హబక్కూకు
ఆయన నా ద్వారా ఏం చెప్తాడో చూడడానికి,
నన్ను గద్దించినప్పుడు ఏం చెప్పాలో తెలుసుకోవడానికి నేను కనిపెట్టుకొని ఉంటాను.
2 అప్పుడు యెహోవా నాకు ఇలా చెప్పాడు:
“దర్శనంలోని విషయాల్ని రాయి, పలకల మీద వాటిని స్పష్టంగా చెక్కు,+
చదివి వినిపించే వ్యక్తి సులభంగా* చదవగలిగేలా వాటిని స్పష్టంగా రాయి.+
ఒకవేళ ఆలస్యమైనా,* దానికోసం కనిపెట్టుకొని ఉండు!*+
ఎందుకంటే, అది తప్పకుండా నెరవేరుతుంది.
ఆలస్యం అవ్వదు!
4 ఇదిగో! గర్వంతో ఉప్పొంగిపోయినవాణ్ణి చూడు;
అతని హృదయంలో నిజాయితీ లేదు.
అయితే నీతిమంతుడు తన నమ్మకత్వం* వల్ల జీవిస్తాడు.+
5 నిజమే, ద్రాక్షారసం మోసకరమైనది;
అందుకే, అహంకారి తన లక్ష్యాన్ని చేరుకోలేడు.
అతను దేశాలన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటాడు,
తనకోసం ప్రజలందర్నీ పోగుచేసుకుంటూ ఉంటాడు.+
6 వాళ్లంతా అతన్ని ఎగతాళి చేస్తూ సామెతల్ని, పొడుపు కథల్ని చెప్పుకుంటారు.+
వాళ్లు ఇలా అంటారు:
‘తనదికాని దాన్ని పోగుచేసుకుంటున్న వాడికి,
తన అప్పును మరింత ఎక్కువ చేసుకుంటున్న వాడికి శ్రమ!
ఇలా ఇంకెంతకాలం?
7 నీకు అప్పిచ్చినవాళ్లు ఉన్నట్టుండి నీ మీదికి లేవరా?
వాళ్లు నిద్రలేచి నిన్ను గట్టిగా కుదిపేస్తారు.
వాళ్లు నిన్ను కొల్లగొడతారు.+
8 నువ్వు ఎన్నో దేశాల్ని కొల్లగొట్టావు కాబట్టి
మిగిలిన ప్రజలంతా నిన్ను కొల్లగొడతారు.+
ఎందుకంటే, నువ్వు మనుషుల రక్తాన్ని చిందించావు,
భూమంతటికీ, నగరాలకు, వాటి నివాసులందరికీ
దౌర్జన్యం చేశావు.+
9 విపత్తుకు చిక్కకుండా తన గూడును ఎత్తైన చోట కట్టుకోవాలని
తన ఇంటివాళ్ల* కోసం అక్రమ లాభం సంపాదించేవాడికి శ్రమ!
10 నీ కుతంత్రాల వల్ల నీ ఇంటివాళ్లకు అవమానం తీసుకొచ్చావు.
ఎన్నో దేశాల ప్రజల్ని తుడిచిపెట్టి పాపం మూటగట్టుకున్నావు.+
11 గోడలో నుండి రాయి కేకలు వేస్తుంది,
పైకప్పులో నుండి దూలం దానికి జవాబిస్తుంది.
12 రక్తపాతంతో నగరాన్ని కట్టేవాడికి శ్రమ!
దుష్టత్వంతో పట్టణాన్ని స్థాపించేవాడికి శ్రమ!
13 ప్రజలు పడిన కష్టమంతా మంటలపాలు అయ్యేది సైన్యాలకు అధిపతైన యెహోవా వల్ల కాదా?
దేశాలు పడిన ప్రయాసంతా వ్యర్థమయ్యేది ఆయన వల్ల కాదా?+
15 తన పొరుగువాళ్ల మానం చూడాలని
మద్యంలో కోపాన్ని, ఆగ్రహాన్ని కలిపి,
మత్తెక్కేదాకా వాళ్లతో తాగించేవాడికి శ్రమ!
16 నువ్వు ఘనతకు బదులు అవమానంతో నిండిపోతావు.
నువ్వు కూడా తాగి, నీ సున్నతి లేని స్థితిని బయటపెట్టుకుంటావు.*
యెహోవా కుడిచేతిలో ఉన్న గిన్నె నీ దగ్గరికి కూడా వస్తుంది,+
అవమానం నీ ఘనతను కప్పేస్తుంది.
17 లెబానోనుకు చేసిన దౌర్జన్యం నిన్ను కప్పేస్తుంది,
మృగాల్ని వణికించిన నాశనం నీ మీదికి వస్తుంది,
ఎందుకంటే, నువ్వు మనుషుల రక్తాన్ని చిందించావు,
భూమంతటికీ, నగరాలకు, వాటి నివాసులందరికీ
దౌర్జన్యం చేశావు.+
18 చెక్కిన ప్రతిమ వల్ల ఏం ప్రయోజనం?
దాన్ని చెక్కేది శిల్పే కదా!
పోత* విగ్రహం వల్ల, అబద్ధాలు బోధించేదాని వల్ల ఏం ప్రయోజనం?
ఆ వ్యర్థమైన దేవుళ్లను తయారుచేసే వ్యక్తి వాటిమీద నమ్మకం ఉంచుతాడు,
కానీ అవి కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేవు.+
19 చెక్కతో, “మేలుకో!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
మాట్లాడలేని రాయితో, “నిద్రలే! మాకు ఉపదేశమివ్వు!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
20 అయితే యెహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు.+
భూమంతా ఆయన ముందు మౌనంగా ఉండాలి!’ ”+