యోబు
35 ఎలీహు ఇంకా ఇలా అన్నాడు:
3 ఎందుకంటే నువ్వు, ‘నేను నీతిగా ఉండడం వల్ల నీకేం* ఉపయోగం?
నేను పాపం చేయకుండా ఉండడం వల్ల నాకేమైనా మేలు జరిగిందా?’ అని అంటున్నావు.+
4 నేను నీకూ, నీతో ఉన్న నీ సహచరులకూ+ జవాబిస్తాను.
5 ఆకాశం వైపు తల ఎత్తి చూడు,
ఎంతో ఎత్తులో ఉన్న మేఘాల్ని గమనించు.
6 నువ్వు పాపం చేస్తే, ఆయనకేం నష్టం?+
నీ నుండి ఆయన తీసుకునేదేంటి?+
8 నీ చెడుతనం వల్ల నీలాంటి మనుషులకే నష్టం,
నీ నీతి వల్ల మనుషులకే ప్రయోజనం.
10 కానీ, ‘దేవుడు ఎక్కడ? నా మహాగొప్ప రూపకర్త ఎక్కడ?+
రాత్రివేళ పాటలు పాడేలా చేసే దేవుడు+ ఎక్కడ?’ అని ఎవ్వరూ అనరు.
11 ఆయన, జంతువుల కన్నా మనకే ఎక్కువ బోధిస్తున్నాడు;+
ఆకాశపక్షుల కన్నా మనకే ఎక్కువ తెలివిని ఇస్తున్నాడు.
14 అలాంటప్పుడు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదని అంటున్న+ నీ మొరను ఎలా వింటాడు?
నీ వ్యాజ్యం ఆయన ముందు ఉంది, కాబట్టి నువ్వు ఆత్రంగా ఆయన కోసం వేచివుండాలి.+
16 యోబు వ్యర్థంగా తన నోరు పెద్దగా తెరుస్తున్నాడు;
జ్ఞానం లేకుండా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు.”+