యెషయా
2 అది సముద్రం మీద ప్రతినిధుల్ని పంపుతుంది,
నీళ్ల మీద జమ్ము* పడవల్లో వాళ్లను పంపుతూ ఇలా చెప్తుంది:
“వేగంగా వెళ్లే సందేశకులారా,
నున్నని చర్మంగల ఎత్తైన మనుషులుండే దేశానికి,
అన్ని ప్రాంతాల ప్రజలు భయపడే జనం దగ్గరికి,+
జయిస్తూ వెళ్లే బలమైన దేశం దగ్గరికి,
నదుల వల్ల నేల కొట్టుకుపోయిన దేశం దగ్గరికి మీరు వెళ్లండి.”
3 దేశ నివాసులారా, భూమ్మీద నివసించే ప్రజలారా,
మీరు చూసేది, పర్వతాల మీద నిలబెట్టిన ధ్వజంలా* ఉంటుంది,
బూర* శబ్దం లాంటి ధ్వని మీకు వినిపిస్తుంది.
4 ఎందుకంటే యెహోవా నాతో ఇలా చెప్పాడు:
“పగలు సూర్యకాంతిలో వెచ్చగా ఉన్నట్టు,
వేడిగా ఉండే కోతకాలంలో మంచు పడినట్టు,
నేను ప్రశాంతంగా ఉండి, స్థాపించబడిన నా స్థలాన్ని* చూస్తాను.
5 ఎందుకంటే కోతకాలం రాకముందే,
పూత వాడిపోయి ద్రాక్షకాయలు పక్వం అవుతుండగానే,
కత్తెరలతో కొమ్మల్ని కత్తిరించేస్తారు,
నులితీగల్ని తుంచేసి పారేస్తారు.
6 అవన్నీ పర్వతాల్లోని వేట పక్షుల కోసం,
భూమ్మీది మృగాల కోసం వదిలేయబడతాయి.
వేట పక్షులు వాటితో వేసవికాలాన్ని గడిపేస్తాయి,
భూమ్మీది మృగాలు వాటితో కోతకాలాన్ని గడిపేస్తాయి.
7 ఆ సమయంలో సైన్యాలకు అధిపతైన యెహోవాకు
నున్నని చర్మంగల ఎత్తైన మనుషులుండే దేశం నుండి,
అన్ని ప్రాంతాల ప్రజలు భయపడే జనం నుండి,
జయిస్తూ వెళ్లే బలమైన దేశం నుండి,
నదుల వల్ల నేల కొట్టుకుపోయిన దేశం నుండి ఒక బహుమతి తీసుకురాబడుతుంది,
సైన్యాలకు అధిపతైన యెహోవా పేరు పెట్టబడిన స్థలానికి, అంటే సీయోను పర్వతం+ దగ్గరికి అది తీసుకురాబడుతుంది.”