కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; షెమినీతు* స్వరంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం.
12 యెహోవా, నన్ను రక్షించు.
ఎందుకంటే విశ్వసనీయులు లేకుండా పోయారు;
మనుషుల్లో నమ్మకమైనవాళ్లు కనుమరుగయ్యారు.
2 వాళ్లు ఒకరితో ఒకరు అబద్ధాలాడతారు;
3 పొగిడే పెదాలన్నిటినీ,
అతిగా గొప్పలు చెప్పుకునే నాలుకను యెహోవా కోసేస్తాడు;+
4 వాళ్లు ఇలా అంటారు: “మా నాలుకలతో మేము గెలుస్తాం.
మా పెదాలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాం;
మాకు యజమానిగా ఉండేదెవరు?”+
5 యెహోవా ఇలా అంటున్నాడు: “బాధితులు అణచివేయబడుతున్నారు,
పేదవాళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.+
కాబట్టి, నేను చర్య తీసుకోవడానికి లేస్తాను.
వాళ్లను నీచంగా చూసేవాళ్ల నుండి వాళ్లను రక్షిస్తాను.”
6 యెహోవా మాటలు స్వచ్ఛమైనవి;+
అవి మట్టి కొలిమిలో* శుద్ధిచేయబడి, ఏడుసార్లు శుభ్రం చేయబడిన వెండి లాంటివి.
7 యెహోవా, నువ్వు బాధితుల్ని, నిస్సహాయుల్ని రక్షిస్తావు;+
వాళ్లలో ప్రతీ ఒక్కర్ని ఈ తరంవాళ్ల నుండి శాశ్వతంగా కాపాడతావు.
8 మనుషులు నీచ ప్రవర్తనను ప్రోత్సహించడం వల్ల
దుష్టులు అడ్డూ అదుపూ లేకుండా తిరుగుతున్నారు.+