కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం. గీతం.
68 దేవుడు లేవాలి, ఆయన శత్రువులు చెల్లాచెదురవ్వాలి,
ఆయన్ని ద్వేషించేవాళ్లు ఆయన ఎదుట నుండి పారిపోవాలి.+
2 గాలి పొగను చెదరగొట్టినట్టు నువ్వు వాళ్లను చెదరగొట్టాలి;
అగ్నికి మైనం కరిగినట్టు, దుష్టులు దేవుని ఎదుట నాశనమవ్వాలి.+
3 కానీ నీతిమంతులు ఉల్లసించాలి,+
వాళ్లు దేవుని ముందు ఎక్కువగా సంతోషించాలి;
వాళ్లు సంతోషిస్తూ ఉల్లసించాలి.
4 దేవునికి పాటలు పాడండి; ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి.*+
ఎడారి మైదానాల గుండా* స్వారీ చేస్తున్న దేవునికి పాట పాడండి.
యెహోవా* ఆయన పేరు!+ ఆయన ముందు సంతోషించండి!
6 ఒంటరివాళ్లు నివసించడానికి దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు;+
బందీలను విడిపించి, వాళ్లు వర్ధిల్లేలా చేస్తాడు.+
కానీ మొండివాళ్లు* ఎండిన దేశంలో జీవించాలి.+
8 భూమి కంపించింది;+
దేవుని ఎదుట ఆకాశం వర్షాన్ని కురిపించింది;
దేవుని ఎదుట, ఇశ్రాయేలు దేవుని ఎదుట ఈ సీనాయి పర్వతం కంపించింది.+
9 దేవా, నువ్వు విస్తారంగా వర్షం కురిపించావు;
అలసిపోయిన నీ ప్రజలకు* నూతనోత్తేజాన్ని ఇచ్చావు.
10 వాళ్లు డేరాలున్న నీ పాలెంలో నివసించారు;+
దేవా, నీ మంచితనంతో పేదవాళ్ల అవసరాలు తీర్చావు.
12 సైన్యాలున్న రాజులు పారిపోతారు,+ వాళ్లు పారిపోతారు!
ఇంటిపట్టున ఉండే స్త్రీ దోపుడుసొమ్ము పంచుకుంటుంది.+
13 మీరు చలిమంటల* మధ్య పడుకొనివున్నా,
వెండి రెక్కలు, మేలిమి* బంగారు ఈకలు ఉన్న పావురాలు
అక్కడ మీకు దొరుకుతాయి.
16 శిఖరాలున్న పర్వతాల్లారా,
దేవుడు తన నివాసంగా ఎంచుకున్న* పర్వతాన్ని+ చూసి మీరెందుకు ఈర్ష్య పడుతున్నారు?
నిజంగా, యెహోవా ఎప్పటికీ అక్కడ నివసిస్తాడు.+
17 దేవుని యుద్ధ రథాలు వేలల్లో, లక్షల్లో ఉన్నాయి.+
యెహోవా సీనాయి పర్వతం నుండి పవిత్ర స్థలంలోకి వచ్చాడు.+
బందీల్ని తీసుకెళ్లావు;
మనుషుల్ని కానుకలుగా తీసుకెళ్లావు,+
అవును, యెహోవా* దేవా, నువ్వు వాళ్ల మధ్య నివసించడానికి మొండివాళ్లను కూడా తీసుకెళ్లావు.+
19 ప్రతీరోజు మన భారాలు మోస్తున్న+
మన రక్షకుడూ సత్యదేవుడూ అయిన యెహోవా స్తుతించబడాలి. (సెలా)
21 దేవుడు తన శత్రువుల తలల్ని,
అంటే తప్పు చేస్తూ ఉండేవాళ్ల తలల్ని చితగ్గొడతాడు.+
22 యెహోవా ఇలా అన్నాడు: “నేను వాళ్లను బాషాను+ నుండి వెనక్కి రప్పిస్తాను;
సముద్ర లోతుల్లో నుండి వాళ్లను తిరిగి రప్పిస్తాను,
23 అప్పుడు మీ పాదాలు మీ శత్రువుల రక్తంతో తడుస్తాయి,+
మీ కుక్కలు వాళ్ల రక్తాన్ని నాకుతాయి.”
24 దేవా, ప్రజలు నీ ఊరేగింపుల్ని,
పవిత్ర స్థలంలోకి వెళ్తున్న నా రాజైన దేవుని ఊరేగింపుల్ని చూస్తారు.+
25 గాయకులు ముందు నడుస్తారు, సంగీతకారులు తంతివాద్యాలు వాయిస్తూ వాళ్ల వెనక నడుస్తారు;+
27 అక్కడ అందరికన్నా చిన్నవాడైన బెన్యామీను+ వాళ్లను జయిస్తున్నాడు,
యూదా అధిపతులు కేకలు వేస్తున్న తమ గుంపుతో జయిస్తున్నారు,
జెబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు కూడా జయిస్తున్నారు.
28 నువ్వు బలవంతుడిగా ఉంటావని నీ దేవుడు ఆదేశించాడు.
మా తరఫున చర్య తీసుకున్న దేవా,+ నీ బలాన్ని చూపించు.
30 ప్రజలు వెండి రూకలు తీసుకొస్తూ వంగి నమస్కారం చేసేవరకు
జమ్ముగడ్డి మధ్య ఉండే అడవి మృగాల్ని గద్దించు,
ఎద్దుల,+ దూడల గుంపును గద్దించు.
అయితే యుద్ధాన్ని ఇష్టపడే ప్రజల్ని ఆయన చెదరగొడతాడు.
33 ప్రాచీనకాలం నుండి ఆకాశ మహాకాశాల మీద స్వారీ చేస్తున్న దేవునికి+ పాట పాడండి.
ఆయన తన స్వరంతో, బలమైన స్వరంతో గర్జిస్తున్నాడు.
34 దేవుని శక్తిని గుర్తించండి.+
ఆయన వైభవం ఇశ్రాయేలు మీద,
ఆయన శక్తి ఆకాశంలో* ఉన్నాయి.
35 తన* మహిమాన్విత పవిత్రమైన స్థలం నుండి దేవుడు సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాడు.+
ఆయనే ఇశ్రాయేలు దేవుడు,
ఆయన తన ప్రజలకు బలాన్ని, శక్తిని ఇస్తాడు.+
దేవుణ్ణి స్తుతించండి.