కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • నెహెమ్యా తీసుకొచ్చిన మరిన్ని మార్పులు (1-31)

        • పదోవంతు ఇవ్వాలి (10-13)

        • విశ్రాంతి రోజును అపవిత్రపర్చకూడదు (15-22)

        • విదేశీ స్త్రీలను పెళ్లిచేసుకోవడం తప్పు (23-28)

నెహెమ్యా 13:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:11; అపొ 15:21
  • +ద్వితీ 23:3, 6

నెహెమ్యా 13:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 23:8; 24:10

నెహెమ్యా 13:3

అధస్సూచీలు

  • *

    లేదా “మిశ్రమ సంతతి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 10:10, 11; నెహె 9:1, 2

నెహెమ్యా 13:4

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 10:37, 38
  • +నెహె 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీ 4

నెహెమ్యా 13:5

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్లో.”

  • *

    లేదా “దశమభాగాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 12:44

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీ 4

నెహెమ్యా 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 7:1; నెహె 2:1
  • +నెహె 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2006, పేజీ 11

నెహెమ్యా 13:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 4:7

నెహెమ్యా 13:9

అధస్సూచీలు

  • *

    లేదా “భోజనశాలల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:14, 15
  • +నెహె 10:39

నెహెమ్యా 13:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 10:37; 12:47
  • +మలా 3:8
  • +సం 35:2

నెహెమ్యా 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:2
  • +నెహె 10:39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీలు 4-5

నెహెమ్యా 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:21
  • +నెహె 10:38, 39; మలా 3:10

నెహెమ్యా 13:13

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తి.”

నెహెమ్యా 13:14

అధస్సూచీలు

  • *

    లేదా “సంరక్షణ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 5:19
  • +హెబ్రీ 6:10

నెహెమ్యా 13:15

అధస్సూచీలు

  • *

    లేదా “సరుకులు అమ్మవద్దని ఆ రోజున వాళ్లను హెచ్చరించాను” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:10; 34:21; 35:2
  • +యిర్మీ 17:21, 27

నెహెమ్యా 13:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 10:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2020 పేజీ 7

నెహెమ్యా 13:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:8-10

నెహెమ్యా 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:12
  • +నెహె 5:19; 13:14, 30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1996, పేజీ 16

నెహెమ్యా 13:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:2, 3
  • +ద్వితీ 23:3, 4
  • +ఎజ్రా 9:1, 2; 10:10; 2కొ 6:14

నెహెమ్యా 13:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 14

    కావలికోట,

    8/15/2013, పేజీలు 6-7

నెహెమ్యా 13:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 25:2; ఎజ్రా 7:26
  • +ద్వితీ 7:3, 4; నెహె 10:30

నెహెమ్యా 13:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 3:12, 13; 2ది 9:22
  • +2స 12:24
  • +1రా 11:1-5

నెహెమ్యా 13:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 10:2

నెహెమ్యా 13:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 3:1; 13:4
  • +నెహె 12:10
  • +నెహె 2:10; 6:14

నెహెమ్యా 13:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:15; సం 25:11-13
  • +మలా 2:4

నెహెమ్యా 13:30

అధస్సూచీలు

  • *

    లేదా “అపవిత్రత.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 23:6; 25:1

నెహెమ్యా 13:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 10:34
  • +నెహె 5:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2013, పేజీ 7

    9/15/1996, పేజీ 16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 13:1ద్వితీ 31:11; అపొ 15:21
నెహె. 13:1ద్వితీ 23:3, 6
నెహె. 13:2సం 23:8; 24:10
నెహె. 13:3ఎజ్రా 10:10, 11; నెహె 9:1, 2
నెహె. 13:4నెహె 10:37, 38
నెహె. 13:4నెహె 2:10
నెహె. 13:5నెహె 12:44
నెహె. 13:6ఎజ్రా 7:1; నెహె 2:1
నెహె. 13:6నెహె 5:14
నెహె. 13:7నెహె 4:7
నెహె. 13:9లేవీ 2:14, 15
నెహె. 13:9నెహె 10:39
నెహె. 13:10నెహె 10:37; 12:47
నెహె. 13:10మలా 3:8
నెహె. 13:10సం 35:2
నెహె. 13:11ఎజ్రా 9:2
నెహె. 13:11నెహె 10:39
నెహె. 13:12సం 18:21
నెహె. 13:12నెహె 10:38, 39; మలా 3:10
నెహె. 13:14నెహె 5:19
నెహె. 13:14హెబ్రీ 6:10
నెహె. 13:15నిర్గ 20:10; 34:21; 35:2
నెహె. 13:15యిర్మీ 17:21, 27
నెహె. 13:16నెహె 10:31
నెహె. 13:18నిర్గ 20:8-10
నెహె. 13:22ద్వితీ 5:12
నెహె. 13:22నెహె 5:19; 13:14, 30, 31
నెహె. 13:23యెహో 13:2, 3
నెహె. 13:23ద్వితీ 23:3, 4
నెహె. 13:23ఎజ్రా 9:1, 2; 10:10; 2కొ 6:14
నెహె. 13:25ద్వితీ 25:2; ఎజ్రా 7:26
నెహె. 13:25ద్వితీ 7:3, 4; నెహె 10:30
నెహె. 13:261రా 3:12, 13; 2ది 9:22
నెహె. 13:262స 12:24
నెహె. 13:261రా 11:1-5
నెహె. 13:27ఎజ్రా 10:2
నెహె. 13:28నెహె 3:1; 13:4
నెహె. 13:28నెహె 12:10
నెహె. 13:28నెహె 2:10; 6:14
నెహె. 13:29నిర్గ 40:15; సం 25:11-13
నెహె. 13:29మలా 2:4
నెహె. 13:301ది 23:6; 25:1
నెహె. 13:31నెహె 10:34
నెహె. 13:31నెహె 5:19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 13:1-31

నెహెమ్యా

13 ఆ రోజు వాళ్లు ప్రజలకు మోషే గ్రంథాన్ని చదివి వినిపించారు;+ అందులో, అమ్మోనీయులు గానీ మోయాబీయులు గానీ సత్యదేవుని సమాజంలోకి ఎప్పటికీ ప్రవేశించకూడదని+ రాసివుంది; 2 ఎందుకంటే వాళ్లు ఇశ్రాయేలీయులకు ఆహారాన్ని, నీళ్లను ఇవ్వలేదు; బదులుగా వాళ్లు ఇశ్రాయేలీయుల్ని శపించడానికి బిలాముకు డబ్బులిచ్చారు. అయితే మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు.+ 3 ప్రజలు ధర్మశాస్త్రాన్ని వినగానే, ఇశ్రాయేలీయుల్లో నుండి విదేశీయుల సంతతి* వాళ్లందర్నీ వేరుచేయడం మొదలుపెట్టారు.+

4 దీనికి ముందు, మన దేవుని మందిరపు నిల్వచేసే గదుల్ని*+ యాజకుడైన ఎల్యాషీబు చూసుకునేవాడు; అతను టోబీయాకు+ బంధువు. 5 ఎల్యాషీబు టోబీయాకు నిల్వచేసే గదుల్లో* ఒక పెద్ద గదిని ఇచ్చాడు; దానిలో అంతకుముందు ధాన్యార్పణను, సాంబ్రాణిని, పాత్రల్ని, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు చెందాల్సిన ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును,* అలాగే యాజకుల కోసం వచ్చే విరాళాన్ని ఉంచేవాళ్లు.+

6 ఆ సమయం అంతటిలో నేను యెరూషలేములో లేను. నేను బబులోను రాజైన అర్తహషస్త పరిపాలనలోని+ 32వ సంవత్సరంలో+ రాజు దగ్గరికి వెళ్లాను; కొంతకాలం తర్వాత నేను రాజును సెలవు అడిగాను. 7 తర్వాత నేను యెరూషలేముకు వచ్చినప్పుడు, ఎల్యాషీబు టోబీయా+ కోసం సత్యదేవుని మందిర ప్రాంగణంలో ఒక నిల్వచేసే గదిని ఇచ్చి ఎంత ఘోరమైన పని చేశాడో గమనించాను. 8 అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. దాంతో నేను అందులో నుండి టోబీయా సామానంతా బయట పారేశాను. 9 ఆ తర్వాత నేను ఆజ్ఞాపించడంతో వాళ్లు నిల్వచేసే గదుల్ని* శుద్ధి చేశారు; అప్పుడు నేను ధాన్యార్పణ, సాంబ్రాణిలతోపాటు+ సత్యదేవుని మందిర పాత్రల్ని+ తిరిగి అందులో పెట్టించాను.

10 అంతేకాదు, లేవీయులకు ఇవ్వాల్సిన భాగాల్ని+ వాళ్లకు ఇవ్వడంలేదని+ కూడా నేను గమనించాను; అందుకే సేవచేసే లేవీయులు, గాయకులు తమతమ పొలాలకు వెళ్లిపోయారు.+ 11 దాంతో నేను ఉప పాలకుల్ని+ మందలిస్తూ, “సత్యదేవుని మందిరం ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతోంది?”+ అని అడిగాను. తర్వాత నేను లేవీయుల్ని సమకూర్చి, మళ్లీ వాళ్లను వాళ్లవాళ్ల పనుల్లో పెట్టాను. 12 యూదా వాళ్లందరూ ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును+ నిల్వచేసే గదుల్లోకి తీసుకొచ్చారు.+ 13 తర్వాత నేను యాజకుడైన షెలెమ్యాను, శాస్త్రి* అయిన సాదోకును, లేవీయుల్లో పెదాయాను నిల్వచేసే గదుల మీద నియమించాను. మత్తన్యా మనవడూ జక్కూరు కుమారుడూ అయిన హానానును వాళ్లకు సహాయకునిగా నియమించాను. ఎందుకంటే, వీళ్లకు నమ్మకస్థులని మంచిపేరు ఉంది. తమ సహోదరులకు భాగాల్ని పంచిపెట్టాల్సిన బాధ్యత వీళ్లదే.

14 నా దేవా, ఈ విషయంలో నన్ను గుర్తుపెట్టుకో.+ నా దేవుని మందిరం విషయంలో, దాని సేవల* విషయంలో నేను విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల్ని మర్చిపోకు.+

15 ఆ రోజుల్లో యూదాలోని ప్రజలు విశ్రాంతి రోజున+ ద్రాక్షతొట్లను తొక్కడం, ధాన్యాన్ని తీసుకొచ్చి గాడిదల మీదికి ఎక్కించడం, విశ్రాంతి రోజున యెరూషలేములోకి ద్రాక్షారసం, ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు, అన్నిరకాల సరుకులు తీసుకురావడం+ నేను చూశాను. కాబట్టి ఆ రోజున సరుకులు అమ్మడం గురించి నేను వాళ్లను హెచ్చరించాను.* 16 నగరంలో నివసిస్తున్న తూరు దేశంవాళ్లు చేపల్ని, అన్నిరకాల సరుకుల్ని యెరూషలేములోకి తీసుకొచ్చి విశ్రాంతి రోజున యూదా ప్రజలకు అమ్ముతున్నారు.+ 17 అందుకే నేను యూదాలోని ప్రముఖుల్ని మందలిస్తూ ఇలా అన్నాను: “మీరు చేస్తున్న ఈ చెడ్డపని ఏమిటి? మీరు విశ్రాంతి రోజును అపవిత్రం చేశారు. 18 మీ పూర్వీకులు కూడా ఇలాగే చేశారు. అందుకే మన దేవుడు ఈ విపత్తునంతా మన మీదికి, ఈ నగరం మీదికి తీసుకొచ్చాడు. విశ్రాంతి రోజును అపవిత్రం చేసి+ ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయుల మీదికి ఇంకా తీవ్రమైన కోపాన్ని రప్పిస్తున్నారు.”

19 చీకటి పడకముందే, అంటే విశ్రాంతి రోజు మొదలవకముందే యెరూషలేము ద్వారాలు మూసేయమని నేను ఆజ్ఞాపించాను. అంతేకాదు విశ్రాంతి రోజు ముగిసేవరకు ద్వారాలు తెరవకూడదని చెప్పాను. విశ్రాంతి రోజున ఎలాంటి సరుకూ లోపలికి రాకుండా నా సేవకుల్లో కొంతమందిని ద్వారాల దగ్గర ఉంచాను. 20 కాబట్టి వర్తకులు, అన్నిరకాల సరుకులు అమ్మేవాళ్లు ఒకట్రెండుసార్లు రాత్రిపూట యెరూషలేము బయటే గడిపారు. 21 అప్పుడు నేను వాళ్లను హెచ్చరిస్తూ, “మీరు ఎందుకు రాత్రంతా ప్రాకారం ముందు బస చేస్తున్నారు? మీరు మళ్లీ ఇలా చేస్తే మిమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుండి పంపించేస్తాను” అన్నాను. ఇక అప్పటినుండి వాళ్లు విశ్రాంతి రోజున రాలేదు.

22 లేవీయులు తమను తాము క్రమంగా శుద్ధి చేసుకోవాలని, విశ్రాంతి రోజును పవిత్రంగా ఉంచడం+ కోసం వచ్చి ద్వారాల్ని కాపలా కాయాలని వాళ్లకు చెప్పాను. నా దేవా, నా విషయంలో దీన్ని కూడా గుర్తుంచుకొని, నీ విస్తారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి నా మీద జాలి చూపించు.+

23 ఆ రోజుల్లో అష్డోదు,+ అమ్మోను, మోయాబు+ స్త్రీలను పెళ్లి చేసుకున్న యూదుల్ని+ కూడా చూశాను. 24 వాళ్ల కుమారుల్లో సగంమంది అష్డోదీయుల భాషను, సగంమంది వేర్వేరు జనాల భాషల్ని మాట్లాడుతున్నారు, కానీ వాళ్లలో ఎవ్వరికీ యూదుల భాష రాదు. 25 కాబట్టి నేను వాళ్లను మందలించి, గట్టిగా హెచ్చరించాను. నేను కొంతమంది పురుషుల్ని కొట్టి,+ వాళ్ల తలవెంట్రుకలు పీకి, వాళ్లతో దేవుని పేరున ఒట్టు వేయించాను. వాళ్లతో ఇలా అన్నాను: “మీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకూడదు, వాళ్ల కూతుళ్లలో ఎవ్వర్నీ మీ కుమారుల కోసం గానీ మీ కోసం గానీ తీసుకోకూడదు.+ 26 ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేసింది దానివల్లే కదా? దేశదేశాల్లో అతనిలాంటి రాజు ఎక్కడా లేడు;+ అతని దేవుడు అతన్ని ప్రేమించాడు,+ అందుకే ఆయన సొలొమోనును ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా నియమించాడు. చివరికి అతనితో కూడా విదేశీ భార్యలు పాపం చేయించారు.+ 27 ఇప్పుడు మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకొని మన దేవునికి నమ్మకద్రోహం చేయడం ఎంత ఘోరమైన విషయం?”+

28 ప్రధానయాజకుడైన ఎల్యాషీబు+ కుమారుడైన యోయాదా+ కుమారుల్లో ఒకతను హోరోనీయుడైన సన్బల్లటు+ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతన్ని నా దగ్గర నుండి తరిమేశాను.

29 నా దేవా, వాళ్లను గుర్తుంచుకో. ఎందుకంటే వాళ్లు యాజకత్వాన్ని,+ యాజకులతో, లేవీయులతో చేయబడిన ఒప్పందాన్ని+ అపవిత్రపర్చారు.

30 నేను విదేశీయుల ప్రభావం* అంతటి నుండి వాళ్లను శుద్ధి చేశాను; యాజకుల్ని, లేవీయుల్ని వాళ్లవాళ్ల సేవల్లో నియమించాను;+ 31 నియమిత సమయాల్లో కలపను, ప్రథమఫలాల్ని అందించే ఏర్పాటు చేశాను.+

నా దేవా, నన్ను గుర్తుపెట్టుకొని ఆశీర్వదించు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి