనుకు అనిపించింది. 3 అమ్నోనుకు యెహోనాదాబు+ అనే స్నేహితుడు ఉన్నాడు, అతను దావీదు సహోదరుడైన షిమ్యా+ కుమారుడు; యెహోనాదాబు ఎంతో జిత్తులమారి. 4 అతను అమ్నోనును, “రాకుమారుడివైన నువ్వు రోజూ ఎందుకు అంత దిగులుగా కనిపిస్తున్నావు? నాకు చెప్పొచ్చుగా?” అని అడిగాడు. దానికి అమ్నోను అతనితో, “నేను నా సహోదరుడైన అబ్షాలోము చెల్లెలు+ తామారు మీద మనసుపడ్డాను” అన్నాడు. 5 అప్పుడు యెహోనాదాబు అతనితో ఇలా అన్నాడు: “⁠నువ్వు నీ మంచం మీద పడుకొని ఆరోగ్యం బాగోలేనట్టు నటించు. మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చినప్పుడు అతనితో, ‘దయచేసి నా సహోదరి తామారును నా దగ్గరికి వచ్చి నాకు కొంచెం ఆహారం వడ్డించమను. అనారోగ్యంగా ఉన్నవాళ్లకు ఇచ్చే ఆహారాన్ని* ఆమె నా కళ్లముందు సిద్ధం చేసి వడ్డిస్తే నేను తింటాను’ అని చెప్పు.”

6 దాంతో అమ్నోను పడుకొని ఆరోగ్యం బాగోలేనట్టు నటించాడు. అప్పుడు రాజు అతన్ని చూడడానికి వచ్చాడు. అమ్నోను రాజుతో, “నా సహోదరి తామారు నా కళ్లముందు హృదయాకారంలో రెండు రొట్టెల్ని చేసేలా ఆమెను దయచేసి నా దగ్గరికి పంపించు. నేను ఆమె వడ్డించే రొట్టెల్ని తింటాను” అన్నాడు. 7 అప్పుడు దావీదు, ఇంటి దగ్గరున్న తామారుకు, “నువ్వు దయచేసి నీ సహోదరుడైన అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసం ఆహారం* సిద్ధం చేయి” అని కబురు పంపించాడు. 8 కాబట్టి తామారు తన సహోదరుడైన అమ్నోను ఇంటికి వెళ్లింది, అతను పడుకొని ఉన్నాడు. ఆమె పిండిముద్ద తీసుకొని అతని కళ్లముందు రొట్టెలు చేసి వాటిని కాల్చింది. 9 తర్వాత ఆమె పెనం తీసుకెళ్లి అతనికి వడ్డించింది. కానీ అమ్నోను తినడానికి ఒప్పుకోకుండా అక్కడున్న వాళ్లతో, “అందరూ నా దగ్గర నుండి వెళ్లిపోండి!” అన్నాడు. దాంతో అందరూ అతని దగ్గర నుండి వెళ్లిపోయారు.

10 అప్పుడు అమ్నోను తామారుతో, “నువ్వు వడ్డించే ఆహారం* నేను తినడానికి దాన్ని పడకగదిలోకి తీసుకురా” అన్నాడు. అందుకు తామారు తాను చేసిన హృదయాకారంలో ఉన్న రొట్టెల్ని తీసుకొని పడకగదిలో ఉన్న తన సహోదరుడు అమ్నోను దగ్గరికి వెళ్లింది. 11 తామారు రొట్టెల్ని తెచ్చినప్పుడు అతను ఆమెను పట్టుకొని, “నా సహోదరీ, రా, నాతో పడుకో” అన్నాడు. 12 కానీ ఆమె అతనితో ఇలా అంది: “నా సహోదరుడా, వద్దు! నన్ను అవమానించకు, ఇలాంటిది ఇశ్రాయేలులో జరగదు.+ ఇలాంటి అవమానకరమైన పని చేయకు.+ 13 ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఇశ్రాయేలులో నిన్ను ఒక నీచుడిగా చూస్తారు. దయచేసి నువ్వు రాజుతో మాట్లాడు. నన్ను నీకు ఇవ్వడానికి అతను ఒప్పుకుంటాడు.” 14 కానీ అమ్నోను తామారు మాట వినలేదు, అతను ఆమెపై అత్యాచారం చేసి ఆమెను అవమానించాడు. 15 తర్వాత అమ్నోను ఆమెను చాలా తీవ్రంగా ద్వేషించడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఆమెను ప్రేమించినదానికన్నా ఎక్కువగా ద్వేషించాడు. అమ్నోను ఆమెతో, “లే; ఇక్కడి నుండి వెళ్లిపో!” అన్నాడు. 16 అప్పుడు ఆమె అతనితో, “నా సహోదరుడా, వద్దు. నువ్వు ఇప్పుడు నన్ను పంపించేయడం నువ్వు నాకు చేసినదాని కన్నా ఘోరం!” అని అంది. కానీ అతను ఆమె మాట వినలేదు.

17 అప్పుడు అమ్నోను తన యువ సేవకుణ్ణి పిలిచి, “ఈమెను నా కళ్లముందు నుండి తీసుకెళ్లి, తలుపుకు గడిపెట్టు” అని చెప్పాడు. 18 (అప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన* వస్త్రం వేసుకొని ఉంది. కన్యలైన రాకుమార్తెలు అలాంటి బట్టలు వేసుకునేవాళ్లు.) దాంతో ఆ సేవకుడు ఆమెను బయటికి తీసుకెళ్లి, తలుపుకు గడిపెట్టాడు. 19 అప్పుడు తామారు తలమీద బూడిద పోసుకొని,+ తాను వేసుకున్న నాణ్యమైన వస్త్రాన్ని చింపేసుకుంది; ఆమె తన చేతుల్ని తలమీద పెట్టుకొని దారిపొడవునా ఏడుస్తూ వెళ్లింది.

20 అప్పుడు ఆమె సహోదరుడైన అబ్షాలోము+ ఆమెతో ఇలా అన్నాడు: “నీతో ఉన్నది నీ సహోదరుడు అమ్నోనే కదూ? నా సహోదరీ, ఊరుకో. అతను నీ సహోదరుడు.+ నీ హృదయంలో దీని గురించే ఆలోచిస్తూ ఉండకు.” ఆ తర్వాత తామారు విడిగా, తన సహోదరుడైన అబ్షాలోము ఇంట్లో నివసించింది. 21 దావీదు రాజు ఈ విషయాలన్నీ విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది.+ కానీ అమ్నోను తన మొదటి కుమారుడు కాబట్టి అతనిమీద ప్రేమతో దావీదు అతన్ని బాధపెట్టాలనుకోలేదు. 22 అయితే, అబ్షాలోము అమ్నోనుతో మంచి గానీ చెడు గానీ ఏమీ మాట్లాడలేదు; అమ్నోను తన సహోదరి తామారును అవమానించాడు+ కాబట్టి అబ్షాలోము అతన్ని ద్వేషించాడు.+

23 రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత, అబ్షాలోముకు చెందిన గొర్రెల బొచ్చు కత్తిరించేవాళ్లు ఎఫ్రాయిము+ దగ్గర బయల్దాసోరులో ఉన్నారు. అప్పుడు అబ్షాలోము రాకుమారులందర్నీ విందుకు పిలిచాడు.+ 24 అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి, “నీ సేవకుడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. దయచేసి రాజు, అతని సేవకులు నాతో రావాలి” అన్నాడు. 25 కానీ రాజు అబ్షాలోముతో, “నా కుమారుడా, వద్దు. మేమందరం వస్తే నీకు భారమైపోతాం” అన్నాడు. అబ్షాలోము ఎంత బ్రతిమాలినా, దావీదు వెళ్లడానికి ఒప్పుకోలేదు కానీ అతన్ని ఆశీర్వదించాడు. 26 అప్పుడు అబ్షాలోము, “నువ్వు రాకపోతే, దయచేసి నా సహోదరుడు అమ్నోనును నాతో పంపించు”+ అన్నాడు. అందుకు రాజు, “అతను ఎందుకు నీతో రావాలి?” అని అబ్షాలోమును అడిగాడు. 27 కానీ అబ్షాలోము బ్రతిమాలడంతో దావీదు అమ్నోనును, రాకుమారులందర్నీ అతనితో పంపించాడు.

28 తర్వాత అబ్షాలోము తన సేవకులకు ఇలా ఆజ్ఞాపించాడు: “గమనిస్తూ ఉండండి, అమ్నోను ద్రాక్షారసం తాగి అతని హృదయం సంతోషంగా ఉన్నప్పుడు, ‘అమ్నోనును చంపండి!’ అని నేను మీతో అంటాను. అప్పుడు మీరు అతన్ని చంపాలి. నేనే స్వయంగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి భయపడకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి.” 29 దాంతో అబ్షాలోము సేవకులు అతను ఆజ్ఞాపించినట్టే అమ్నోనును చంపారు; అప్పుడు మిగతా రాకుమారులందరూ లేచి వాళ్లవాళ్ల కంచర గాడిదల మీద ఎక్కి పారిపోయారు. 30 వాళ్లు దారిలో ఉన్నప్పుడు, “అబ్షాలోము రాకుమారులందర్నీ చంపేశాడు, ఒక్కరు కూడా మిగల్లేదు” అనే వార్త దావీదుకు అందింది. 31 దాంతో రాజు లేచి తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. అతని సేవకులందరూ అతని పక్కనే బట్టలు చింపుకొని నిలబడివున్నారు.

32 అయితే, దావీదు సహోదరుడైన షిమ్యా+ కుమారుడు యెహోనాదాబు+ ఇలా అన్నాడు: “వాళ్లు రాకుమారులందర్నీ చంపారని నా ప్రభువైన నువ్వు అనుకోవద్దు. అమ్నోను ఒక్కడే చనిపోయాడు.+ ఇలా చేయమని అబ్షాలోము ఆజ్ఞాపించాడు. అమ్నోను తన సహోదరి+ తామారును అవమానించిన+ రోజు నుండే ఈ విధంగా చేయాలని అబ్షాలోము అనుకుంటూ ఉన్నాడు.+ 33 ‘రాకుమారులందరూ చనిపోయారు’ అనే వార్తను నా ప్రభువైన రాజు పట్టించుకోవద్దు; అమ్నోను ఒక్కడే చనిపోయాడు.”

34 ఈలోగా అబ్షాలోము పారిపోయాడు.+ తర్వాత కావలివాడు తలెత్తి చూసినప్పుడు, తన వెనక ఉన్న పర్వతం పక్కనున్న దారిలో నుండి చాలామంది రావడం అతనికి కనిపించింది. 35 అప్పుడు యెహోనాదాబు+ రాజుతో, “ఇదిగో! నీ సేవకుడు చెప్పినట్టే, రాకుమారులు తిరిగొచ్చారు” అన్నాడు. 36 అతని మాటలు పూర్తవగానే, రాకుమారులు బిగ్గరగా ఏడుస్తూ లోపలికి వచ్చారు; రాజు, అతని సేవకులందరూ కూడా విపరీతంగా ఏడ్చారు. 37 కానీ అబ్షాలోము గెషూరు రాజైన అమీహూదు కుమారుడు తల్మయి+ దగ్గరికి పారిపోయాడు. దావీదు చాలా రోజులు తన కుమారుడైన అమ్నోను గురించి దుఃఖించాడు. 38 అబ్షాలోము పారిపోయి గెషూరుకు+ వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.

39 చివరికి దావీదు రాజు అబ్షాలోమును చూడాలనుకున్నాడు. ఎందుకంటే అతను అమ్నోను మరణం విషయంలో ఓదార్పు పొందాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి