యోవేలు
3 “ఇదిగో! ఆ రోజుల్లో, ఆ సమయంలో
నేను యూదా, యెరూషలేము ప్రజల్ని చెరలో నుండి వెనక్కి తీసుకొచ్చినప్పుడు,+
2 సమస్త దేశాల ప్రజల్ని కూడా పోగుచేస్తాను,
వాళ్లను యెహోషాపాతు* లోయలోకి తీసుకొస్తాను.
నా ప్రజల తరఫున, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల తరఫున
వాళ్లకు అక్కడ తీర్పు తీరుస్తాను,+
ఎందుకంటే, వాళ్లు నా ప్రజల్ని దేశదేశాలకు చెదరగొట్టారు,
నా దేశాన్ని పంచుకున్నారు.+
3 నా ప్రజల కోసం వాళ్లు చీట్లు* వేసుకుంటారు;+
వేశ్యను తెచ్చుకోవడానికి పిల్లవాణ్ణి,
ద్రాక్షారసం కోసం అమ్మాయిని అమ్మేస్తారు.
4 తూరూ, సీదోనూ, సమస్త ఫిలిష్తియ ప్రాంతాల్లారా, నాతో మీకేంటి?
మీరు ఏ విషయంలోనైనా నా మీద పగ తీర్చుకుంటున్నారా?
అలాగైతే, మీరు చేసినదాన్ని నేను చాలా త్వరగా మీ తలల మీదికి రప్పిస్తాను.+
5 ఎందుకంటే మీరు నా వెండిని, బంగారాన్ని పట్టుకెళ్లారు,+
నా శ్రేష్ఠమైన సంపదల్ని మీ గుళ్లలో పెట్టుకున్నారు;
6 యూదా, యెరూషలేము ప్రజల్ని గ్రీకువాళ్లకు అమ్మేశారు,+
అలా మీరు వాళ్ల ప్రాంతం నుండి వాళ్లను దూరంగా పంపించేశారు;
7 మీరు ఎక్కడైతే వాళ్లను అమ్మేశారో అక్కడి నుండి నేను వాళ్లను తీసుకొస్తాను,+
మీరు చేసినదాన్ని మీ తలల మీదికి రప్పిస్తాను.
8 మీ కుమారుల్ని, కూతుళ్లను యూదా ప్రజలకు అమ్మేస్తాను,+
వాళ్లు దూరంలో ఉన్న షెబావాళ్లకు వాళ్లను అమ్మేస్తారు;
యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.
9 ఇతర దేశాల ప్రజల మధ్య ఇలా చాటించండి:+
‘యుద్ధానికి సిద్ధంకండి! బలవంతుల్ని పురికొల్పండి!
సైనికులంతా ముందుకుసాగి దాడిచేయాలి!+
10 మీ నాగటి నక్కుల్ని కత్తులుగా, మచ్చుకత్తుల్ని* ఈటెలుగా* సాగగొట్టండి.
బలహీనుడు, “నేను బలవంతుణ్ణి” అని అనాలి.
11 చుట్టుపక్కల దేశాల్లారా, మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకోండి, సమకూడండి!’ ”+
యెహోవా, ఆ స్థలానికి నీ బలవంతుల్ని* తీసుకురా.
12 “దేశాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి;
ఎందుకంటే, చుట్టుపక్కల దేశాలన్నిటికీ తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.+
13 పైరు పండింది, కొడవలితో కోయండి.
ద్రాక్షతొట్టి నిండిపోయింది, వచ్చి తొక్కండి.+
ద్రాక్షతొట్లు పొంగిపొర్లుతున్నాయి, ఎందుకంటే దేశాల చెడుతనం చాలా ఎక్కువగా ఉంది.
15 సూర్యుడు, చంద్రుడు చీకటైపోతాయి,
నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి.
16 యెహోవా సీయోనులో నుండి గర్జిస్తాడు,
యెరూషలేములో నుండి పెద్ద స్వరంతో మాట్లాడతాడు.
17 నేను నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్న మీ దేవుడైన యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
18 ఆ రోజు పర్వతాల మీద నుండి తియ్యని ద్రాక్షారసం కారుతుంది,+
కొండల నుండి పాలు ప్రవహిస్తాయి,
యూదా వాగులన్నిట్లో నీళ్లు పారతాయి.
19 అయితే ఐగుప్తు* నిర్మానుష్యమౌతుంది,
ఎదోము నిర్జనమైన ఎడారిగా మారుతుంది,+
ఎందుకంటే వాళ్లు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశారు,
ఆ దేశంలో అమాయకుల రక్తం చిందించారు.+
20 యూదాలో మాత్రం ఎప్పటికీ నివాసులు ఉంటారు,
యెరూషలేములో తరతరాలపాటు ప్రజలు నివసిస్తారు.+