యోబు
40 యెహోవా యోబుతో ఇంకా ఇలా అన్నాడు:
2 “తప్పులు పట్టేవాడు సర్వశక్తిమంతునితో పోరాడవచ్చా?+
దేవుణ్ణి సరిదిద్దాలని అనుకుంటున్నవాడు ఇప్పుడు జవాబివ్వాలి.”+
3 అప్పుడు యోబు యెహోవాతో ఇలా అన్నాడు:
4 “ఇదిగో! నేను అల్పుణ్ణి.+
నేను నీకు ఏం జవాబు ఇవ్వగలను?
నా నోటి మీద చెయ్యి పెట్టుకుంటున్నాను.+
5 నేను ఒక్కసారి మాట్లాడాను, ఇక మాట్లాడను;
రెండుసార్లు మాట్లాడాను, మళ్లీ నోరెత్తను.”
6 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నాడు:+
7 “ఓ మనిషీ, దయచేసి నీ నడుం కట్టుకో;
నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబివ్వు.+
8 నా న్యాయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా?
నువ్వు నిర్దోషివని అనిపించుకోవడానికి నామీద నేరం మోపుతావా?+
10 దయచేసి ఘనతా వైభవాలతో నిన్ను నువ్వు అలంకరించుకో;
మహిమను, తేజస్సును వస్త్రంలా ధరించుకో.
11 నీ ఉగ్రతను కుమ్మరించు;
ప్రతీ అహంకారిని గమనించి కిందికి దించు.
12 గర్విష్ఠులందర్నీ గమనించి, వాళ్లను అణచివేయి,
దుష్టుల్ని వాళ్లు నిల్చున్న చోటే తొక్కేసెయ్యి.
13 వాళ్లందర్నీ మట్టిలో పాతిపెట్టు;
చీకటి స్థలంలో వాళ్లను కట్టిపడెయ్యి,
14 అప్పుడు, నీ కుడిచెయ్యి నిన్ను కాపాడగలదని
నేను కూడా ఒప్పుకుంటాను.*
నిన్ను చేసినట్టే నేను దాన్నీ చేశాను.
ఎద్దులా అది గడ్డి తింటుంది.
16 దాని తుంట్లలో ఉన్న బలాన్ని,
దాని కడుపు కండరాల్లో ఉన్న శక్తిని చూడు!
17 అది దేవదారు కొమ్మలా దాని తోకను వంచుతుంది;
దాని తొడ నరాలు అల్లుకుపోయి ఉంటాయి.
18 దాని ఎముకలు రాగి గొట్టాలు;
దాని కాళ్లు ఇనుప* కడ్డీలు.
19 దేవుడు చేసిన వాటిలో అది మొదటి స్థానంలో ఉంది;*
దాని సృష్టికర్త మాత్రమే ఖడ్గంతో దాని దగ్గరికి వెళ్లగలడు.
20 పర్వతాలు దానికోసం ఆహారం పండిస్తాయి,
అక్కడ అడవి జంతువులన్నీ ఆడుకుంటాయి.
21 అది తామర మొక్కల కింద పడుకుంటుంది,
చిత్తడినేలలో జమ్ముగడ్డి మధ్య విశ్రమిస్తుంది.
22 తామర మొక్కలు దానికి నీడనిస్తాయి,
లోయలోని* నిరవంజి చెట్లు దాని చుట్టూ ఉంటాయి.
23 నది ఉధృతంగా ప్రవహించినా అది భయపడదు.
యొర్దాను నది+ ఉప్పొంగి, దానిమీద విరుచుకుపడినా అది బెదరదు.
24 అది చూస్తుండగా ఎవరైనా దాన్ని పట్టుకోగలరా?
దాని ముక్కుకు కొక్కెం తగిలించగలరా?