కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 థెస్సలొనీకయులు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 థెస్సలొనీకయులు విషయసూచిక

      • శుభాకాంక్షలు (1, 2)

      • అంతకంతకూ ఎక్కువౌతున్న థెస్సలొనీకయుల విశ్వాసం (3-5)

      • లోబడనివాళ్ల మీద పగతీర్చుకోవడం (6-10)

      • సంఘం కోసం ప్రార్థన (11, 12)

2 థెస్సలొనీకయులు 1:1

అధస్సూచీలు

  • *

    సీల అని కూడా పిలవబడ్డాడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 1:19

2 థెస్సలొనీకయులు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 3:12; 4:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2005, పేజీ 32

2 థెస్సలొనీకయులు 1:4

అధస్సూచీలు

  • *

    లేదా “శ్రమలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 2:19
  • +1థె 1:6; 2:14; 1పే 2:21

2 థెస్సలొనీకయులు 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 14:22; రోమా 8:17; 2తి 2:12

2 థెస్సలొనీకయులు 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:19; ప్రక 6:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 33

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

2 థెస్సలొనీకయులు 1:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 8:38
  • +లూకా 17:29, 30; 1పే 1:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

    5/1/1994, పేజీలు 52-53

2 థెస్సలొనీకయులు 1:8

అధస్సూచీలు

  • *

    లేదా “పగ తీర్చుకుంటాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 33

    కావలికోట (అధ్యయన),

    9/2019, పేజీ 12

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

    5/1/1994, పేజీలు 52-53

2 థెస్సలొనీకయులు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2పే 3:7

2 థెస్సలొనీకయులు 1:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:30

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 థెస్స. 1:12కొ 1:19
2 థెస్స. 1:31థె 3:12; 4:9, 10
2 థెస్స. 1:41థె 2:19
2 థెస్స. 1:41థె 1:6; 2:14; 1పే 2:21
2 థెస్స. 1:5అపొ 14:22; రోమా 8:17; 2తి 2:12
2 థెస్స. 1:6రోమా 12:19; ప్రక 6:9, 10
2 థెస్స. 1:7మార్కు 8:38
2 థెస్స. 1:7లూకా 17:29, 30; 1పే 1:7
2 థెస్స. 1:8రోమా 2:8
2 థెస్స. 1:92పే 3:7
2 థెస్స. 1:11రోమా 8:30
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 థెస్సలొనీకయులు 1:1-12

రెండో థెస్సలొనీకయులు

1 మన తండ్రైన దేవునితో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,* తిమోతి+ రాస్తున్న ఉత్తరం.

2 తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

3 సహోదరులారా, మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. అది సరైనదే, ఎందుకంటే మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతోంది, మీ అందరికీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ కూడా పెరుగుతోంది.+ 4 అందుకే దేవుని సంఘాల్లో మేము మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాం;+ ఎందుకంటే ఎన్నో హింసలు, కష్టాలు* ఎదురైనా మీరు సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు.+ 5 ఇది దేవుని నీతిగల తీర్పుకు రుజువు. దీనివల్ల మీరు దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడతారు. నిజానికి, మీరు బాధలు అనుభవిస్తున్నది కూడా దానికోసమే.+

6 దేవుడు నీతిగలవాడు కాబట్టి మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్లను ఆయన శ్రమలపాలు చేస్తాడు.+ 7 అయితే ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. ఇది, యేసు ప్రభువు తన శక్తిమంతులైన దూతలతో పాటు పరలోకం నుండి+ మండుతున్న అగ్నిలో బయల్పర్చబడినప్పుడు+ జరుగుతుంది. 8 అప్పుడు ఆయన, దేవుడు తెలియనివాళ్ల మీదికి, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీదికి శిక్ష తీసుకొస్తాడు.*+ 9 శాశ్వత నాశనమనే శిక్ష పడడం+ వల్ల వాళ్లు ప్రభువు ఎదుట నుండి, ఆయన మహిమాన్విత శక్తి నుండి వెళ్లగొట్టబడతారు. 10 ఇది ఆయన తన పవిత్రులతో పాటు మహిమపర్చబడడానికి వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ రోజు, ఆయన మీద విశ్వాసం చూపించిన వాళ్లంతా ఆయన్ని బట్టి ఆశ్చర్యపోతారు. మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి వాళ్లలో మీరు కూడా ఉంటారు.

11 అందుకే మేము ఎప్పుడూ మీ కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు దేనికోసమైతే మిమ్మల్ని పిలిచాడో దానికి ఆయన మిమ్మల్ని అర్హులుగా ఎంచాలనీ,+ ఆయన తన శక్తితో తనకు నచ్చిన మంచి అంతటినీ చేయాలనీ, విశ్వాసంతో మీరు చేసే ప్రతీ పనిని ఆయన సంపూర్ణం చేయాలనీ ప్రార్థిస్తున్నాం. 12 అలా మీ ద్వారా మన ప్రభువైన యేసు పేరు మహిమపర్చబడాలని, మీరు ఆయన వల్ల మహిమపర్చబడాలని మా ఉద్దేశం. మన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే అపారదయ వల్లే ఆ మహిమ కలుగుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి