యెషయా
13 ఆమోజు కుమారుడైన యెషయాకు+ బబులోను గురించి దర్శనంలో వెల్లడైన ప్రకటన:+
2 “చెట్లులేని పర్వతం మీద ధ్వజాన్ని* నిలబెట్టండి.+
ప్రముఖుల ప్రవేశ ద్వారాల్లోకి రమ్మని
వాళ్లను పిలవండి, చెయ్యి ఊపండి.
3 నేను నియమించిన* వాళ్లకు ఆజ్ఞ జారీచేశాను.+
నా కోపాన్ని వ్యక్తం చేసే యోధుల్ని పిలిపించాను,
వాళ్లు గర్వంతో సంతోషిస్తున్నారు.
4 వినండి! పర్వతాల్లో సమూహ ధ్వని వినిపిస్తోంది;
అది ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్న శబ్దం!
రాజ్యాల కోలాహలం వినండి!
అది సమకూడిన దేశాల+ శబ్దం!
సైన్యాలకు అధిపతైన యెహోవా యుద్ధం కోసం సైన్యాన్ని సమకూరుస్తున్నాడు.+
సుదూర దేశం నుండి, ఆకాశం అంచు నుండి
యెహోవా తన కోపాన్ని వ్యక్తం చేసే ఆయుధాలతో పాటు వస్తున్నాడు.+
6 బిగ్గరగా ఏడ్వండి, ఎందుకంటే యెహోవా రోజు దగ్గరపడింది!
అది సర్వశక్తిమంతుడి దగ్గర నుండి నాశనంలా వస్తుంది.+
8 ప్రజలు భయాందోళనలకు గురౌతారు.+
పురిటినొప్పులు పడుతున్న స్త్రీలా
వాళ్లు నొప్పితో అల్లాడిపోతారు.
వాళ్లు భయంతో హడలిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు,
వేదనతో వాళ్ల ముఖాలు ఎర్రబడతాయి.
9 ఇదిగో! యెహోవా రోజు వస్తోంది,
దేశాన్ని చూసి ప్రజలు హడలిపోయేలా చేయడానికి,+
దేశంలో ఉన్న పాపుల్ని సమూలంగా నాశనం చేయడానికి
అది క్రూరమైన ఆగ్రహంతో, మండే కోపంతో వస్తోంది.
10 ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాశులు*+
తమ వెలుగు ఇవ్వవు;
ఉదయించినప్పుడు సూర్యుణ్ణి చీకటి కమ్ముకుంటుంది,
చంద్రుడు కూడా తన వెలుగు ఇవ్వడు.
11 భూలోకంలో ఉన్న చెడును బట్టి నేను భూమిని లెక్క అడుగుతాను,+
తమ దోషాన్ని బట్టి దుష్టుల్ని లెక్క అడుగుతాను.
అహంకారుల పొగరును నేను అంతం చేస్తాను,
క్రూర పరిపాలకుల గర్వాన్ని అణచివేస్తాను.+
13 అందుకే సైన్యాలకు అధిపతైన యెహోవా కోపాగ్ని మండే రోజున
ఆ ఆగ్రహానికి ఆకాశం వణికిపోయేలా,
భూమి కదిలి దాని స్థానం తప్పేలా చేస్తాను.+
14 వేటాడబడిన కొండజింకలా, కాపరిలేని మందలా
ప్రతీ వ్యక్తి తన సొంత ప్రజల దగ్గరికి తిరిగెళ్తాడు;
ప్రతీ వ్యక్తి తన స్వదేశానికి పారిపోతాడు.+
15 దొరికినవాళ్లు పొడవబడతారు,
పట్టుబడినవాళ్లు కత్తితో చంపబడతారు.+
16 వాళ్ల కళ్లముందే వాళ్ల పిల్లల్ని విసిరికొట్టి ముక్కలుముక్కలు చేస్తారు,+
వాళ్ల ఇళ్లను దోచుకుంటారు,
వాళ్ల భార్యల్ని చెరుపుతారు.
17 ఇదిగో, నేను వాళ్ల మీదికి మాదీయుల్ని రప్పిస్తున్నాను,+
వాళ్లు వెండిని అస్సలు లెక్కచేయరు,
బంగారాన్ని బట్టి సంతోషించరు.
19 అత్యంత మహిమగల రాజ్యమైన* బబులోను,+
కల్దీయుల సొగసూ గర్వకారణమూ అయిన బబులోను+
దేవుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రాల్లా తయారౌతుంది.+
అరబీయుల్లో ఎవరూ అక్కడ తమ డేరా వేసుకోరు,
గొర్రెల కాపరులు ఎవరూ తమ మందల్ని అక్కడ పడుకోనివ్వరు.
21 ఎడారి ప్రాణులు అక్కడ పడుకుంటాయి;
వాళ్ల ఇళ్లు గుడ్లగూబలతో నిండిపోతాయి.
22 దాని బురుజుల్లో జంతువులు అరుస్తాయి,
దాని విలాసవంతమైన భవనాల్లో నక్కలు ఊలలు వేస్తాయి.
దాని సమయం దగ్గరపడింది, దాని రోజులు పొడిగించబడవు.”+