కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఎవరి పాపాలకు వాళ్లే బాధ్యులు (1-32)

        • ఏ వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు (4)

        • తండ్రి దోషాన్ని కుమారుడు భరించడు (19, 20)

        • దుష్టుడు చనిపోవడం వల్ల సంతోషం కలగదు (23)

        • పశ్చాత్తాపపడితే బ్రతికేవుంటారు (27, 28)

యెహెజ్కేలు 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:29, 30

యెహెజ్కేలు 18:4

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    లేదా “ఏ ప్రాణి.” పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1997, పేజీ 19

యెహెజ్కేలు 18:6

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:2; యిర్మీ 3:6
  • +లేవీ 20:10
  • +లేవీ 18:19; 20:18

యెహెజ్కేలు 18:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 14:21
  • +ద్వితీ 24:12, 13
  • +లేవీ 6:2, 4
  • +ద్వితీ 15:11
  • +యెష 58:6, 7; యాకో 2:15, 16

యెహెజ్కేలు 18:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:25; లూకా 6:34, 35
  • +లేవీ 19:35
  • +లేవీ 19:15; 25:14; ద్వితీ 1:16

యెహెజ్కేలు 18:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:5

యెహెజ్కేలు 18:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:13
  • +ఆది 9:6; నిర్గ 21:12

యెహెజ్కేలు 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 15:7, 8
  • +లేవీ 26:30
  • +2రా 21:11

యెహెజ్కేలు 18:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 22:12

యెహెజ్కేలు 18:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 10:5

యెహెజ్కేలు 18:20

అధస్సూచీలు

  • *

    లేదా “ఏ ప్రాణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 24:16; యిర్మీ 31:30
  • +యెష 3:10, 11; గల 6:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2010, పేజీలు 28-29

    10/1/1997, పేజీ 19

యెహెజ్కేలు 18:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 55:7; యెహె 33:12, 19; అపొ 3:19

యెహెజ్కేలు 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 33:12, 13; యెష 43:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    6/8/1995, పేజీ 15

యెహెజ్కేలు 18:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 3:33; 1తి 2:3, 4; 2పే 3:9
  • +మీకా 7:18

యెహెజ్కేలు 18:24

అధస్సూచీలు

  • *

    లేదా “అన్యాయం చేస్తే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 33:12, 18; హెబ్రీ 10:38; 2యో 8
  • +సామె 21:16; యెహె 3:20

యెహెజ్కేలు 18:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 35:2; సామె 19:3
  • +ద్వితీ 32:4
  • +యెష 55:9; యిర్మీ 2:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2010, పేజీలు 3-4

యెహెజ్కేలు 18:27

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 55:7; 1తి 4:16

యెహెజ్కేలు 18:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 18:25; కీర్త 145:17; యెష 40:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీలు 11-12

యెహెజ్కేలు 18:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 34:11; రోమా 2:6

యెహెజ్కేలు 18:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:14; యెష 1:16
  • +కీర్త 51:10; యిర్మీ 32:39; యెహె 11:19; ఎఫె 4:23, 24
  • +ద్వితీ 30:15; సామె 8:36; అపొ 13:46

యెహెజ్కేలు 18:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:11; విలా 3:33; యెహె 33:11; లూకా 15:10; 2పే 3:9
  • +ద్వితీ 30:16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 18:2యిర్మీ 31:29, 30
యెహె. 18:6ద్వితీ 12:2; యిర్మీ 3:6
యెహె. 18:6లేవీ 20:10
యెహె. 18:6లేవీ 18:19; 20:18
యెహె. 18:7సామె 14:21
యెహె. 18:7ద్వితీ 24:12, 13
యెహె. 18:7లేవీ 6:2, 4
యెహె. 18:7ద్వితీ 15:11
యెహె. 18:7యెష 58:6, 7; యాకో 2:15, 16
యెహె. 18:8నిర్గ 22:25; లూకా 6:34, 35
యెహె. 18:8లేవీ 19:35
యెహె. 18:8లేవీ 19:15; 25:14; ద్వితీ 1:16
యెహె. 18:9లేవీ 18:5
యెహె. 18:10లేవీ 19:13
యెహె. 18:10ఆది 9:6; నిర్గ 21:12
యెహె. 18:12ద్వితీ 15:7, 8
యెహె. 18:12లేవీ 26:30
యెహె. 18:122రా 21:11
యెహె. 18:13యెహె 22:12
యెహె. 18:19రోమా 10:5
యెహె. 18:20ద్వితీ 24:16; యిర్మీ 31:30
యెహె. 18:20యెష 3:10, 11; గల 6:7
యెహె. 18:21యెష 55:7; యెహె 33:12, 19; అపొ 3:19
యెహె. 18:222ది 33:12, 13; యెష 43:25
యెహె. 18:23విలా 3:33; 1తి 2:3, 4; 2పే 3:9
యెహె. 18:23మీకా 7:18
యెహె. 18:24యెహె 33:12, 18; హెబ్రీ 10:38; 2యో 8
యెహె. 18:24సామె 21:16; యెహె 3:20
యెహె. 18:25యోబు 35:2; సామె 19:3
యెహె. 18:25ద్వితీ 32:4
యెహె. 18:25యెష 55:9; యిర్మీ 2:17
యెహె. 18:27యెష 55:7; 1తి 4:16
యెహె. 18:29ఆది 18:25; కీర్త 145:17; యెష 40:14
యెహె. 18:30యోబు 34:11; రోమా 2:6
యెహె. 18:31కీర్త 34:14; యెష 1:16
యెహె. 18:31కీర్త 51:10; యిర్మీ 32:39; యెహె 11:19; ఎఫె 4:23, 24
యెహె. 18:31ద్వితీ 30:15; సామె 8:36; అపొ 13:46
యెహె. 18:32యిర్మీ 29:11; విలా 3:33; యెహె 33:11; లూకా 15:10; 2పే 3:9
యెహె. 18:32ద్వితీ 30:16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 18:1-32

యెహెజ్కేలు

18 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “ ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్లు పులిశాయి’ అని మీరు ఇశ్రాయేలు దేశంలో చెప్పుకుంటున్న సామెతకు+ అర్థం ఏమిటి?

3 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నా జీవం తోడు, ఇకమీదట మీరు ఇశ్రాయేలులో ఈ సామెత చెప్పుకోరు. 4 ఇదిగో! ప్రాణులందరూ* నా వశంలో ఉన్నారు. తండ్రులు, కుమారులు అందరూ నా వశంలో ఉన్నారు. ఏ వ్యక్తి* పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు.

5 “ ‘ఒక వ్యక్తి నీతిమంతుడై ఉండి న్యాయంగా, సరిగ్గా నడుచుకుంటున్నాడని అనుకోండి. 6 అతను పర్వతాల మీద విగ్రహాలకు+ అర్పించిన వాటిని తినడు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల* వైపు చూడడు; తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చడు,+ రుతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోడు;+ 7 ఎవరికీ కీడు చేయడు,+ అతను అప్పు తీసుకున్నవాడు తాకట్టు పెట్టినదాన్ని తిరిగిచ్చేస్తాడు;+ అతను ఎవర్నీ దోచుకోడు,+ బదులుగా ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం,+ బట్టలులేని వాళ్లకు బట్టలు ఇస్తాడు;+ 8 అతను తన డబ్బును వడ్డీకి ఇవ్వడు, దానితో లాభం సంపాదించడు,+ అతను అన్యాయం చేయడు;+ నిష్పక్షపాతంగా న్యాయం చేస్తాడు;+ 9 అతను నా శాసనాల ప్రకారం నడుచుకుంటూ, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ నమ్మకంగా ప్రవర్తిస్తాడు. అలాంటి వ్యక్తి నీతిమంతుడు, అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

10 “ ‘ఒకవేళ అతనికి ఒక కుమారుడు పుట్టి, వాడు దోచుకునేవాడు గానీ,+ హంతకుడు గానీ+ ఈ పనులన్నిట్లో ఏదైనా చేసేవాడు గానీ అయితే, 11 (అతని తండ్రి వీటిలో ఏ ఒక్కటీ చేయకపోయినా) అతను పర్వతాల మీద విగ్రహాలకు అర్పించిన వాటిని తింటాడు, తన పొరుగువాడి భార్యను అపవిత్రపరుస్తాడు, 12 అవసరంలో ఉన్నవాళ్లను, పేదవాళ్లను బాధిస్తాడు,+ దోచుకుంటాడు, తాకట్టు సొమ్మును తిరిగివ్వడు, అసహ్యమైన విగ్రహాల+ వైపు చూస్తాడు, అసహ్యమైన పనులు చేస్తాడు,+ 13 వడ్డీ వసూలు చేస్తూ లాభం సంపాదిస్తాడు;+ అప్పుడు ఆ కుమారుడు బ్రతకడు. అతను చేసిన ఈ అసహ్యమైన పనులన్నిటిని బట్టి అతను మరణశిక్ష పొందుతాడు. అతని చావుకు* అతనే బాధ్యుడు.

14 “ ‘ఒకవేళ ఒక వ్యక్తికి కుమారుడు ఉండి, అతను తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసినా, అతను అలాంటి పనులు చేయట్లేదు అనుకోండి. 15 అతను పర్వతాల మీద విగ్రహాలకు అర్పించిన వాటిని తినడు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల వైపు చూడడు; తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చడు; 16 ఎవరికీ కీడు చేయడు, తాకట్టు పెట్టినదాన్ని లాక్కోడు; ఏదీ దోచుకోడు; ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం, బట్టలులేని వాళ్లకు బట్టలు ఇస్తాడు; 17 పేదవాళ్లను అణచివేయడు; తన డబ్బును వడ్డీకి ఇవ్వడు, దానితో లాభం సంపాదించడు; అతను నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుచుకుంటాడు. అలాంటి వ్యక్తి తన తండ్రి దోషాన్ని బట్టి చనిపోడు. అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. 18 అయితే అతని తండ్రి మోసం చేస్తూ, తన సహోదరుణ్ణి దోచుకుంటూ, తన ప్రజల మధ్య చెడు చేశాడు కాబట్టి అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు.

19 “ ‘కానీ మీరు, “తండ్రి దోషాన్ని కుమారుడు ఎందుకు భరించడు?” అని అంటారు. కుమారుడు న్యాయంగా, నీతిగా నడుచుకున్నాడు; నా శాసనాలన్నీ పాటిస్తూ వాటి ప్రకారం జీవించాడు కాబట్టి అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు.+ 20 ఏ వ్యక్తి* పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు.+ తండ్రి దోషాన్ని కుమారుడు ఏమాత్రం భరించడు, కుమారుడి దోషాన్ని తండ్రి ఏమాత్రం భరించడు. నీతిమంతుడి నీతి అతనికే చెందుతుంది, దుష్టుని దుష్టత్వం అతనికే చెందుతుంది.+

21 “ ‘ఒకవేళ ఒక దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచిపెట్టి, నా శాసనాల్ని పాటిస్తూ న్యాయంగా, నీతిగా నడుచుకుంటే అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. అతను చనిపోడు.+ 22 అతను చేసిన దోషాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు.+ అతను నీతిగా నడుచుకుంటున్నందుకు ఖచ్చితంగా బ్రతికేవుంటాడు.’

23 “ ‘దుష్టుడు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషమా?’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు. ‘అతను తన మార్గాల నుండి పక్కకుమళ్లి, బ్రతకడమే నాకు ఇష్టం.’+

24 “ ‘అయితే ఒక నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి దుష్టులు చేసే అసహ్యమైన పనులన్నీ చేస్తూ చెడుగా ప్రవర్తిస్తే,* అతను బ్రతుకుతాడా? అతను చేసిన నీతికార్యాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు.+ తన అవిధేయతను బట్టి, తాను చేసిన పాపాల్ని బట్టి అతను చనిపోతాడు.+

25 “ ‘అయితే మీరు, “యెహోవా మార్గం సరిగ్గా లేదు” అని అంటారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, దయచేసి వినండి! నా మార్గం సరిగ్గా లేదా?+ మీ మార్గాలే కదా సరిగ్గా లేనిది?+

26 “ ‘నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పులు చేసి వాటివల్ల చనిపోతే, అతను చనిపోవడానికి అతని తప్పులే కారణం.

27 “ ‘అయితే దుష్టుడు తాను చేసిన దుష్టత్వాన్ని విడిచిపెట్టి న్యాయంగా, నీతిగా నడుచుకోవడం మొదలుపెడితే, అతను తన ప్రాణాన్ని* కాపాడుకుంటాడు.+ 28 అతను తాను తప్పు చేస్తున్నానని గ్రహించి, తన అపరాధాలన్నిటినీ విడిచిపెడితే ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. అతను చనిపోడు.

29 “ ‘అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు, “యెహోవా మార్గం సరిగ్గా లేదు” అని అంటారు. ఇశ్రాయేలు ఇంటివాళ్లారా! నా మార్గాలు సరిగ్గా లేవా?+ మీ మార్గాలే కదా సరిగ్గా లేనిది?’

30 “ ‘కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీలో ప్రతీ ఒక్కరికి మీ మీ మార్గాల్ని బట్టి తీర్పు తీరుస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. ‘తిరిగిరండి, మీ అపరాధాలన్నీ విడిచిపెట్టి తిరిగిరండి, అప్పుడు అవి అడ్డురాయిగా తయారై, మీ మీదికి దోషం తీసుకురాకుండా ఉంటాయి. 31 మీరు చేసిన అపరాధాలన్నీ విడిచిపెట్టి,+ కొత్త హృదయాన్ని, కొత్త మనోవైఖరిని సంపాదించుకోండి;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఎందుకు చనిపోవాలి?’+

32 “ ‘ఏ ఒక్కరైనా చనిపోవడం నాకు అస్సలు ఇష్టంలేదు,+ కాబట్టి తిరిగొచ్చి బ్రతకండి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి