కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 దినవృత్తాంతాలు 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 దినవృత్తాంతాలు విషయసూచిక

      • దావీదు ఆలయాన్ని కట్టడు (1-6)

      • రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (7-15)

      • దావీదు కృతజ్ఞతా ప్రార్థన (16-27)

1 దినవృత్తాంతాలు 17:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 1:8; 1ది 29:29
  • +1ది 14:1
  • +2స 7:1-3; 1ది 15:1; 2ది 1:4

1 దినవృత్తాంతాలు 17:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:4-7; 1ది 22:7, 8

1 దినవృత్తాంతాలు 17:5

అధస్సూచీలు

  • *

    బహుశా “ఒక డేరా స్థలం నుంచి మరోదానికి, ఒక నివాస స్థలం నుంచి మరోదానికి” అనే అర్థం ఉండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:2; సం 4:24, 25; 2స 6:17

1 దినవృత్తాంతాలు 17:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:11, 12; కీర్త 78:70, 71

1 దినవృత్తాంతాలు 17:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:6
  • +1స 25:29; కీర్త 89:20, 22
  • +1స 18:30

1 దినవృత్తాంతాలు 17:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “నువ్వు నీ పూర్వీకులతో ఉండడానికి వెళ్లాక.”

  • *

    అక్ష., “విత్తనాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:20
  • +యిర్మీ 23:5

1 దినవృత్తాంతాలు 17:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 5:5
  • +యెష 9:7; దాని 2:44

1 దినవృత్తాంతాలు 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 9:35; హెబ్రీ 1:5
  • +1ది 10:13, 14
  • +యెష 55:3

1 దినవృత్తాంతాలు 17:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:44; యోహా 1:49; 2పే 1:11
  • +యిర్మీ 33:20, 21; లూకా 1:32, 33; హెబ్రీ 1:8; ప్రక 3:21

1 దినవృత్తాంతాలు 17:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:18-20

1 దినవృత్తాంతాలు 17:17

అధస్సూచీలు

  • *

    లేదా “ఉన్నత స్థాయిలో ఉన్నవాణ్ణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 22:42; అపొ 13:34; ప్రక 22:16

1 దినవృత్తాంతాలు 17:19

అధస్సూచీలు

  • *

    లేదా “నీ హృదయానికి అంగీకారమైన విధంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:21-24

1 దినవృత్తాంతాలు 17:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:11
  • +యెష 43:10

1 దినవృత్తాంతాలు 17:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:7; కీర్త 147:20
  • +నిర్గ 19:5; కీర్త 77:15
  • +ద్వితీ 7:1; యెహో 10:42; 21:44
  • +ద్వితీ 4:34; నెహె 9:10; యెష 63:12; యెహె 20:9

1 దినవృత్తాంతాలు 17:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 12:22
  • +ఆది 17:7; ద్వితీ 7:6, 9

1 దినవృత్తాంతాలు 17:24

అధస్సూచీలు

  • *

    లేదా “నమ్మకమైనదిగా నిరూపించబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 6:33; కీర్త 72:19; మత్త 6:9; యోహా 12:28
  • +కీర్త 89:35, 36

