కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

న్యాయాధిపతులు విషయసూచిక

      • కనాను రాజైన యాబీను ఇశ్రాయేలీయుల్ని అణచివేయడం (1-3)

      • ప్రవక్త్రి దెబోరా, న్యాయాధిపతి బారాకు (4-16)

      • యాయేలు సైన్యాధిపతైన సీసెరాను చంపడం (17-24)

న్యాయాధిపతులు 4:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:19

న్యాయాధిపతులు 4:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “అమ్మేశాడు.”

  • *

    అక్ష., “హరోషెతు-హాగోయిము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:14; 3:8; 10:7

న్యాయాధిపతులు 4:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “అతని.”

  • *

    అక్ష., “ఇనుప రథాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:16; న్యా 1:19
  • +ద్వితీ 28:48
  • +న్యా 2:18; 3:9; కీర్త 107:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 29-30

న్యాయాధిపతులు 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:20; 2రా 22:14; లూకా 2:36; అపొ 21:8, 9

న్యాయాధిపతులు 4:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “దెబోరా ఖర్జూర చెట్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:21, 25
  • +ఆది 28:17, 19

న్యాయాధిపతులు 4:6

అధస్సూచీలు

  • *

    లేదా “కొండ మీద నీ మనుషుల్ని ఉంచు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:32
  • +హెబ్రీ 11:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2003, పేజీలు 28-29

న్యాయాధిపతులు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:40; కీర్త 83:9
  • +ద్వితీ 20:1

న్యాయాధిపతులు 4:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2005, పేజీ 25

    11/15/2003, పేజీ 29

న్యాయాధిపతులు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 4:21, 22; 5:24, 26
  • +యెహో 20:7, 9; 21:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2003, పేజీ 29

న్యాయాధిపతులు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 5:18

న్యాయాధిపతులు 4:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 24:21; న్యా 1:16; 1స 15:6
  • +సం 10:29

న్యాయాధిపతులు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 4:6

న్యాయాధిపతులు 4:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇనుప రథాల్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 5:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 29-30

    కావలికోట,

    10/1/1990, పేజీలు 22-23

న్యాయాధిపతులు 4:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 11-12

న్యాయాధిపతులు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:24; యెహో 10:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 11-12

    10/1/1990, పేజీ 23

న్యాయాధిపతులు 4:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:7

న్యాయాధిపతులు 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 4:11
  • +న్యా 5:24
  • +న్యా 4:1, 2

న్యాయాధిపతులు 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 5:25

న్యాయాధిపతులు 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 4:9; 5:26, 27

న్యాయాధిపతులు 4:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:32, 33

న్యాయాధిపతులు 4:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:24
  • +ఆది 9:25

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

న్యాయా. 4:1న్యా 2:19
న్యాయా. 4:2న్యా 2:14; 3:8; 10:7
న్యాయా. 4:3యెహో 17:16; న్యా 1:19
న్యాయా. 4:3ద్వితీ 28:48
న్యాయా. 4:3న్యా 2:18; 3:9; కీర్త 107:19
న్యాయా. 4:4నిర్గ 15:20; 2రా 22:14; లూకా 2:36; అపొ 21:8, 9
న్యాయా. 4:5యెహో 18:21, 25
న్యాయా. 4:5ఆది 28:17, 19
న్యాయా. 4:6యెహో 21:32
న్యాయా. 4:6హెబ్రీ 11:32
న్యాయా. 4:71రా 18:40; కీర్త 83:9
న్యాయా. 4:7ద్వితీ 20:1
న్యాయా. 4:9న్యా 4:21, 22; 5:24, 26
న్యాయా. 4:9యెహో 20:7, 9; 21:32
న్యాయా. 4:10న్యా 5:18
న్యాయా. 4:11సం 24:21; న్యా 1:16; 1స 15:6
న్యాయా. 4:11సం 10:29
న్యాయా. 4:12న్యా 4:6
న్యాయా. 4:13న్యా 5:20, 21
న్యాయా. 4:15నిర్గ 14:24; యెహో 10:10
న్యాయా. 4:16లేవీ 26:7
న్యాయా. 4:17న్యా 4:11
న్యాయా. 4:17న్యా 5:24
న్యాయా. 4:17న్యా 4:1, 2
న్యాయా. 4:19న్యా 5:25
న్యాయా. 4:21న్యా 4:9; 5:26, 27
న్యాయా. 4:23హెబ్రీ 11:32, 33
న్యాయా. 4:24ద్వితీ 7:24
న్యాయా. 4:24ఆది 9:25
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
న్యాయాధిపతులు 4:1-24

న్యాయాధిపతులు

4 అయితే ఏహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు.+ 2 కాబట్టి యెహోవా వాళ్లను కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు,*+ అతను హాసోరులో పరిపాలించాడు. అతని సైన్యాధిపతి సీసెరా, అతను అన్యజనుల హరోషెతు* నగరంలో నివసించేవాడు. 3 యాబీను* దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల 900 యుద్ధ రథాలు* ఉండేవి;+ అతను ఇశ్రాయేలీయుల్ని 20 సంవత్సరాల పాటు క్రూరంగా అణచివేశాడు+ కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నారు.+

4 ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తోంది, ఆమె ఒక ప్రవక్త్రి.+ 5 ఆమె ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో, రామాకు+ బేతేలుకు+ మధ్యలో తన ఖర్జూర చెట్టు* కింద కూర్చునేది. ఇశ్రాయేలీయులు దేవుని తీర్పులు తెలుసుకోవడం కోసం ఆమె దగ్గరికి వెళ్తుండేవాళ్లు. 6 ఆమె కెదెషు-నఫ్తాలి+ నుండి అబీనోయము కుమారుడైన బారాకును+ పిలిపించి అతనితో ఇలా చెప్పింది, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: ‘నువ్వు తాబోరు కొండకు బయల్దేరు;* నీతోపాటు నఫ్తాలి వాళ్లను, జెబూలూను వాళ్లను 10,000 మందిని తీసుకెళ్లు. 7 నేను యాబీను సైన్యాధిపతైన సీసెరాను, అతనితోపాటు అతని యుద్ధ రథాల్ని, అతని సైన్యాల్ని నీ దగ్గరికి కీషోను వాగుకు+ రప్పిస్తాను, అతన్ని నీ చేతికి అప్పగిస్తాను.’ ”+

8 అప్పుడు బారాకు ఆమెతో, “నువ్వూ నాతోపాటు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు నాతోపాటు రాకపోతే నేను వెళ్లను” అన్నాడు. 9 అందుకు ఆమె, “నేను తప్పకుండా నీతోపాటు వస్తాను. కానీ నువ్వు చేసే ఈ యుద్ధంవల్ల ఘనత నీకు రాదు, ఎందుకంటే యెహోవా సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు”+ అంది. అప్పుడు దెబోరా లేచి బారాకుతో కలిసి కెదెషుకు+ వెళ్లింది. 10 బారాకు జెబూలూను వాళ్లను, నఫ్తాలి వాళ్లను+ కెదెషుకు పిలిపించాడు; దాంతో 10,000 మంది అతని వెంట వెళ్లారు. దెబోరా కూడా అతనితోపాటు వెళ్లింది.

11 అదే సమయంలో, కేనీయుడైన హెబెరు ఇతర కేనీయుల+ నుండి వేరుగా ఉంటున్నాడు; కేనీయులు మోషే మామ+ అయిన హోబాబు వంశస్థులు. హెబెరు కెదెషు దగ్గరున్న జయనన్నీములో ఒక పెద్ద చెట్టు దగ్గర్లో డేరా వేసుకున్నాడు.

12 అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి వెళ్లాడని సీసెరాకు సమాచారం అందింది.+ 13 సీసెరా వెంటనే కీషోను వాగుకు+ వెళ్లడానికి తన యుద్ధ రథాలన్నిటినీ అంటే చక్రాలకు ఇనుప కత్తులుగల 900 రథాల్నీ,* అలాగే అన్యజనుల హరోషెతులో తనతోపాటు ఉన్న సైన్యాలన్నిటినీ ఒకచోట చేర్చాడు. 14 అప్పుడు దెబోరా బారాకుతో, “లే, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించేది ఈ రోజే. యెహోవా నీకు ముందుగా వెళ్తున్నాడు కదా” అంది. దాంతో బారాకు తాబోరు కొండ దిగాడు, అతని వెనక 10,000 మంది దిగారు. 15 అప్పుడు యెహోవా సీసెరాను, అతని యుద్ధ రథాలన్నిటినీ, అతని సైన్యాన్నంతటినీ బారాకు ఎదుట అయోమయంలో పడేశాడు.+ చివరికి సీసెరా తన రథం దిగి పారిపోయాడు. 16 బారాకు యుద్ధ రథాల్ని, సైన్యాన్ని అన్యజనుల హరోషెతు వరకు తరిమాడు. దాంతో సీసెరా సైన్యమంతా కత్తిచేత కూలిపోయింది; వాళ్లలో ఒక్కరు కూడా తప్పించుకోలేదు.+

17 కానీ సీసెరా, కేనీయుడైన హెబెరు+ భార్య అయిన యాయేలు+ డేరాకి పారిపోయాడు; ఎందుకంటే హాసోరు రాజైన యాబీనుకు,+ కేనీయుడైన హెబెరు ఇంటివాళ్లకు మధ్య శాంతి ఉండేది. 18 అప్పుడు యాయేలు సీసెరాను కలవడానికి బయటికి వచ్చి, “నా ప్రభూ, రా, లోపలికి రా. భయపడకు” అంది. దాంతో అతను ఆమె డేరా లోపలికి వెళ్లాడు, ఆమె అతనిమీద ఒక కంబళి కప్పింది. 19 అతను, “నాకు దాహంగా ఉంది, దయచేసి తాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వు” అని ఆమెను అడిగాడు. ఆమె పాలు ఉన్న తోలుసంచి తెరిచి అతనికి తాగడానికి ఇచ్చి,+ మళ్లీ అతని మీద కంబళి కప్పింది. 20 అతను ఆమెకు ఇలా చెప్పాడు: “డేరా ద్వారం దగ్గర నిలబడి ఉండు; ఎవరైనా వచ్చి, ‘ఇక్కడ ఎవరైనా మగ మనిషి ఉన్నాడా?’ అని అడిగితే, ‘లేడు’ అని చెప్పు.”

21 అయితే హెబెరు భార్యయైన యాయేలు ఒక డేరా మేకును, సుత్తిని తీసుకుంది. సీసెరా అలసిపోయి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆమె మెల్లగా అతని దగ్గరికి వచ్చి, మేకును అతని కణతల గుండా భూమిలోకి దిగగొట్టింది, దాంతో అతను చనిపోయాడు.+

22 బారాకు సీసెరాను వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు, యాయేలు అతన్ని కలవడానికి బయటికి వచ్చి, “నువ్వు వెదుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను, రా” అని అంది. అతను ఆమెతోపాటు లోపలికి వెళ్లినప్పుడు, సీసెరా చనిపోయి పడివుండడం చూశాడు; డేరా మేకు అతని కణతల గుండా దిగి ఉంది.

23 అలా దేవుడు ఆ రోజున ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించాడు.+ 24 ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును నాశనం చేసేంతవరకు,+ వాళ్ల చెయ్యి కనాను రాజైన యాబీనుకు వ్యతిరేకంగా అంతకంతకూ బలంగా తయారైంది.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి