కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • సౌలును రాజుగా అభిషేకించడం (1-16)

      • సౌలును ప్రజల ముందుకు తీసుకురావడం (17-27)

1 సమూయేలు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:13; 2రా 9:2, 3
  • +నిర్గ 19:5; ద్వితీ 32:9
  • +1స 9:16; అపొ 13:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 83

    కావలికోట,

    7/1/2011, పేజీ 19

1 సమూయేలు 10:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 35:19
  • +1స 9:3, 5

1 సమూయేలు 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:19, 22

1 సమూయేలు 10:5

అధస్సూచీలు

  • *

    అంటే, గిలకల తప్పెట.

  • *

    అంటే, ఫ్లూటు.

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

1 సమూయేలు 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:25
  • +1స 10:10

1 సమూయేలు 10:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:15, 16; 11:14

1 సమూయేలు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 14:5, 6; 1స 11:6; 16:13
  • +1స 10:6; 19:23

1 సమూయేలు 10:12

అధస్సూచీలు

  • *

    లేదా “నానుడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:24

1 సమూయేలు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:3

1 సమూయేలు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:5

1 సమూయేలు 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:14; ద్వితీ 4:34

1 సమూయేలు 10:19

అధస్సూచీలు

  • *

    లేదా “వెయ్యేసిమంది ప్రజల గుంపుల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:7; 12:12

1 సమూయేలు 10:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:16-18; అపొ 1:24
  • +1స 9:21

1 సమూయేలు 10:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:21

1 సమూయేలు 10:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:1; 20:18, 28; 1స 23:2

1 సమూయేలు 10:23

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రజలందరూ అతని భుజాల వరకే ఉన్నారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:2

1 సమూయేలు 10:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:14, 15; 1స 9:17

1 సమూయేలు 10:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:11-18

1 సమూయేలు 10:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 10

1 సమూయేలు 10:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 11:12
  • +1రా 10:1, 10; 2ది 17:5

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 10:11స 16:13; 2రా 9:2, 3
1 సమూ. 10:1నిర్గ 19:5; ద్వితీ 32:9
1 సమూ. 10:11స 9:16; అపొ 13:21
1 సమూ. 10:2ఆది 35:19
1 సమూ. 10:21స 9:3, 5
1 సమూ. 10:3ఆది 28:19, 22
1 సమూ. 10:6సం 11:25
1 సమూ. 10:61స 10:10
1 సమూ. 10:81స 7:15, 16; 11:14
1 సమూ. 10:10న్యా 14:5, 6; 1స 11:6; 16:13
1 సమూ. 10:101స 10:6; 19:23
1 సమూ. 10:121స 19:24
1 సమూ. 10:141స 9:3
1 సమూ. 10:171స 7:5
1 సమూ. 10:18నిర్గ 13:14; ద్వితీ 4:34
1 సమూ. 10:191స 8:7; 12:12
1 సమూ. 10:20యెహో 7:16-18; అపొ 1:24
1 సమూ. 10:201స 9:21
1 సమూ. 10:21అపొ 13:21
1 సమూ. 10:22న్యా 1:1; 20:18, 28; 1స 23:2
1 సమూ. 10:231స 9:2
1 సమూ. 10:24ద్వితీ 17:14, 15; 1స 9:17
1 సమూ. 10:251స 8:11-18
1 సమూ. 10:271స 11:12
1 సమూ. 10:271రా 10:1, 10; 2ది 17:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 10:1-27

సమూయేలు మొదటి గ్రంథం

10 అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకొని, సౌలు తలమీద నూనె పోశాడు.+ అతను సౌలును ముద్దుపెట్టుకొని ఇలా అన్నాడు: “యెహోవా నిన్ను తన ప్రజలమీద+ నాయకునిగా అభిషేకించాడు.+ 2 ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్లిపోయాక, బెన్యామీను ప్రాంతంలోని సెల్సహులో ఉన్న రాహేలు సమాధి+ దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనిపిస్తారు. వాళ్లు నీతో ఇలా అంటారు: ‘నువ్వు వెదకడానికి వెళ్లిన గాడిదలు దొరికాయి, కానీ ఇప్పుడు మీ నాన్న గాడిదల సంగతి వదిలేసి+ మీ గురించి కంగారుపడుతున్నాడు. అతను, “నా కుమారుడు ఇంతవరకు రాలేదు, నేనేం చేయాలి?” అని అంటున్నాడు.’ 3 నువ్వు అక్కడి నుండి తాబోరులోని పెద్ద చెట్టు వరకు వెళ్లు; అక్కడ నీకు బేతేలులోని+ సత్యదేవుని దగ్గరికి వెళ్తున్న ముగ్గురు మనుషులు ఎదురౌతారు. వాళ్లలో ఒకతను మూడు మేకపిల్లల్ని, ఇంకొకతను మూడు రొట్టెల్ని, మరొకతను పెద్ద కుండలో ద్రాక్షారసాన్ని తీసుకెళ్లడం నువ్వు చూస్తావు. 4 వాళ్లు నీ బాగోగుల గురించి అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు, నువ్వు వాళ్ల దగ్గర నుండి వాటిని తీసుకోవాలి. 5 ఆ తర్వాత నువ్వు ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉన్న సత్యదేవుని కొండ దగ్గరికి చేరుకుంటావు. నువ్వు నగరానికి వచ్చినప్పుడు, ఉన్నత స్థలం నుండి కిందికి వస్తున్న ప్రవక్తల గుంపు ఒకటి నీకు కనిపిస్తుంది. వాళ్లు ప్రవచిస్తుండగా ప్రజలు తంతివాద్యం, కంజీర,* పిల్లనగ్రోవి,* వీణ* వాయిస్తూ వాళ్ల ముందు వెళ్తుంటారు. 6 అప్పుడు యెహోవా పవిత్రశక్తి నీమీదికి వస్తుంది,+ నువ్వు వాళ్లతో కలిసి ప్రవచిస్తావు, నువ్వు వేరే వ్యక్తిగా మారిపోతావు.+ 7 ఈ సూచనలు జరిగినప్పుడు, నీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయి. ఎందుకంటే సత్యదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. 8 తర్వాత నాకన్నా ముందు గిల్గాలుకు+ దిగివెళ్లు. దహనబలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి వస్తాను. నేను నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఏడురోజులు వేచివుండాలి. తర్వాత నేను వచ్చి నువ్వు ఏంచేయాలో చెప్తాను.”

9 సౌలు సమూయేలు దగ్గర నుండి వెళ్లడానికి వెనక్కి తిరగగానే, దేవుడు సౌలు హృదయాన్ని మార్చడం మొదలుపెట్టాడు, ఈ సూచనలన్నీ ఆ రోజు నిజమయ్యాయి. 10 కాబట్టి సౌలు, అతని సేవకుడు అక్కడి నుండి కొండ దగ్గరికి వెళ్లారు, అక్కడ సౌలుకు ప్రవక్తల గుంపు ఒకటి కనిపించింది. వెంటనే దేవుని పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది,+ అతను వాళ్లతోపాటు ప్రవచించడం మొదలుపెట్టాడు.+ 11 సౌలు ప్రవక్తలతోపాటు ప్రవచించడం చూసి అంతకుముందు అతని గురించి తెలిసినవాళ్లందరూ, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ఒక ప్రవక్తా?” అని చెప్పుకున్నారు. 12 అప్పుడు అక్కడున్న ఒకతను, “ఇంతకీ వాళ్ల తండ్రి ఎవరు?” అన్నాడు. అలా, “సౌలు కూడా ఒక ప్రవక్తా?” అనే సామెత* పుట్టింది.+

13 అతను ప్రవచించడం పూర్తయిన తర్వాత ఉన్నత స్థలానికి వచ్చాడు. 14 తర్వాత సౌలువాళ్ల నాన్న సహోదరుడు సౌలును, అతని సేవకుణ్ణి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. దానికి సౌలు, “గాడిదల్ని వెదకడానికి వెళ్లాం,+ కానీ అవి అక్కడ కనిపించకపోయేసరికి సమూయేలు దగ్గరికి వెళ్లాం” అన్నాడు. 15 అప్పుడు సౌలువాళ్ల నాన్న సహోదరుడు, “సమూయేలు నీతో ఏమన్నాడో దయచేసి నాకు చెప్పు” అని అన్నాడు. 16 సౌలు అతనితో ఇలా అన్నాడు: “గాడిదలు దొరికేశాయని అతను మాకు చెప్పాడు.” కానీ తాను రాజు అవుతానని సమూయేలు చెప్పిన మాటను అతనికి చెప్పలేదు.

17 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయుల్ని మిస్పాలో యెహోవా ఎదుట సమావేశపర్చి,+ 18 వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చింది నేనే; ఐగుప్తు చేతిలో నుండి,+ మిమ్మల్ని అణచివేస్తున్న రాజ్యాలన్నిటి చేతిలో నుండి నేనే మిమ్మల్ని రక్షించాను. 19 కానీ ఈ రోజు మీరు, మీ కష్టాలన్నిటి నుండి, బాధలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడినైన నన్ను తిరస్కరించి,+ “లేదు, నువ్వు మా మీద ఒక రాజును నియమించాలి” అన్నారు. ఇప్పుడు మీరు మీ గోత్రాల ప్రకారం, మీ కుటుంబాల* ప్రకారం యెహోవా ఎదుట నిలబడండి.’ ”

20 దాంతో సమూయేలు ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ ముందుకు రప్పించాడు,+ అప్పుడు బెన్యామీను గోత్రం ఎంపిక చేయబడింది.+ 21 తర్వాత అతను బెన్యామీను గోత్రంవాళ్లను కుటుంబాల ప్రకారం ముందుకు రప్పించాడు. అప్పుడు మథ్రీయుల కుటుంబం ఎంపిక చేయబడింది. చివరికి, కీషు కుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు.+ కానీ అతన్ని వెదకడానికి వెళ్లినప్పుడు అతను ఎక్కడా కనిపించలేదు. 22 కాబట్టి వాళ్లు, “అతను ఇంకా ఇక్కడికి రాలేదా?” అని యెహోవా దగ్గర విచారణ చేశారు.+ దానికి యెహోవా, “అదిగో అతను సామాను మధ్య దాక్కున్నాడు” అని చెప్పాడు. 23 కాబట్టి వాళ్లు పరుగెత్తుకొని వెళ్లి అక్కడి నుండి అతన్ని తీసుకొచ్చారు. అతను ప్రజల మధ్య నిలబడినప్పుడు అతను ప్రజలందరి కన్నా ఎత్తుగా ఉన్నాడు.*+ 24 సమూయేలు ప్రజలందరితో, “యెహోవా ఎంపిక చేసిన వ్యక్తిని+ చూశారా? ప్రజలందరిలో అతనిలాంటి వ్యక్తి లేనేలేడు” అన్నాడు. అప్పుడు ప్రజలందరూ, “రాజు దీర్ఘకాలం జీవించాలి!” అని కేకలు వేయడం మొదలుపెట్టారు.

25 రాజులకు ఏమేం అడిగే హక్కు ఉందో సమూయేలు ప్రజలకు వివరించి,+ వాటిని ఒక పుస్తకంలో రాసి దాన్ని యెహోవా ముందు పెట్టాడు. తర్వాత సమూయేలు ప్రజలందర్నీ వాళ్లవాళ్ల ఇళ్లకు పంపించాడు. 26 సౌలు కూడా గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు. యెహోవా ఎవరి హృదయాల్ని కదిలించాడో ఆ యోధులు అతని వెంట వెళ్లారు. 27 కానీ కొంతమంది పనికిమాలినవాళ్లు, “ఈ వ్యక్తి మనల్ని ఎలా రక్షిస్తాడు?”+ అని అన్నారు. దాంతో వాళ్లు అతన్ని చులకనగా చూసి, అతని కోసం ఏ కానుకా తీసుకురాలేదు.+ కానీ సౌలు దాని గురించి ఏమీ మాట్లాడలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి