కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • దావీదు నోబులో సముఖపు రొట్టెలు తినడం (1-9)

      • దావీదు గాతులో పిచ్చివాడిలా నటించడం (10-15)

1 సమూయేలు 21:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:9, 19
  • +1స 18:13

1 సమూయేలు 21:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:30; లేవీ 24:5, 9; మత్త 12:3, 4
  • +నిర్గ 19:15; లేవీ 15:16; 2స 11:11

1 సమూయేలు 21:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 15:18

1 సమూయేలు 21:6

అధస్సూచీలు

  • *

    లేదా “సన్నిధి రొట్టెలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 24:7-9; మార్కు 2:25, 26; లూకా 6:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యేసే మార్గం, పేజీ 76

    కావలికోట,

    3/15/2005, పేజీ 30

    9/1/2002, పేజీ 18

1 సమూయేలు 21:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:9; కీర్త 52:పైవిలాసం
  • +ఆది 36:1

1 సమూయేలు 21:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:2, 50
  • +1స 17:51, 54
  • +నిర్గ 28:6

1 సమూయేలు 21:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 27:1
  • +యెహో 11:22; 1స 5:8; 17:4; 27:2; కీర్త 56:పైవిలాసం

1 సమూయేలు 21:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:6-8; 29:4, 5

1 సమూయేలు 21:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 56:3, 6

1 సమూయేలు 21:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:పైవిలాసం

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2024, పేజీలు 2-3

    కావలికోట,

    3/15/2005, పేజీ 24

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 21:11స 22:9, 19
1 సమూ. 21:11స 18:13
1 సమూ. 21:4నిర్గ 25:30; లేవీ 24:5, 9; మత్త 12:3, 4
1 సమూ. 21:4నిర్గ 19:15; లేవీ 15:16; 2స 11:11
1 సమూ. 21:5లేవీ 15:18
1 సమూ. 21:6లేవీ 24:7-9; మార్కు 2:25, 26; లూకా 6:3, 4
1 సమూ. 21:71స 22:9; కీర్త 52:పైవిలాసం
1 సమూ. 21:7ఆది 36:1
1 సమూ. 21:91స 17:2, 50
1 సమూ. 21:91స 17:51, 54
1 సమూ. 21:9నిర్గ 28:6
1 సమూ. 21:101స 27:1
1 సమూ. 21:10యెహో 11:22; 1స 5:8; 17:4; 27:2; కీర్త 56:పైవిలాసం
1 సమూ. 21:111స 18:6-8; 29:4, 5
1 సమూ. 21:12కీర్త 56:3, 6
1 సమూ. 21:13కీర్త 34:పైవిలాసం
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 21:1-15

సమూయేలు మొదటి గ్రంథం

21 తర్వాత దావీదు నోబులో+ ఉన్న యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదును కలిసినప్పుడు భయంతో వణకడం మొదలుపెట్టాడు. అతను దావీదును, “నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి? నీతో ఎవరూ లేరేంటి?”+ అని అడిగాడు. 2 అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో ఇలా అన్నాడు: “రాజు ఒక పని చేయమని నన్ను ఆదేశించాడు. కానీ అతను నాతో, ‘నేను నిన్ను పంపిస్తున్న పని గురించి, నేను నీకు ఇచ్చిన ఆదేశాల గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు’ అన్నాడు. ఫలానా స్థలంలో కలుసుకోవాలని నా మనుషులతో ముందే ఏర్పాటు చేసుకున్నాను. 3 ఇప్పుడు నీ దగ్గర ఐదు రొట్టెలు ఉంటే వాటిని నాకు ఇవ్వు, లేదా ఏది ఉంటే అది ఇవ్వు.” 4 కానీ యాజకుడు దావీదుతో ఇలా అన్నాడు: “నా దగ్గర మామూలు రొట్టెలు లేవు. పవిత్రమైన రొట్టెలు+ మాత్రమే ఉన్నాయి. అయితే నీ మనుషులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వాటిని తినొచ్చు.”+ 5 అప్పుడు దావీదు ఆ యాజకునితో, “నేను అంతకుముందు యుద్ధాలకు వెళ్లినప్పుడు మేము స్త్రీలకు దూరంగా ఉన్నట్టే, ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా వాళ్లకు దూరంగా ఉన్నాం.+ మామూలు పనిమీద ఉన్నప్పుడే నా మనుషుల శరీరాలు పవిత్రంగా ఉన్నాయంటే ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉండాలి!” అన్నాడు. 6 దాంతో యాజకుడు అతనికి పవిత్రమైన రొట్టెల్ని ఇచ్చాడు.+ ఎందుకంటే అప్పుడు సముఖపు రొట్టెలు* తప్ప వేరే రొట్టెలు లేవు. వాటిని ఆ రోజే యెహోవా సన్నిధి నుండి తీసేసి తాజా రొట్టెలు పెట్టారు.

7 ఆ రోజు అక్కడ సౌలు సేవకుల్లో ఒకతను యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. అతని పేరు దోయేగు.+ అతను ఎదోమీయుడు,+ సౌలు కాపరులకు ప్రధానుడు.

8 తర్వాత దావీదు అహీమెలెకుతో, “ఇక్కడ నీ దగ్గర ఈటె గానీ, కత్తి గానీ ఉందా? రాజు పని అత్యవసరమైనది కాబట్టి నా వెంట నా కత్తి గానీ ఆయుధాలు గానీ తెచ్చుకోలేదు” అన్నాడు. 9 అందుకు యాజకుడు, “నువ్వు ఏలా లోయలో+ చంపిన ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తి+ ఇక్కడ ఉంది. అది గుడ్డలో చుట్టబడి ఏఫోదు+ వెనక ఉంది. నీకు కావాలనుకుంటే అది తీసుకో. ఇక్కడ అదొక్కటే ఉంది, దాన్ని తీసుకో” అన్నాడు. అప్పుడు దావీదు, “అలాంటిది మరొకటి లేదు. దాన్ని నాకు ఇవ్వు” అన్నాడు.

10 ఆ రోజు దావీదు లేచి మళ్లీ సౌలు నుండి పారిపోతూ+ చివరికి గాతులోని+ ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడు. 11 ఆకీషు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇతను ఆ దేశ రాజు దావీదు కాదా?

‘సౌలు వెయ్యిమంది శత్రువుల్ని చంపాడు,

దావీదు పదివేలమంది శత్రువుల్ని చంపాడు’

అని వాళ్లు నాట్యం చేస్తూ పాడింది ఇతని గురించి కాదా?”+

12 వాళ్లు అన్న మాటల గురించి దావీదు ఆలోచించినప్పుడు అతను గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.+ 13 దాంతో అతను వాళ్లముందు మతిస్థిమితం లేనివాడిలా నటిస్తూ+ వాళ్లమధ్య ఉన్నప్పుడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు. అతను ద్వారం తలుపుల మీద గీతలు గీస్తూ, తన గడ్డం మీదికి ఉమ్ము కారుస్తూ ఉన్నాడు. 14 చివరికి, ఆకీషు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీరు చూశారు కదా, ఇతను పిచ్చివాడు! ఇతన్ని ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చారు? 15 నా దగ్గర పిచ్చివాళ్లు తక్కువయ్యారని ఇంకో పిచ్చివాణ్ణి తీసుకొచ్చారా? ఇతను అసలు నా ఇంట్లోకి రావచ్చా?”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి