కీర్తనలు
యాత్ర కీర్తన.
2 నువ్వు నీ కష్టార్జితాన్ని తింటావు.
సంతోషంగా ఉంటూ వర్ధిల్లుతావు.+
3 నీ ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షతీగలా ఉంటుంది;+
నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవాకు భయపడే వ్యక్తి
ఈ విధంగా దీవించబడతాడు.+
5 యెహోవా సీయోనులో నుండి నిన్ను దీవిస్తాడు.
నువ్వు బ్రతికినన్ని రోజులు యెరూషలేము వర్ధిల్లడం నువ్వు చూడాలి,+
6 నీ కుమారుల కుమారుల్ని నువ్వు చూడాలి.
ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి.