యెషయా
8 యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఒక పెద్ద పలక+ తీసుకొని దానిమీద మామూలు కలంతో ‘మహేరు-షాలాల్-హాష్-బజ్’* అని రాయి. 2 నమ్మకమైన సాక్షులతో, అంటే యాజకుడైన ఊరియాతో,+ యెబెరెక్యా కుమారుడైన జెకర్యాతో నా కోసం దాన్ని రాతపూర్వకంగా ఖరారు చేయించు.”*
3 నేను ప్రవక్త్రితో* కలిసినప్పుడు* ఆమె గర్భవతి అయ్యి కొంతకాలానికి ఒక కుమారుణ్ణి కన్నది.+ అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “అతనికి మహేరు-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు; 4 ఎందుకంటే, ఆ అబ్బాయికి ‘నాన్నా!’ ‘అమ్మా!’ అని పిలవడం రాకముందే దమస్కు వనరులు, సమరయ దోపుడుసొమ్ము అష్షూరు రాజు ముందుకు తీసుకెళ్లబడతాయి.”+
5 యెహోవా మళ్లీ నాతో మాట్లాడి ఇలా అన్నాడు:
6 “ఈ ప్రజలు ప్రశాంతంగా పారే షిలోయా* నీళ్లను తిరస్కరించి,+
రెజీను విషయంలో, రెమల్యా కుమారుడి+ విషయంలో సంతోషిస్తున్నారు కాబట్టి,
7 ఇదిగో! యెహోవా వాళ్ల మీదికి
శక్తివంతమైన, విస్తారమైన నది* నీళ్లను,
అంటే అష్షూరు రాజును,+ అతని మహిమ అంతటినీ రప్పిస్తాడు.
అతను ఉప్పొంగి, పీకల లోతు వరకు ప్రవహిస్తాడు;+
చాపబడిన అతని రెక్కలు నీ దేశమంతటినీ కప్పుతాయి!”
9 జనాల్లారా, హాని చేయండి; కానీ మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు.
భూమి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మీరంతా వినండి!
యుద్ధానికి సిద్ధంకండి,* అయితే మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు!+
యుద్ధానికి సిద్ధంకండి, అయితే మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు!
10 పన్నాగం పన్నండి, కానీ అది భగ్నం చేయబడుతుంది!
11 యెహోవా తన బలమైన చేతిని నా మీద ఉంచి, ఈ ప్రజల మార్గాన్ని అనుసరించొద్దని నన్ను హెచ్చరించడానికి ఇలా అన్నాడు:
12 “ఈ ప్రజలు కుట్ర అని పిలిచేదాన్ని నువ్వు కుట్ర అని పిలవొద్దు!
వాళ్లు భయపడేదానికి నువ్వు భయపడొద్దు;
దాన్ని చూసి నువ్వు వణికిపోవద్దు.
13 సైన్యాలకు అధిపతైన యెహోవానే నువ్వు పవిత్రుడిగా ఎంచాలి,+
ఆయనకే నువ్వు భయపడాలి,
ఆయన్ని చూసే నువ్వు వణకాలి.”+
14 ఆయన ఒక పవిత్రమైన స్థలం అవుతాడు,
కానీ ఇశ్రాయేలు రెండు ఇళ్ల వాళ్లకు
ఆయన ఒక తగిలే రాయిగా,
తడబడేలా చేసే బండరాయిగా ఉంటాడు;+
యెరూషలేము నివాసులకు
ఒక ఉరిగా, ఉచ్చుగా ఉంటాడు.
15 చాలామంది తడబడి పడిపోతారు, గాయాలపాలౌతారు;
ఉచ్చులో చిక్కుకొని పట్టబడతారు.
17 యాకోబు ఇంటివాళ్ల నుండి తన ముఖాన్ని తిప్పుకున్న యెహోవా+ కోసం నేను ఎదురుచూస్తూ* ఉంటాను,+ ఆయన మీదే నేను ఆశపెట్టుకుంటాను.
18 ఇదిగో! నేనూ, యెహోవా నాకిచ్చిన పిల్లలూ+ సీయోను పర్వతం మీద నివసించే సైన్యాలకు అధిపతైన యెహోవా నుండి వచ్చిన సూచనలుగా,+ అద్భుతాలుగా ఇశ్రాయేలు మధ్య ఉన్నాం.
19 ఒకవేళ వాళ్లు నిన్ను, “చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్ల దగ్గర, కిచకిచలాడే-గొణిగే జ్యోతిష్యుల దగ్గర విచారణ చేయి” అని అడిగారనుకో. ఒక జనం విచారణ చేయాల్సింది తమ దేవుని దగ్గర కాదా? వాళ్లు బ్రతికున్నవాళ్ల గురించి చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేయడం సరైనదేనా?+ 20 బదులుగా వాళ్లు ధర్మశాస్త్రంలో, రాతపూర్వకంగా ఖరారు చేసినదానిలో* విచారణ చేయాలి!
వాళ్లు ఈ మాట ప్రకారం మాట్లాడనప్పుడు వాళ్లకు వెలుగు* ఉండదు.+ 21 ప్రతీ వ్యక్తి వేదనతో, ఆకలితో దేశం గుండా సంచరిస్తాడు;+ అతను ఆకలిగా, కోపంగా ఉన్నందువల్ల తన రాజును, పైకి చూసినప్పుడు తన దేవుణ్ణి శపిస్తాడు. 22 తర్వాత అతను భూమి వైపు చూసినప్పుడు విపత్తు, చీకటి, అంధకారం, కష్టకాలాలు, గాఢాంధకారం కనిపిస్తాయి, వెలుగు ఉండదు.