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 దిన. 17:11రా 1:8; 1ది 29:29
1 దిన. 17:11ది 14:1
1 దిన. 17:12స 7:1-3; 1ది 15:1; 2ది 1:4
1 దిన. 17:42స 7:4-7; 1ది 22:7, 8
1 దిన. 17:5నిర్గ 40:2; సం 4:24, 25; 2స 6:17
1 దిన. 17:71స 16:11, 12; కీర్త 78:70, 71
1 దిన. 17:82స 8:6
1 దిన. 17:81స 25:29; కీర్త 89:20, 22
1 దిన. 17:81స 18:30
1 దిన. 17:111రా 8:20
1 దిన. 17:11యిర్మీ 23:5
1 దిన. 17:121రా 5:5
1 దిన. 17:12యెష 9:7; దాని 2:44
1 దిన. 17:13లూకా 9:35; హెబ్రీ 1:5
1 దిన. 17:131ది 10:13, 14
1 దిన. 17:13యెష 55:3
1 దిన. 17:14దాని 2:44; యోహా 1:49; 2పే 1:11
1 దిన. 17:14యిర్మీ 33:20, 21; లూకా 1:32, 33; హెబ్రీ 1:8; ప్రక 3:21
1 దిన. 17:162స 7:18-20
1 దిన. 17:17మత్త 22:42; అపొ 13:34; ప్రక 22:16
1 దిన. 17:192స 7:21-24
1 దిన. 17:20నిర్గ 15:11
1 దిన. 17:20యెష 43:10
1 దిన. 17:21ద్వితీ 4:7; కీర్త 147:20
1 దిన. 17:21నిర్గ 19:5; కీర్త 77:15
1 దిన. 17:21ద్వితీ 7:1; యెహో 10:42; 21:44
1 దిన. 17:21ద్వితీ 4:34; నెహె 9:10; యెష 63:12; యెహె 20:9
1 దిన. 17:221స 12:22
1 దిన. 17:22ఆది 17:7; ద్వితీ 7:6, 9
1 దిన. 17:242ది 6:33; కీర్త 72:19; మత్త 6:9; యోహా 12:28
1 దిన. 17:24కీర్త 89:35, 36
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 దినవృత్తాంతాలు 17:1-27

దినవృత్తాంతాలు మొదటి గ్రంథం

17 దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత నాతాను+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నేను ఇక్కడ దేవదారు మ్రానులతో చేసిన ఇంట్లో నివసిస్తుంటే+ యెహోవా ఒప్పంద మందసమేమో డేరాలో ఉంది.”+ 2 దానికి నాతాను, “సత్యదేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీ మనసులో ఏముంటే అది చేయి” అని దావీదుతో అన్నాడు.

3 ఆ రాత్రే దేవుని వాక్యం నాతాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 4 “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నివసించడానికి నా కోసం ఒక మందిరాన్ని కట్టేది నువ్వు కాదు.+ 5 ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఒక మందిరంలో నివసించలేదు; నేను ఒక డేరా నుండి ఇంకో డేరాకు, ఒక గుడారం నుండి ఇంకో గుడారానికి* వెళ్తూ ఉన్నాను.+ 6 నేను ఇశ్రాయేలీయులందరితో ప్రయాణించిన కాలమంతటిలో, నా ప్రజల్ని కాయడానికి నేను నియమించిన ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, ‘మీరు నా కోసం దేవదారు మ్రానులతో మందిరం ఎందుకు కట్టలేదు?’ అని ఒక్కమాటైనా అన్నానా?” ’

7 “ఇప్పుడు నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెల్ని కాసే నిన్ను పచ్చికబయళ్లలో నుండి తీసుకొచ్చి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకుణ్ణి చేశాను.+ 8 నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీకు తోడు ఉంటాను,+ నీ ఎదుట నుండి నీ శత్రువులందర్నీ నాశనం చేస్తాను;+ నేను నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు భూమ్మీదున్న గొప్పవాళ్లలో ఒకడివి అవుతావు.+ 9 నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలం నియమించి వాళ్లు అందులో స్థిరపడేలా చేస్తాను; వాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా అక్కడ నివసిస్తారు; గతంలో జరిగినట్టుగా దుష్టులు ఇక వాళ్లను అణచివేయరు. 10 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతుల్ని నియమించిన రోజు నుండి దుష్టులు వాళ్లను అణచివేస్తూ వచ్చారు. నేను నీ శత్రువులందర్నీ ఓడిస్తాను. అంతేకాదు నేను చెప్తున్నాను, ‘యెహోవా నీ కోసం ఒక రాజవంశాన్ని కడతాడు.’

11 “ ‘ “నీ రోజులు ముగిసిపోయి నువ్వు చనిపోయాక,* నీ సంతానాన్ని,* అంటే నీ కుమారుల్లో ఒకర్ని రాజును చేసి+ అతని రాజరికాన్ని స్థిరపరుస్తాను.+ 12 అతనే నా కోసం ఒక మందిరాన్ని కడతాడు,+ నేను అతని సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.+ 13 నేను అతనికి తండ్రిని అవుతాను, అతను నాకు కుమారుడు అవుతాడు.+ నీకు ముందున్న వ్యక్తి నుండి దూరం చేసినట్టు,+ అతని నుండి నా విశ్వసనీయ ప్రేమను దూరం చేయను.+ 14 అతను నా సింహాసనం మీద ఎప్పటికీ కూర్చునేలా చేస్తాను;+ అతని పరిపాలన, అతని రాజవంశం శాశ్వతంగా ఉంటాయి.” ’ ”+

15 నాతాను ఆ మాటలన్నిటినీ, ఆ దర్శనమంతటినీ దావీదుకు చెప్పాడు.

16 అప్పుడు దావీదు రాజు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలా అన్నాడు: “యెహోవా దేవా, నువ్వు నా కోసం ఇంత చేయడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఎంతటిది?+ 17 దేవా, అది చాలదన్నట్టు, నీ సేవకుని రాజవంశం సుదూర భవిష్యత్తు వరకు నిలుస్తుందని+ కూడా చెప్పావు; యెహోవా దేవా, నేను ఇంకా హెచ్చించబడాల్సిన వ్యక్తిని* అన్నట్టు నన్ను చూశావు. 18 నువ్వు నాకు ఇచ్చిన ఘనత విషయంలో నీ సేవకుడైన దావీదు నీతో ఇంకేమి అనగలడు? నీ దాసుడు నీకు బాగా తెలుసు. 19 యెహోవా, నువ్వు నీ సేవకుడి కోసం నీ ఇష్టప్రకారం* ఈ గొప్ప పనులన్నిటినీ చేసి, నీ గొప్పతనాన్ని తెలియజేసుకున్నావు.+ 20 యెహోవా, నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు,+ నువ్వు తప్ప వేరే దేవుడు లేడు;+ మా చెవులతో విన్నవన్నీ ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. 21 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా భూమ్మీద ఇంకే ప్రజలు ఉన్నారు?+ సత్యదేవుడివైన నువ్వు వాళ్లను విడిపించి నీ ప్రజలుగా చేసుకున్నావు.+ ఐగుప్తు నుండి నువ్వు విడిపించిన నీ ప్రజల ఎదుట నుండి జనాల్ని వెళ్లగొట్టి,+ ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప పనులు చేసి నీ కోసం ఒక పేరు సంపాదించుకున్నావు.+ 22 నువ్వు ఇశ్రాయేలీయుల్ని శాశ్వతంగా నీ ప్రజలుగా చేసుకున్నావు;+ యెహోవా, నువ్వు వాళ్లకు దేవుడివి అయ్యావు.+ 23 ఇప్పుడు యెహోవా, నీ సేవకుని విషయంలో, అతని రాజవంశం విషయంలో నువ్వు చేసిన వాగ్దానం శాశ్వతకాలం నమ్మదగినదిగా ఉండాలి. నువ్వు మాటిచ్చినట్టే చేయి. 24 ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నిజంగా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలు అనేలా నీ పేరు శాశ్వతంగా ఉండాలి,* అది ఎప్పటికీ హెచ్చించబడాలి;+ నీ సేవకుడైన దావీదు రాజవంశం నీ ఎదుట స్థిరపర్చబడాలి.+ 25 నా దేవా, నీ సేవకుని కోసం ఒక రాజవంశాన్ని కట్టాలనుకుంటున్నావని నువ్వే నీ సేవకునికి తెలియజేశావు. అందుకే నీ సేవకుడు నీకు ఇలా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. 26 యెహోవా, నువ్వే సత్యదేవుడివి, నువ్వు నీ సేవకుడి గురించి ఈ మంచి విషయాల్ని వాగ్దానం చేశావు. 27 కాబట్టి నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ నీ ఎదుట ఉండేలా నువ్వు దాన్ని దీవిస్తూ ఉండాలి; ఎందుకంటే యెహోవా, నువ్వే దాన్ని దీవించావు, అది ఎప్పటికీ దీవించబడినదిగా ఉంటుంది.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి